ఢిల్లీలో ప్రారంభం కానున్న భారతదేశపు మొట్టమొదటి హెలిపోర్ట్

Written By:

విమానాల ల్యాండింగ్ మరియు టేకాఫ్ కోసం నిర్మించే వాటిని ఎయిర్‌పోర్ట్ అంటాము. అదే హెలికాఫ్టర్ల విషయానికి వస్తే, ఇప్పటి వరకు ఫలానా హెలిపోర్ట్ అంటూ ఏదీ ఉండేది కాదు. అయితే అవసరాన్ని బట్టి హెలికాఫ్టర్ల ల్యాండింగ్ మరియు టేకాఫ్ కోసం తాత్కాలికంగా హెలిప్యాడ్‌లను నిర్మించే వారు. కాని ఇప్పుడు శాస్వతంగా హెలికాఫ్టర్ సేవలందించడానికి ఢిల్లీలో హెలిపోర్ట్‌ను నిర్మించారు. దీని గురించి మరిన్ని వివరాలు నేటి కథనంలో తెలుసుకుందా రండి.

భారతదేశ విమానయాన చరిత్రలో ఇలాంటిది ఇదే మొదటిది. దేశం కోసం జాతీయం చేస్తూ నిర్మించిన ఈ హెలిపోర్ట్ ప్రారంభం 28, 02, 2017 న జరగనుంది. ఇక్కడి నుండి హెలికాఫ్టర్లు రాకపోకలు సాగించనున్నాయి.

100 కోట్ల రుపాయల బడ్జెట్‌తో పవన్ హాన్స్ సంస్థ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఢిల్లీలోని రోహిణి అనే ప్రాతంలో కలదు. ఈ హెలిపోర్ట్ ద్వారా ఢిల్లీ దాని సమీప ప్రాంతాలకు హెలికాఫ్టర్ సేవలందించనున్నారు.

ఢిల్లీలోని హెలిపోర్ట్‌లో సుమారుగా 150 మంది వరకు నివశించే సామర్థ్యం గల ఎయిర్ కండీషన్డ్ ప్యాసింజర్ టెర్మనల్ కలదు.

ఈ హెలిపోర్ట్‌లో ప్రయాణికుల కోసం కార్ పార్కింగ్ జోన్, ఒకే సారి 16 హెలికాప్టపర్లను పార్క్ చేయగల సామర్థ్యం. అదే విధంగా హెలికాఫ్టర్ల నిర్వహణ, రిపేరీ మరియు ఓవర్ హాలింగ్ సౌకర్యాలను కూడా కల్పించడం జరిగింది.

పవన్ హాన్స్ సంస్థ గత ఏడాది వెలువరించిన స్టేట్‌మెంట్ ప్రకారం, ప్రాంతీయంగా వాయు రవాణా సేవలు విస్తరించడానికి కసరత్తులు చేస్తున్నాము, ఢిల్లీకి చుట్టుప్రక్కల ఉన్న ప్రధాన గమ్యస్థానాలకు ఈ హెలిపోర్ట్ నుండి సేవలందించడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిపింది.

ఢిల్లీ నుండి సిమ్లా, హరిద్వార్, డెహ్రాడూన్, మాథురా, ఆగ్రా, మీరట్, పరిశ్రమ ఆధారిత ప్రాంతాలైన మానేసార్ మరియు బహుదుర్గర్ వంటి ప్రాంతాలకు ఈ హెలిపోర్ట్ నుండి సేవలందించనున్నట్లు ప్రకటించింది.

ఏవియేషన్ కార్యదర్శి ఆర్ ఎన్ చౌబే మాట్లాడుతూ, దేశంలో అత్యంత రద్దీతో కూడుకున్న విమానాశ్రయాలలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి. ఈ ఢిల్లీ విమానాశ్రయానికి విమానాల రాకపోకలు ఎక్కువగా ఉండటం వలన హెలికాఫ్టర్ల సేవలకు అంతరాయం కలుగుతున్నట్లు వివరించాడు.

ప్రత్యేకించి హెలికాఫ్టర్ల సేవల కోసం రోహిణి ప్రాంతంలో నిర్మించిన హెలిపోర్ట్ నిజానికి ఢిల్లీ ఎయిక్ ట్రాఫిక్‌ను నియంత్రించడంలో ఎంతో ఉపకరించింది మరియు హెలికాఫ్టర్లు, చాపర్ల సేవలను సులభతరం చేసిందని వివరించాడు.

తక్కువ దూరం ఉన్న గమ్యస్థానాలకు హెలికాఫ్టర్లు కాకుండా మంచి ఎస్‌యూవీ వాహనం ఎంచుకోవాలనుకుంటున్నారా...? అయితే ఫోర్డ్ ఎండీవర్ వాహనం మీద ఓ లుక్కేసుకోండి. అన్ని కోణాలలో ఈ ఎస్‌యూవీని వీక్షించడానికి క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి...

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
India's First Heliport Set To Open In Delhi — Will It Help You Beat The Traffic?
Please Wait while comments are loading...

Latest Photos