ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైకును పరీక్షించిన బిఎమ్‌డబ్ల్యూ

By Anil

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ టీవీఎస్ మోటార్స్ నేతృత్వంలో అడ్వెంచర్ బైకుల ప్రపంచంలోకి ఎంట్రీ లెవల్ బైకును పరిచయం చేయనుంది. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా జి310ఆర్ అనే అసంపూర్ణంగా నిర్మించబడిన స్ట్రీట్ ఫైటర్‌ను అతి త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది.

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ జి310ఆర్

బిఎమ్‌డబ్ల్యూ ఈ సరికొత్త జి310ఆర్ అడ్వెంచర్ బైకును ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ది చెందిన అన్ని ద్విచక్ర వాహన విపణుల్లోకి 2016 చివరి నాటికి విడుదల చేయనుంది. ఇదే సమయంలో దేశీయంగా కూడా ఇది విడుదలకు నోచుకోనుంది.

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ జి310ఆర్

జి310ఆర్ మరియు ఎఫ్310 జిఎస్‌లో దాదాపుగా ఒకే విధమైన విడి భాగాలను వినియోగించుకుంటోంది బిఎమ్‌డబ్ల్యూ.

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ జి310ఆర్

బిఎమ్‌డబ్ల్యూ టీవీఎస్ భాగస్వామ్యంలో అభివృద్ది చేస్తోన్న మూడవ ఉత్పత్తి ఈ ఎఫ్310జిఎస్ అని చెప్పవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ జి310ఆర్

బిఎమ్‌డబ్ల్యూ ఈ జి310ఆర్ తో పాటు మరో అడ్వెంచర్ బైకును కూడా పరీక్షిస్తోంది. రహస్య పరీక్షలకు గురైన ఎఫ్310 జిఎస్ అడ్వెంచర్ ను 2016 ఎకిమా మోటార్ షో వేదిక మీద ప్రదర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ జి310ఆర్

ప్రస్తుతం బిఎమ్‌డబ్ల్యూ తమ జి310ఆర్, అకులా 310 మరియు ఎఫ్310జిఎస్‌లను దేశీయంగా ఉన్న టీవీఎస్ ఉత్పత్తి ప్లాంటులోనే ఉత్పత్తి చేయనుంది.

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ జి310ఆర్

బిఎమ్‌డబ్ల్యూ ఈ ఎఫ్310జిఎస్ అడ్వెంచర్ మోటార్ సైకిల్‌లో తమ 313సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ అందిస్తోంది.

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ జి310ఆర్

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ ఇంజనీర్లు ఇందులో అందించిన ఇంజన్‌ను అడ్వెంచర్ బైకులు కనబరిచే పనితీరుకు సమానంగా పవర్‌ను ఉత్పత్తి చేసే విధంగా అభివృద్ది చేసారు.

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ జి310ఆర్

ప్రస్తుతం అసంపూర్ణంగా డిజైన్ చేయబడి పరీక్షల కోసం రోడ్డెక్కిన ఈ అడ్వెంచర్ బైకు సుమారుగా 34బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ జి310ఆర్

బిఎమ్‌డబ్ల్యూ జిఎస్ శ్రేణిలో ఉన్న బైకుల డిజైన్ లక్షణాలతో ఈ ఎఫ్310 జిఎస్ యొక్క డిజైన్‌ను అభివృద్ది చేయనున్నారు.

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ జి310ఆర్

బిఎమ్‌డబ్ల్యూ ఈ ఎఫ్310 జిఎస్ ను విడుదల చేస్తే త్వరలో కెటిఎమ్ విడుదల చేయనున్న 390 మోడల్‌కు గట్టి పోటీని ఇవ్వనుంది. బిఎమ్‌డబ్ల్యూ దీనిని 2016 ఎకిమా మోటార్ షో వేదిక మీద ప్రదర్శించనుంది. పూర్తి వివరాలకు డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.

Via Motociclismo

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ జి310ఆర్

  • కరిజ్మాను మళ్లీ మనముందుకు తీసుకురానున్న హీరో మోటోకార్ప్
  • సుజుకి జిక్సర్ 250 అసలు రూపం ఇదే
  • 2016 ప్యారిస్ మోటార్ షో లో సుజుకి ఇగ్నిస్ కాంపాక్ట్ క్రాసోవర్ ప్రదర్శన

Most Read Articles

English summary
BMW Spied Testing An All-New Entry Level Adventure Motorcycle
Story first published: Monday, October 3, 2016, 11:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X