ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మరియు అటానమస్ శ్రేణిలో ఫోర్డ్ నుండి 7 వెహికల్స్

Written By:

ఫోర్డ్ మోటార్స్ త్వరలో మార్కెట్లోకి ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మరియు అటానమస్ శ్రేణిలోకి సుమారుగా ఏడు కొత్త వాహనాలను విడుదల చేయడానికి సిద్దమైంది. సందర్భానుసారంగా వాటిని ఎప్పటికప్పుడు ఆవిష్కరిస్తూ వచ్చింది. ఫోర్డ్ మోటార్స్ అమెరికాలో ఒక నూతన తయారీ ప్లాంటు నిర్మాణం కోసం 6 బిలియన్ డాలర్లను వెచ్చిస్తోంది. అయితే ఈ నూతన వాహనాల తయారీకి కొత్తగా నిర్మిస్తున్న ప్లాంటును వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

మసాచుసెట్స్ లోని ఫోర్డ్ ఫ్యాక్టరీలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మరియు అటానమస్ కార్లను ఉత్పత్తి చేసే ఉద్దేశంతో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఫోర్డ్ సిద్దంగా ఉంది. భవిష్యత్తులో ఫోర్డ్ విడుదల చేయనున్న ఈ ఏడు వాహనాల గురించి ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం రండి.

ఫోర్డ్ యొక్క తొలి ఉత్పత్తి పూర్తి స్థాయి స్మాల్ ఎలక్ట్రిక్ ఎస్‌యువి. దీనిని 2020 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యువి కనిష్టంగా 300 మైళ్లు ఉండే విధంగా నిర్మిస్తోంది. దీనిని నార్త్ అమెరికా, యూరప్ మరియు ఆసియా దేశాలలో విక్రయించనుంది.

తరువాత వాహనం పూర్తి స్థాయి అటానమస్, అంటే ఇందులో డ్రైవర్ అవసరం అస్సలు ఉండదు. అందరూ ప్రయాణికులే ఉంటారు. అందుకోసం స్టీరింగ్ వీల్ తో బ్రేక్ పెడల్స్ ను కూడా తొలగిస్తోంది ఫోర్డ్. ఈ ఫుల్లీ అటానమస్ వాహనాన్ని 2021 నాటికి పూర్తి స్థాయిలో పరిచయం చేయనుంది ఫోర్డ్.

ఫోర్డ్ మోటార్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా గరిష్ట విక్రయాలు సాధిస్తోన్న మోడల్ ఎఫ్-150 పికప్ ట్రక్కు. దీనిని హైబ్రిడ్ వర్షన్‌లో 2020 నాటికి పరిచయం చేయడానికి ఫోర్డ్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఎఫ్-150 హైబ్రిడ్ పికప్ ట్రక్కును నార్త్ అమెరికా మరియు పశ్చిమ మధ్య (Middle East) మార్కెట్లలో ముందుగా పరిచయం చేయనుంది.

ఫోర్డ్ మోటార్స్ ఇప్పుడు అత్యంత శక్తివంతమైన గరిష్ట పనితీరును కనబరిచే మోడళ్ల మీద దృష్టి సారిస్తోంది. ఈ సెగ్మెంట్లో హైబ్రిడ్ మస్టాంగ్‌ను పరిచయం చేయనుంది. అందుకోసం ఇందులో హైబ్రిడ్ వి8 ఇంజన్‌ను ఫోర్డ్ అందివ్వనుంది.

హైబ్రిడ్ మస్టాంగ్ కారును 2020 నాటికి ఆవిష్కరించనుంది. మరియు ముందుగా నార్త్ అమెరికా మార్కెట్లో దీని విడుదల ఉండే అవకాశం ఉంది.

ట్రాన్సిట్ కస్టమ్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ను కూడా పరిచయం చేయడానికి ఫోర్డ్ సిద్దమవుతోంది. ప్రత్యేకించి యూరోపియన్ మార్కెట్ కోసం 2019 నాటికి పూర్తి స్థాయిలో విడుదల చేయనుంది. అన్ని వీధుల్లో కూడా సులభంగా ఆపరేట్‌ చేస్తూ, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండే విధంగా దీనిని అభివృద్ది చేస్తోంది.

పోలీసు అవసరాల కోసం వినియోగించే వాహనాలను హైబ్రిడ్ సాంకేతిక పరిజ్ఞానంతో పరిచయం చేయడానికి ఫోర్డ్ సిద్దమవుతోంది. పోలీసు అవసరాల కోసం ప్రత్యేకించి ఈ వాహనాలను అభివృద్ది చేస్తోంది. ఇప్పటికే చికాగోలో ఓ హైబ్రిడ్ వాహనాన్ని పోలీసులకు డెలివరీ ఇచ్చింది.

ప్రపంచ శ్రేణి యుటిలిటి వాహనాలను హైబ్రిడ్ పరిజ్ఞానంతో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది ఫోర్డ్. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ స్థానంలో ఎకోబూస్ట్ టెక్నాలజీ గల ఇంజన్‌లను అందివ్వనుంది.

రాతితో నిర్మించిన 1982 నాటి హోండా సిఎక్స్500 బైకు
హోండా మోటార్ సైకిల్ ఇలాంటి బైకును ఇంతకుముందెప్పుడూ తయారు చేసిన దాఖలాలు లేవు. అయితే మరి దీనిని ఇలా ఎవరు రూపొందించారు అని ఆయోమయంలో ఉన్నారా...? అయితే చూద్దాం రండి.

 

Read more on: #ఫోర్డ్ #ford
English summary
7 Upcoming Electric, Hybrid, And Autonomous Vehicles From Ford
Please Wait while comments are loading...

Latest Photos