సీక్రెట్ రివీల్: రాయల్ ఎన్ఫీల్డ్ బలమేంటో చూపించిన బాహుబలి

Written By:

బాహుబలి ది బిగినింగ్‌లో కాలకేయుని సైన్యం మీదకు దండెత్తిన రానా చక్రంతో ప్రాణాలను హరించే ఓ గుర్రపు భగ్గీని కలిగి ఉండేవాడు తెలుసా... నిజానికి ఆ చక్రం కదలడానికి అందులో ఓ టూ వీలర్ యంత్రాన్ని జక్కన అమర్చినట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు....

దర్శకధీరుడు రాజమౌళి నిర్మించిన బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా సినీప్రేమికుల హృదయాలను దోచుకుంది. విడుదలైన ఆరవ రోజుల కలెక్షన్ 792 కోట్లు. ఇప్పటి వరకు భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను సమూలంగా తుడిచిపెట్టేసింది.

భారీ కలెక్షన్లతో పికె చిత్రం మొదటి స్థానంలో ఉండగా, ఇప్పుడు బాహుబలి 2 మొదటి స్థానంలో నిలిచింది. 1000 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతున్న బాహుబలి 2 ఒక్క హిందీ వెర్షన్ ఆరు రోజుల్లో 375 కోట్లను రాబట్టింది.

ఉత్తర భారత దేశంలో దక్షిణ భారత చిత్రం ఈ తరహాలో ఆదరణ పొందడం ఇదే ప్రథమం. ఈ చారిత్రాత్మక విజయపు క్రెడిట్ ఈ చిత్రానికి పనిచేసిన కొన్ని వేల మందికి సొంతం అని చెప్పాలి. ముఖ్యంగా ఇందులో వినియోగించిన ఆయుధ సామాగ్రి ప్రత్యేక డిజైన్‌లలో ఉంది.

ఆయుధ సామాగ్రి అంటే బాహుబలిలో రానా వినియోగించిన కత్తుల రథం. విభిన్నమైన డిజైన్‌లో ఉన్న ఈ కత్తుల రథంలో ముందు వైపు శత్రువులను హరించే కత్తుల చక్రం తిరగడానికి ఇందులో ఓ టూ వీలర్ ఇంజన్ వినియోగించాడంట.

బాహుబలిలో కళ్లను కట్టేసి ఆకృతుల రూపకర్త సాబు సిరిల్. ఈ కత్తుల రథాన్ని నిర్మించింది కూడా ఈయనే. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రథం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.

కత్తుల రథంలో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్ వినియోగించాడు. ఎక్కువ శక్తి మరియు రథం యొక్క వేగం గరిష్టంగా ఉండటానికి దీనిని ఎంచుకున్నట్లు తెలిపాడు.

మునుపటి బాహుబలిలో వినియోగించిన రథంలో స్టీరింగ్ వీల్ అందించి డ్రైవర్ కూర్చోడానికి ప్రత్యేకమైన సీటును కూడా రూపొందించారు. దీని నిర్మాణంలో చాలా ఎంజాయ్ చేసామని, అదొక మరిచిపోలేని అనుభూతి అని 55 ఏళ్ల వయస్సున్న సాబు సిరిల్ చెప్పుకొచ్చాడు.

అయితే కత్తుల రథంలో వినియోగించింది 350సీసీ లేదా 500సీసీ సామర్థ్యం ఉన్న ఇంజనా అనే విషయం వెల్లడించలేదు. చారిత్రాత్మక చిత్రంలో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్‌ను వినియోగించడం నిజానికి రాయల్ ఎన్పీల్డ్‌కు గర్వకారణం.

ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ వద్ద నాలుగు శక్తివంతమైన ఇంజన్‌లు ఉన్నాయి, అందులో ఒకటి, 346సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్ గరిష్టంగా 19.8బిగహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

అదే విధంగా 499సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్ గరిష్టంగా 27.2బిహెచ్‌పి పవర్ మరియు 41.3ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

అంతే కాకుండా తక్కువ బరువుతో, అత్యంత వేగంతో పరుగులు పెట్టే శక్తివంతమైన రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెన్షియల్ జిటి మోటార్ సైకిల్‌లో 535సీసీ సామర్థ్యం గల ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 29.1బిహెచ్‌పి పవర్ మరియు 44ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

రాయల్ ఎన్ఫీల్డ్ చివరగా విపణలోకి విడుదల చేసిన మోడల్ హిమాలయన్ అడ్వెంచర్ బైకు. ఇందులో 24.5బిహెచ్‌పి పవర్ మరియు 32ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 411సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్ కలదు.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Thursday, May 4, 2017, 18:23 [IST]
English summary
Read In Telugu This Engine Powered The Baahubali Chariot
Please Wait while comments are loading...

Latest Photos