విడుదలకు సిద్దమైన 2017 కెటిఎమ్ డ్యూక్ 390: సమగ్ర వివరాలు క్లుప్తంగా

Written By:

ఆస్ట్రియన్ ఆధారిత ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ కెటిఎమ్ తమ 2017 డ్యూక్ 390 మోడల్‌ను మిలాన్‌లో జరిగిన 2016ఎకిమా మోటార్ సైకిల్ షో వేదిక మీద ప్రదర్శించింది. తాజాగ అందుతున్న సమాచారం ప్రకారం 2017 డ్యూక్ 390 బైకును వచ్చే జనవరిలో దేశీయంగా తమ లైనప్‌లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

2017 జనవరిలో విడుదలకు సిద్దమైన కెటిఎమ్ డ్యూక్ 390 మోడల్‌ యొక్క డెలివరీలు ఏప్రిల్ నుండి ప్రారంభం కానున్నాయి. వీటిని 20,000 నుండి 30,000 రుపాయల వరకు చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

కెటిఎమ్ వచ్చే ఏడాది నుండి పూనేలో ఉన్న బజాజ్ ఆటో తయారీ ప్లాంటు నుండి డ్యూక్ 125, డ్యూక్ 200, డ్యూక్ 250 మరియు డ్యూక్ 390 మోడళ్లను అంతర్జాతీయ మార్కెట్ కోసం ఉత్పత్తి చేయనుంది.

కెటిఎమ్ విడుదల చేయనున్న డ్యూక్ 390 మోడల్‌కు ఇండియన్ మార్కెట్ మంచి అవకాశంగా పరిణమించనుంది. మరియు దేశీయంగానే వీటి ఉత్పత్తి జరగడం వలన ధర కూడా కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇదే మోడల్‌తో పోల్చుకుంటే 2017 కెటిఎమ్ డ్యూక్ 390 మోడల్ డిజైన్ పరంగా మరింత పదునై లక్షణాలతో తీర్చిదిద్దబడింది. దీని తోబుట్టువు కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ పోలికలను ఇందులో గుర్తించవచ్చు.

బాగా గుర్చించదగిన మార్పుల్లో అత్యంత అగ్రెసివ్‌గా ఉన్న హెడ్ ల్యాంప్, రీ డిజైన్ చేయబడిన ఫ్యూయల్ ట్యాంక్, షార్ప్ సస్పెన్షన్ మరియు అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్ కలదు.

బైకు స్టార్ట్ చేసే కీ స్లాట్‌ను ఇంధన ట్యాంకు మీద అందించారు, మునుపటిలా పొట్టిగా ఉండే సైలెన్సర్ స్థానంలో పొడవాటి ఎగ్జాస్ట్ పైపును అందించారు . గతంలో కన్నా ఈ బైకు మరింత ఎక్కువ ఆరేంజ్ రంగును పులుముకుంది.

2017 కెటిఎమ్ డ్యూక్ 390 బైకు 373.2సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌తో రానుంది, ఇది సుమారుగా 44బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు.

ఈ సరికొత్త 2017 కెటిఎమ్ డ్యూక్ 390 లో రైడ్ బై వైర్ థ్రోటిల్ సిస్టమ్, కలర్ లో ఉన్న టిఎఫ్‌టి ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, మై రైడ్ మల్టీ మీడియా ఇంటర్‌ఫేస్ మరియు అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో రానుంది.

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 2017 కెటిఎమ్ డ్యూక్ 390 బైకులను 2017 ఏప్రిల్ నాటికి రోడ్ల మీద చూడవచ్చు. అయితే దీని ధరకు సంభందించిన వివరాలు ఇంకా విడుదల కాలేదు.

 

English summary
2017 KTM Duke 390 To Be Launched In India In January — Deliveries To Commence From April
Please Wait while comments are loading...

Latest Photos