ఇండియాలో కార్ల ఉత్పత్తికి సిద్దమైన వోల్వో

Written By:

వోల్వో ఇండియా విభాగం దేశీయంగా మంచి ఫలితాలను సాధిస్తున్న తరుణంలో ఇక మీదట ఇండియాలోనే తమ ఉత్పత్తుల తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ముగిసే నాటికి ప్రొడక్షన్ ప్రారంభించనున్నట్లు పేర్కొంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీగారు ప్రారంభించిన "మేకిన్ ఇండియా" ప్రేరణతో ఇండియాలో వోల్వో తమ కార్లను తయారు చేయడానికి ముందుకు వచ్చింది. బెంగళూరులో ఉన్న వోల్వో ప్రొడక్షన్ ప్లాంటులో తయారీని ప్రారంభించనుంది.

వోల్వోకు చెందిన ఎస్‌పిఎ మోడ్యులర్ వెహికల్ ఆర్కిటెక్చర్ ఆధారంతో తమ ఉత్పత్తులను తయారు చేయనుంది. తమ మొదటి ఉత్పత్తిగా ఎక్స్‌సి90 ప్రీమియమ్ సెడాన్ కారును ఉత్పత్తి చేయనుంది.

తొలి దశలో ఎక్స్‌సి 90తో ప్రొడక్షన్ ప్రారంభించి, మలి దశలో మరిన్ని ఇతర మోడళ్ల ఉత్పత్తికి ప్లాన్ చేస్తోంది వోల్వో. ఉత్పత్తిని వీలైనంత త్వరగా ఆరంభించేందుకు వోల్వో కార్స్ ఇండియా వోల్వో గ్రూపు మరియు పెంటా ఇంజన్ తయారీదారులతో మంతనాలు జరుపుతోంది.

వోల్వో గ్రూపుకు బెంగళూరులో ఇప్పటికే ఉన్న తయారీ కేంద్రంలో ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. తయారీ పరంగా ఇది వరకే తీసుకున్న అనుమతులు ఉండటం వోల్వోకు ఆర్థికంగా కలిసొస్తోంది.

వోల్వో కార్స్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఎక్జ్సిక్యుటివ్ హకన్ శామ్యులెస్సన్ మాట్లాడుతూ, ఈ ఏడాది పూర్తయ్యేలోపు ఇండియన్ మార్కెట్లో మేడిన్ ఇండియా వోల్వో కార్లను విక్రయాలకు అందుబాటులోకి తీసుకురావడానికి సిద్దమయ్యామని పేర్కొన్నాడు.

దేశీయంగా వోల్వో కార్లను తయారు చేయడం ద్వారా మార్కెట్ వృద్దిని రెండింతలు పెంచుకోవడం, విక్రయాలు పెరగడం మరియు ధరలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని హకన్ తెలిపాడు.

ప్రస్తుతం లగ్జరీ కార్ల మార్కెట్ ఇండియాలో ఆశించినంత మేర లేదు. అయితే రానున్న కాలంలో మార్కెట్ పుంజుకునే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 5 శాతం ప్రీమియమ్ మార్కెట్ వాటాను 2020 నాటికి 10 శాతానికి పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Read more on: #వోల్వో #volvo
Story first published: Thursday, May 18, 2017, 16:22 [IST]
English summary
Read In Telugu Volvo To Assemble Cars In India
Please Wait while comments are loading...

Latest Photos