కొత్త రంగుల్లో మెరుస్తున్న 2017 రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్
రాయల్ ఎన్ఫీల్డ్ వారి క్లాసిక్ లైనప్‌లోకి అప్‌డేటెడ్ మోడళ్లను 2017 ప్రారంభానికి మార్కెట్లోకి విడుదల చేయనుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ నూతన సంవత్సరానికి తమ క్లాసిక్ బైకులను నూతన రంగుల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. అత్యంత రహస్యంగా ఎన్పీల్డ్ బైకుల ప్రేమికులను ఆశ్చర్యపరచడానికి సిద్దమైంది. అయితే మా డ్రైవ్‌స్పార్క్ పాఠకుడు ఈ నూతన క్లాసిక్ బైకుల ఫోటోలను పాఠకులతో పంచుకోవడానికి మాకు చేరవేశాడు.
ఫోటోలు మరియు ఇతర వివరాలు గురించి పూర్తిగా తెలుసుకుందాం....

రహస్యంగా విడుదలైన ఫోటోలలో క్లాసిక్ 350, మరియు క్లాసిక్ 500 బైకులు విభిన్న కొత్త రంగులను పులుముకున్నాయి. తమ పోర్ట్‌ఫోలియో లోని ఉత్పత్తులను ఎప్పటికప్పుడు కొత్త లుక్‌తో పరిచయం చేయడానికి రాయల్ ఎన్ఫీల్డ్ ప్రయత్నిస్తోంది.

రహస్యంగా విడుదలైన చిత్రాలను పరిశీలిస్తే నూతన పెయింట్ స్కీం, కొన్ని స్టిక్కర్లతో పాటు తెల్లటి బార్డర్ లైన్లు గల సీట్లను మనం గమనించవచ్చు...

ఇక రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 మోడల్ జిటి బ్లూ మరియు జిటి రెడ్ కలర్స్‌లో పరిచయం అయ్యింది. గతంలో రాయల్ ఎన్ఫీల్డ్ ముందుగా ఈ రెండు రంగులను కాంటినెన్షియల్ జిటిలో పరిచయం చేసింది.

2017 నాటికి విడుదల కానున్న రాయల్ ఎన్పీల్డ్ క్లాసిక్ మోటార్ సైకిళ్లలో కలర్ మరియు చిన్న చిన్న అప్‌డేట్స్ మినహాయించి సాంకేతికంగా ఎలాంటి మార్పులకు గురికాలేదు.

రాయల్ ఎన్ఫీల్డ్ గత మూడేళ్ల నుండి దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకాల పరంగా మంచి వృద్దిని సాధిస్తోంది. విక్రయాల్లో ఎక్కువ వాటా సొంతం చేసుకోవడానికి నూతన ఏడాది కోసం నూతన శైలిలో తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టనుంది.

విభిన్న మార్పులకు గురైన రాయల్ ఎన్ఫీల్డ్ ఉత్పత్తులు 2017 ఏడాది ప్రారంభం నుండే కస్టమర్లకు అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. స్వల్పంగా మార్పులకు గురైన వీటి ధరలు కూడా స్వల్ప మేరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరిన్ని ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి తెలుగు డ్రైవ్‌స్పార్క్.....

- దేశీయ విపణిలోకి రానున్న మరో బజాజ్ బైకు ...!!
- టైటానిక్ షిప్ మరియు టైటానిక్ సినిమా మధ్య గల వ్యత్యాసాలు
- రతన్ టాటా గురించి ఆసక్తికరమైన విషయాలు...!!

డిజైర్ టూర్ కార్ల అమ్మకాలకు బ్రేక్ వేసిన మారుతి సుజుకి
మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లో తమ బెస్ట్ సెల్లింగ్ డిజైర్ టూర్ కాంపాక్ట్ సెడాన్ అమ్మకాలకు బ్రేక్ వేసింది. ఇక మీద మార్చి 2017 నుండి డిజైర్ కార్ల ను కొనుగోలు చేయలేరు

ఇప్పుడు జపాన్ లో త్వరలో భారత్ కు: 2017 స్విఫ్ట్ సమగ్ర వివరాలు
జపాన్ మార్కెట్లోకి సుజుకి తమ 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ను ఆవిష్కరించింది. దేశీయ విపణివైపు అడుగులేయనున్న దీని గురించి పూర్తి వివరాలు....


Click it and Unblock the Notifications








