చెన్నై నుండి బెంగళూరుకు 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు

Written By:

చెన్నై నుండి బెంగళూరుకి కేవలం 30 నిమిషల్లో ప్రయాణించవచ్చు. నిద్రుపోతున్నప్పుడు వచ్చే కల కాదు, వీడియో గేమ్ అంతకన్నా కాదు. ఎలోన్ మస్క్ యొక్క హైపర్ లూప్ ద్వారా ఇది సాధ్యమవుతందని తెలిసిన అనంతరం దీని నిర్మాణానికి ప్రతిపాదనలు జరుగుతున్నాయి. ఈ హైపర్ లూప్ తతంగం ఏమిటో పూర్తిగా చూద్దాం రండి.

ప్రజారవాణాలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టిన ఎలోన్ మస్క్ హైపర్ లూప్ సంస్థ కన్ను ఇప్పుడు చెన్నై మీద పడింది. కేవలం అరగంటలో చెన్నై నుండి బెంగళూరు నగరాన్ని చేరుకునే విధమైన ప్రయాణ తమ హైపర్ లూప్ ప్రాజెక్ట్ ద్వారా నూటికి నూరు శాతం సాధ్యమవుతుందని పేర్కొంది.

పిల్లర్ల మీద గుండ్రటి ఆకారంలో ఉన్న గొట్టాల లోపల పెట్టె వంటి నిర్మాణాలు ఉంటాయి. గొట్టాల నిండా గాలి నింపబడి ఉంటుంది. గాలిని అధిక పీడనంతో ప్రసరింపజేయడం ద్వారా అందులో ప్రయాణికులు కూర్చునే పెట్టే గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.

ఈ హైపర్ లూప్ ప్రాజెక్ట్ ను పూర్తి స్థాయిలో అభివృద్ది చేసిన అనంతరం ఇప్పుడు ప్రపంచ దేశాలలో హైపర్ లూప్ రవాణా మార్గాల నిర్మాణాన్ని సిద్దం అవుతోంది హైపర్ లూప్ సంస్థ. ఇప్పుడు దీని కన్ను బెంగళూరు చైన్నై మార్గం మీద పడింది.

హైపర్ లూప్ సంస్థ తెలిపిన వివరాలు మేరకు గంటకు 1,200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలున్న ఇందులో చైన్నై నుండి 30 నిమిషాలలో బెంగళూరును మరో 30 నిమిషాల్లో ముంబాయ్‌ని చేరుకోవచ్చని తెలిపింది.

హైపర్ లూప్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా, ఇండియాలోని చెన్నై-బెంగళూరు, చెన్నెై-ముంబాయ్, బెంగళూరు-తిరువనంతపురం మరియు ముంబాయ్-ఢిల్లీ మధ్య మార్గాలలో హైపర్ లూప్ నిర్మాణానికి అనుకూలతలు ఉన్నాయని తెలిపింది.

హైపర్ లూప్ ప్రతినిధులు దేశయంగా పర్యటనకొచ్చినపుడు కేంద్ర రవాణా శాఖ మంత్రి హైపర్ లూప్ నిర్మాణావకాశాలున్న మార్గాల మరియు వాటి సాధ్యసాద్యాలను గురించి లేఖ ద్వారా సమర్పించారు.

అయితే ఈ నేపథ్యంలో జపాన్ మరియు చైనాకు చెందిన బుల్లెట్ రైళ్ల నిర్మాణ సంస్థలు కూడా హైపర్ లూప్ ప్రతిపాదించిన మార్గాల మధ్య బుల్లెట్ రైళ్ల ట్రాక్‌ల నిర్మాణానికి సంభందించిన అనుకూలతను వివరించాయి.

హైపర్ లూప్ సంస్థ తమ అధికారిక వెబ్‌సైట్ మీద రవాణా ఛార్జీల వివరాలను ప్రచురించింది. బస్సు కన్నా తక్కువ టికెట్ ధరలతో ప్రయాణించవచ్చని, మరియు దూరాన్ని బట్టి కాకుండా ప్రయాణ సమయాన్ని ఆధారం చేసుకుని టికెట్ ధరలను నిర్ణయించవచ్చని పేర్కొంది.

హైపర్ లూప్ యొక్క నిర్వహణ ఖర్చును తగ్గించుకోవడానికి, హైపర్ లూప్ నిర్మాణం పూర్తయిన తరువాత పై భాగంలో సోలార్ పవర్ మరియు పిల్లర్ల మీద గాలి మరలను అమర్చి విద్యుచ్చక్తిని ఉత్పత్తి చేయవచ్చని హైపర్ లూప్ ప్రతినిధులు తెలిపారు.

హైపర్ లూప్ లో ప్రయాణికులు కూర్చునే భాగాన్ని పోడ్ అంటారు, ఈ పోడ్ ల కదలికల కోసం అయస్కాంత శక్తి అవసరం ఉంటుంది. కాబట్టి పోడ్ కదలికలో ఉన్నపుడు మాత్రమే పవర్ అవసరం ఉంటుంది.

రైల్వే శాఖలోకి వచ్చే ఏలాంటి అధునాతన రవాణా సాంకేతకత అయినా అందిపుచ్చుకోవడానికి సిద్దంగా ఉన్నామని, అయితే నిర్మాణానికి పట్టే సమయం మరియు ప్రభుత్వం నుండి అమోదం వంటి అంశాల పరంగా ప్రాజెక్ట్‌లకు అనుమతిలో జాప్యం ఉందని రైల్వే శాఖలోని ఉద్యోగి ఒకరు తెలిపారు.

హై స్పీడ్ రైలు మార్గాన్ని ఒక కిలోమీటర్ నిర్మించడానికి రూ. 300 కోట్ల రుపాయలు ఖర్చవుతుందని, అదే హైపర్ లూప్ ఒక కిలోమీటర్ మేర నిర్మించడానికి కేవలం రూ. 72 కోట్ల చాలని హైపర్ లూప్ తెలిపింది. చెన్నై నుండి బెంగళూరుకి రూ. 6,000 కోట్ల రుపాయలతో హైపర్ లూప్ మార్గాన్ని నిర్మించవచ్చని తెలిసింది.

12,000 కిమీల పొడవైన లండన్-చైనా రైలు మార్గం ప్రారంభం
చైనా నుండి సుమారుగా 12,000 కిలోమీటర్ల దూరం గల లండన్‌కు గూడ్స్ రైలు సర్వీస్ ను ప్రారంభించింది. ఈ మార్గంలో అనేక దేశాలతో చైనా వాణిజ్య వ్యాపారాలను సాగించనుంది.

ఆగలేకపోతున్న చైనా...!!
చైనా సరికొత్త మ్యాగ్నటిక్ లెవిటేషన్ రైలును నిర్మిస్తోంది. ఇది గంటకు 600 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ రైలు కూడా ఈ వేగాన్ని అందుకోలేదు. పూర్తి వివరాలు....

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Thursday, January 19, 2017, 12:40 [IST]
English summary
Hyperloop Selects Chennai To Bengaluru Route For India Debut; Travel Time 30 Minutes
Please Wait while comments are loading...

Latest Photos