లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఖచ్చితంగా వీటిని పాటించాల్సిందే !!

లాంగ్ డ్రైవ్‌కు ప్లాన్ చేసేవారు గుర్తుంచుకోవాల్సి అతి ముఖ్యమైన టిప్స్ గురించి ఇవాళ్టి స్టోరీలో...

By Anil

ఇంటి నుండి ఆఫీస్‌కు మరియు ఆఫీస్ నుండి ఇంటికి, అడపాదడపా వీకెండ్‌లో సిటి ట్రావెల్ చేసే వాళ్లు ఈ గజిబిజీ లైఫ్‌లో చాలా మందే ఉంటారు. అయితే ఒత్తిడితో కూడిన జీవితానికి స్వస్తి పలికి ప్రశాంతంగా గడపడానికి కార్లలో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లే జంటలూ ఉంటాయి. అందులో మీరు ఉన్నారా...?

లాంగ్ డ్రైవ్‌కు ప్లాన్ చేసేవారు గుర్తుంచుకోవాల్సి అతి ముఖ్యమైన టిప్స్ గురించి ఇవాళ్టి స్టోరీలో...

1. వీటిని వెంట తీసుకెళ్లడం మరువకండి

1. వీటిని వెంట తీసుకెళ్లడం మరువకండి

ఈ సందులో వెళ్లి ఆ సందులో రావడం అన్నంత తేలికగా ఉండదు లాంగ్ డ్రైవ్. కాబట్టి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లే ముందు కారుకు సంభందించిన అన్ని పత్రాలను తీసుకెళ్లడం అస్సలు మరువకూడదు. వెహికల్ ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, పోల్యూషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ లతో పాటుగా టూల్ కిట్, స్పేర్ వీల్, తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. అంతే కాకుండా ఫోన్ నిండా ఛార్జింగ్, ట్యాంక్ నిండా ఇంధనం నింపుకోవడం మరవకండి. రాత్రి వేళల్లో లాంగ్ డ్రైవ్ ఏ మాత్రం సురక్షితం కాదు కాబట్టి వీలైనంత వరకు పగటి పూట ప్లాన్ చేసుకోండి.

2. స్పీడ్ లిమిట్

2. స్పీడ్ లిమిట్

లాంగ్ డ్రైవ్‌కు వెళ్లే ముందు రోజున ఏ రూట్ లో వెళ్లాలో ప్లాన్ చేసుకోండి. మీరు వెళ్లాల్సిన రూటు ఫోర్ వే, టు వే లేదంటే సింగల్ వే నా అనే విషయాన్ని ముందుగా తెలుసుకుని వెళ్లండి. తద్వారా ఎంత వేగంతో వెళ్లవచ్చో ముందే తెలుసుకోవచ్చు. అత్యంత వేగంతో, కేర్ లెస్‌గా డ్రైవ్‌ చేయడాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. గమ్యాన్ని చేరుకునే చేసే ఇంపార్టెంట్ పని ఏం ఉండదు కాబట్టి నెమ్మదిగా వెళ్లడం బెస్ట్.

3. పెద్ద పెద్ద ట్రక్కులు, లారీల మీద కన్నేసి ఉండండి

3. పెద్ద పెద్ద ట్రక్కులు, లారీల మీద కన్నేసి ఉండండి

దేశానికి ఒక చివరి నుండి మరో చివరికి సరుకు రవాణాలో లారీలు ఎంతో కీలకం. చాలా మంది లారీ డ్రైవర్లు ఎంతో దూరం నుండి వస్తుంటారు, కాబట్టి అలసటతో డ్రైవింగ్ మీద శ్రద్ద పెట్టరు. పొరబాటున మీరు వెళ్లే రూట్లోకి అడ్డం వచ్చారంటే అంత వరకు ఆనందంగా సాగుతున్న మీ ప్రయాణానికి పులిస్టాప్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ లాంగ్ డ్రైవ్‌లో లారీలను కనిపెట్టుకుని డ్రైవ్ చేయడం మంచిది.

4. ఒకే లైన్‌లో వెళ్లండి

4. ఒకే లైన్‌లో వెళ్లండి

జాతీయ రహదారుల గుండా లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేయడం చాలా బెస్ట్. జాతీయ రహదారుల్లో నాలుగైదు లైన్లలో వాహనాలు వెళ్లడానికి రహదారు గుర్తులుంటాయి. ఒక లైన్‌ను మాత్రమే ఫాలో అవ్వడం చాలా బెస్ట్. ప్రతి సారి ఓవర్ టేక్ చేయడం, ఒక లైన్ నుండి మరో లైన్‌కు మారడం చేయకండి. ఇలా చేయడం ద్వారా కారు అదుపు తప్పడం, టైర్లు పేలిపోవడం, ఇంధనం త్వరగా అయిపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది.

5. స్పీడ్ బ్రేకర్లు మీద కన్నేసి ఉంచండి

5. స్పీడ్ బ్రేకర్లు మీద కన్నేసి ఉంచండి

ఇండియన్ హై వే లలో ఇప్పటికీ భారీ స్థాయిలో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. వాటిని గుర్తించేందుకు అక్కడక్కడ బోర్డ్‌లు కూడా ఉంటాయి. వాటిని అనుసరించి స్పీడ్ బ్రేకర్లను నెమ్మదిగా అదిగమించడం ఎంతో ఉత్తమం. లేదంటే మీరు వెళుతున్న వేగంతో స్పీడ్ బ్రేకర్లను దాటడానికి ప్రయత్నిస్తే అదుపు తప్పి బోల్తాపడే అవకాశం ఉంటుంది.

6. రోడ్డు సంజ్ఞలను చదువుతూ వెళ్లండి

6. రోడ్డు సంజ్ఞలను చదువుతూ వెళ్లండి

ఇప్పుడు అన్ని జాతీయ రహదారులుపై రూట్లు, వాటి వివరాలు గల బోర్డులను ఉంచారు. వీటి ద్వారా మీరు ప్లాన్ చేసుకున్న రూట్ మిస్సవ్వకుండా వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ప్రయాణంలో ఈ బోర్డులను చదువుతూ వెళ్లడం కూడా ముఖ్యమే.

7. మలుపుల్లో ప్రయాణం

7. మలుపుల్లో ప్రయాణం

మీ లాంగ్ డ్రైవ్ ట్రిప్ లో ఘాట్ రోడ్డు మరియు మలుపులున్న రోడ్లు ఉంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పటికే అలసటతో ఉంటారు కాబట్టి ఘాట్ రోడ్ల మీద వీలైనంత తక్కువ వేగంతో వెళ్లండి. రోడ్డుకు మద్యలో కాకుండా వీలైనంత వరకు ఎడమ వైపున వెళ్లండి. మిమ్మల్ని అధిగమించే వాహనాలకు మరియు మీకు ఎదురుగా వచ్చే వాహనాలకు దారివ్వడం మరువకండి.

8. అలసట

8. అలసట

లాంగ్ డ్రైవ్‌కు వెళ్లినపుడు అలసట మరియు నిద్ర రావడం సహజం. మీ శరీరం విశ్రాంతి కోరుకుంటోంది అని తెలిపే సూచనను కాదని అలాగే డ్రైవ్ చేయడం చాలా ప్రమాదకరం. వెంటనే ప్రక్కకు ఆపేసి, కారు దిగి కాస్త ఫ్రెష్ ఎయిర్ ని తీసుకోండి. వీలైంతే ఒక కాఫీని తీసుకుని రీఫ్రెష్ అవ్వడం బెస్ట్.

9. బ్రేక్ డౌన్

9. బ్రేక్ డౌన్

లాంగ్ డ్రైవ్‌లో ఎన్నో మధురానుభూతులతో పాటు ఇలాంటి అనుభవం పొందిన వాళ్లు చాలా మందే ఉన్నారు. కారు మొరాయించడం, పంక్చర్ అవడం వంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే మీ కారు మొరాయించిందనే విషయాన్ని ఇతర వాహన డ్రైవర్లకు తెలిసేలా కారుకు ముందు మరియు వెనుక వైపున త్రిభుజాకారంలో ఉన్న రేడియమ్ బోర్డ్‌లను ఉచడం మంచిది. తద్వారా వారు అప్రమత్తమవుతారు.

10. మౌనంగా ఉండండి

10. మౌనంగా ఉండండి

ఇప్పటికీ భారతీయ రహదారుల్లో జరుగుతున్న ప్రమాదాల్లో 40 శాతం డ్రైవింగ్ సమయంలో వాదనలు చేయడం ద్వారా జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇతరుల సంభాషణలలో జోక్యం చేసుకోవడం, కోప్పడటం, వాదనలాడటం వంటి వాటిని మానేయండి.

లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తున్నారా..?
  • పొగమంచులో డ్రైవ్ చేస్తున్నారా ? పది లైఫ్ సేవింగ్ టిప్స్..!
  • టైర్ల పేలుడును అరికట్టే మార్గాలు
  • లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తున్నారా..?
    • ఇండియాలో ఉన్న 10 ఉత్తమ కార్ ఇన్సూరెన్స్ సంస్థలు
    • కారులో మంటలు.. కారణాలేంటి..?

Most Read Articles

English summary
Planning A Highway Trip? Here Are 10 Important Tips To Keep In Mind
Story first published: Monday, November 28, 2016, 13:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X