కొనుగోలుదారుల్లో ఆసక్తి రేపడానికే ఇదంతా...!!

నూతన ఇంజన్ జోడింపుతో, సరికొత్త డిజైన్ మార్పులతో టయోటా తమ యారిస్ హ్యాచ్‌బ్యాక్‌ ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరించింది. ప్రపంచ వాహన ప్రదర్శన వేదిక జెనీవా మోటార్ షో ప్రారంభానికి ముందుగా యారిస్‌ను ఆవిష్కరించింది.

Written By:

జపాన్ ప్యాసింజర్ కార్ల దిగ్గజం టయోటా మోటార్స్ యారిస్ ఫేస్‌లిఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ యొక్క మొదటి ఫోటోను విడుదల చేసింది. అయితే త్వరలో ప్రారంభం కానున్న 2017 జెనీవా మోటార్ షో వేదిక మీద ప్రదర్శనకు రానుంది. యారిస్‌తో పాటు వియోస్ సెడాన్ కూడా త్వరలో ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది.

ప్రస్తుతం యారిస్ హ్యాచ్‌బ్యాక్ డిజైన్ పరంగా అనేక మార్పులకు గురైంది. మునుపటి యారిస్ కన్నా ఇప్పుడు మరింత స్పోర్టివ్ రూపాన్ని సంతరించుకుంది.

ఫేస్‌లిఫ్ట్ యారిస్ ముందు రూపం ఇప్పుడు మరింత అగ్రెసివ్‌గా ఉంది. సరికొత్త పదునైన హెడ్‌ల్యాంప్స్ మరియు ముక్కును పోలిన ఆకారంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్ దీని ముందు భాగానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

సరికొత్త టెయిల్‌ గేట్ జోడింపుతో పాటు, చతుర్బుజాకారంలో ఉన్న టెయిల్ లైట్లకు నాలుగు వైపులా చిన్న చిన్న ఎల్ఇడి యూనిట్లను అందివ్వడం జరిగింది. కొనుగోలుదారులు ఇప్పుడు విభిన్న అల్లాయ్ వీల్స్ మరియు రెండు నూతన ఎక్ట్సీరియర్ కలర్ ఆప్షన్‌లలో కూడా ఎంచుకోవచ్చు.

2017 యారిస్ ఫేస్‌లిఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఇంటీరియర్‌లో రీడిజైన్ చేయబడిన ఇంస్ట్రుమెంట్ ప్యానల్ మీద 4.2-అంగుళాల పరిమాణం గల కలర్ డిస్ల్పే కలదు, గుండ్రటి ఆకారంలో ఉన్న ఏ/సి గొట్టాలు, నూతన ఇంటీరియర్ కలర్, అధునాతన అప్‌హోల్‌స్ట్రే( ఇంటీరియర్ లోని పై భాగం) మరియు స్విచ్ గేర్‌ ఆప్షన్ కూడా పరిచయం చేశారు.

ప్రస్తుతం యారిస్‌లో ఉన్న 1.33-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ స్థానంలోకి 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అందిస్తోంది.

1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 110బిహెచ్‌పి పవర్ మరియు 136ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. సివిటి గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది కేవలం 11 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

జెనీవా మోటార్ షో వాహన ప్రదర్శన వేదిక మీద యారిస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించిన అనంతరం యూరోపియన్ మార్కెట్లోకి విడుదల చేసే నాటికి 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న మరో హైబ్రిడ్ ఇంజన్ వేరియంట్‌ను కూడా పరిచయం చేయనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న అత్యంత ఖరీదైన మరియు అత్యుత్తమ ఎమ్‌పీవీ టయోటా ఇన్నోవా క్రిస్టా. దీని అద్బుతమైన డిజైన్, ఫీచర్లు, ఆకర్షణీయమైన ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ లతో పాటు అధునాత భద్రత ఫీచర్లను కలిగి ఉంది. టయోటాకు భారీ విక్రయాలు సాధించిపెట్టిన ఇన్నోవా క్రిస్టా ఫోటోల చూడాలంటే క్రింది గ్యాలరీ మీద ఓ లుక్కేసుకోండి.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
India-Bound 2017 Toyota Yaris Revealed Ahead Of Geneva Motor Show
Please Wait while comments are loading...

Latest Photos