విడుదల కంటే ముందుగా డీలర్ల వద్దకు చేరిన బజాజ్ పల్సర్ 150

2017 బజాజ్ పల్సర్ 150 విడుదల కంటే ముందుగా డీలర్ల వద్దకు చేరింది. 2016 డిసెంబర్ లో దీని విడుదల జరగాల్సి ఉంది. 2017 వేరియంట్ పల్సర్ గురించి పూర్తి వివరాలు...

By Anil

బజాజ్ ఆటో తమ పల్సర్ శ్రేణిలో ఉన్న ఉత్పత్తులను 2017 సిరీస్‌లో విడుదల చేయనున్నట్లు గతంలో వెల్లడించింది. అందులో పల్సర్ 180 మరియు పల్సర్ 220ఎఫ్ మోడళ్లను గతంలో ప్రదర్శించింది.

2017 బజాజ్ పల్సర్ 150

బజాజ్ ఆటో తమ ఉత్పత్తులను అధికారికందా విడుదల చేయకుండానే కొంత మంది బజాజ్ డీలర్ల వద్దకు చేరింది. తాజాగ 2017 సిరీస్‌కు చెందిన పల్సర్ 150 మోడల్‌ హైదరాబాద్‌లోని డీలర్ వద్ద కెమెరా కంటికి చిక్కింది.

2017 బజాజ్ పల్సర్ 150

సరికొత్త 2017 పల్సర్ 150 ను మునుపటి దానితో పోల్చితే స్పష్టమైన మార్పులు గుర్తించవచ్చు. అయితే మునుపటి పల్సర్‌కు దీనికి మధ్య పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు.

2017 బజాజ్ పల్సర్ 150

రెడ్ మరియు బ్లాక్ రంగులో ఉన్న బాడీ డీకాల్స్ మీదకు దృష్టి మళ్లడం ఖాయం. బాడీ డీకాల్స్ మాత్రమే కాదు అల్లాయ్ వీల్స్ మీద కూడా బ్లాక్ అండ్ రెడ్ స్టిక్కరింగ్ గుర్తించవచ్చు.

2017 బజాజ్ పల్సర్ 150

ఈ 2017 పల్సర్ 150 లో బిఎస్-IV లేకపోవడం గమనార్హం. కాబట్టి, కేవలం పల్సర్ 180 మరియు పల్సర్ 220ఎఫ్ మోడళ్లలో మాత్రమే బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌తో రానున్నాయి.

2017 బజాజ్ పల్సర్ 150

సరికొత్త పల్సర్ 150 లో సౌకర్యవంతమైన సీటును అందించారు. ప్రస్తుతం ఉన్న వర్షన్‌తో పోల్చుకుంటే అప్‌గ్రేడెట్ కుషనింగ్ మరియు గ్రిప్పర్‍‌తో ఉన్న స్పెన్షన్‌కు థ్యాంక్స్ చెప్పవచ్చు.

2017 బజాజ్ పల్సర్ 150

ఇంత వరకు గమనించిన అంశాలు మినహా, అదే ఆరేంజ్ బ్యాక్‌లిట్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కలదు. అయితే పల్సర్ 180 మరియు పల్సర్ 220ఎఫ్ లలో బ్లూ బ్యాక్‌లిట్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కలదు.

2017 బజాజ్ పల్సర్ 150

సిటి రైడర్ల కోసం సౌలభ్యంగా ఉండేందుకు ట్యూబ్ లెస్ టైర్లను కూడా అందించారు. సరికొత్త బజాజ్ పల్సర్ 150 యొక్క ధర రూ. 73,513 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉండే అవకాశం ఉంది.

2017 బజాజ్ పల్సర్ 150

సరికొత్త 2017 పల్సర్ 150 మార్కెట్లోకి పూర్తి స్థాయిలో అమ్మకాలకు సిద్దమైతే టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160, ఎక్స్‌స్ట్రీమ్ స్పోర్ట్స్ మరియు హోండా సిబి యునికార్న్ 150 లకు పోటీగా నిలవనుంది.

2017 బజాజ్ పల్సర్ 150

  • ఎగిరే కార్లను ట్యాక్సీలుగా పరిచయం చేయనున్న ఉబర్
  • జిపిఎస్ న్యావిగేషన్ ఎలా పనిచేస్తుంది. కారులో జిపిఎస్ తప్పనిసరా...?

Most Read Articles

Read more on: #బజాజ్
English summary
2017 Bajaj Pulsar 150 Reaches Dealerships Ahead Of Launch
Story first published: Tuesday, November 29, 2016, 18:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X