పట్టాలు తప్పిన రైలు... నుజ్జునుజ్జయిన 120 బిఎమ్‌డబ్ల్యూ కార్లు: వీడియో

Written By:

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్-బ్యాడ్జ్ ఎస్‌యువిలు మరియు క్రాసోవర్లు మొత్తం కలిపి 120 వాహనాలను అమెరికాలోని దక్షిణ కరోలినాలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ప్లాంటులో ఉత్పత్తి చేశారు. ఇక్కడి నుండి అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేస్తున్న సమయంలో రైలు పట్టాలు తప్పి 120 కార్లు డ్యామేజ్ అయ్యాయి.

రెండు ఇంజన్‌లు 12 భోగీలతో 120 కార్లను లోడు చేసుకుని బయలుదేరిన రైలు దక్షిణ కరోలినాలోని జెన్కిన్స్‌విల్లే అనే ప్రాంతంలో పట్టాలు తప్పింది. డిసెంబర్ 4, 2016 వ రోజున జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 120 కార్లు ధ్వంసం అయ్యాయి.

ప్రమాదానికి గురైన భోగీల్లో ఇద్దరు సిబ్బంది ఉండగా వారిని సమీప హాస్పిటల్‌కు తరలించి వైద్యసేవలందించారు. ఘటనా స్థలికి రైల్వే అధికారు చేరుకుని పట్టాలు తప్పిన రెండు ఇంజన్‌లను మరియు నాలుగు భోగీలను మళ్లీ పట్టాలెక్కించారు.

ఇదే రైలు ప్రమాదంలో మిగిలిన ఎనిమిది భోగీలు కూడా స్వల్పంగా ధ్వంసం అయ్యాయి. అయితే వాటికి మరమ్మత్తులు నిర్వహించి వినియోగించుకోవాల్సి ఉంటుంది.

ప్రమాదం జరిగిన అదే ఆదివారం మధ్యాహ్నం, ఈ ప్రమాదానికి సంభందించి బిఎమ్‌డబ్ల్యూ ఓ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం, నార్ఫోక్ సదరన్ రైల్ కార్ ద్వారా బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ మోడల్ కార్లను అంతర్జాతీయ మార్కెట్ కోసం ప్లాంటు నుండి సమీపం ఛార్లెస్‌స్టోన్ పోర్ట్‌కు తరలించే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని బిఎమ్‌డబ్ల్యూ తెలిపింది.

ఈ ప్రమాదంలో మొత్తం 120 కార్లు ధ్వంసం అయ్యాయి. రైల్వే అధికారులతో చర్చించి వీటి నష్టాలను వివవరించనున్నట్లు బిఎమ్‌డబ్ల్యూ తెలిపింది.

అయితే రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ప్రమాదం జరిగిన మార్గంలో ట్రాక్‌కు మరమ్మత్తులు నిర్వహించి సోమవారం నుండి రైళ్ల రాకపోకలకు వీలు కల్పించారు.

మొత్తం 120 కార్లు చాలా వరకు కార్ల పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. అయితే అందులో కొన్నింటికి రిపేరి చేసి యథావిధిగా అమ్మేసి నష్టాన్ని తగ్గించుకోనున్నుంది.

రైలు పట్టాలు తప్పడం ద్వారా ధ్వంసమైన బిఎమ్‌డబ్ల్యూ కార్లను ప్రొక్లేన్లతో తొలగిస్తున్న లఘ చిత్రం....

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Wednesday, December 7, 2016, 10:17 [IST]
English summary
Train Carrying BMWs Derails; 120 Ultimate Driving Machines Damaged
Please Wait while comments are loading...

Latest Photos