బజాజ్ వి12 విడుదల: ధర రూ. 56,283 లు

Written By:

బజాజ్ ఆటో ప్రారంభంలో ప్రకటించిన విధంగానే తమ వి సిరీస్ లో వి12 బైకును విడుదల చేసింది. గతం ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ద నౌక యొక్క లోహంతో వి15 మోటార్ సైకిల్ ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వి సిరీస్‌లోని వి15 కు కొనసాగింపుగా వి12 బైకును 125సీసీ సామర్థ్యం గల ఇంజన్‌తో పరిచయం చేసింది. దీని ప్రారంభ ధర రూ. 56,283 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

బజాజ్ ఆటో తమ వి సిరీస్ లోకి రెండవ ఉత్పత్తిగా విడుదల చేసిన వి12 బైకులో 124.6సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు. ఈ శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 10.8బిహెచ్‌పి పవర్ మరియు 10.8ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

వి12 బైకు బజాజ్ వారి వి15 కు చిన తోబుట్టువుగా ఉంటుంది. డిజైన్ పరంగా అదే విభిన్నమైన హెడ్ ల్యాంప్ మరియు శీరీరాకృతిలో ఉంది. వి12 మరియు 126సీసీ సామర్థ్యం గల ఇంజన్ మినహా దాదాపు వి15 తరహాలో ఉంటుంది.

వి15 బైకులోని సీటుకు చివరిలో బోర్లించిన గిన్నె వంటి ఆకారాన్ని వి12 లో కూడా అందించారు. అయితే విభిన్నమైన అల్లాయ్ వీల్స్ లతో పాటు అదే ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కలదు.

అయితే ఇందులో డిస్క్ బ్రేకులు లేవు. వాటి స్థానంలో ఇరువైపులా డ్రమ్ బ్రేకులను అందించారు. అయితే వి15 లోని అవే టైర్లను ఇందులో అందించారు.

 

Read more on: #బజాజ్ #bajaj
English summary
Bajaj V12 Launched In India; Priced At Rs 56,283
Please Wait while comments are loading...

Latest Photos