దాదాపు లక్ష వరకు డిస్కౌంట్లు ప్రకటించిన డుకాటి
డుకాటి ఇండియా దేశీయంగా ఉన్న తమ స్క్రాంబ్లర్ శ్రేణి ఉత్పత్తులపై రూ. 90,000 ల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.
ఇటలీకి చెందిన ప్రముఖ ఖరీదైన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ డుకాటి ఈ ఏడాదితో 90 వ వార్షికోత్సవ వేడుకలను జరుపుకుంది. ఈ సెలబ్రేషన్స్ కారణంగా డుకాటి ఇండియా లైనప్‌లోని స్క్రాంబ్లర్ శ్రేణి ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

డుకాటి తమ స్క్రాంబ్లర్ రేంజ్ లోని అన్ని మోడల్స్ మీద గరిష్టంగా 90,000 రుపాయల వరకు డిస్కౌంట్లను ప్రకటించింది. వీటికి గడువు ఈ ఏడాది చివరి వరకు (డిసెంబర్ 31, 2016) ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

డిస్కౌంట్ల తరువాత డుకాటి స్క్రాంబ్లర్ ఐకాన్ ధర రూ. 6,07,000 లు మరియు క్లాసిక్, అర్బన్, ఎండ్యురో, ఫుల్ థ్రోటిల్ మోడళ్ల ధరలు రూ. 7,28,000 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

డుకాటి స్క్రాంబ్లర్ రేంజ్ లోని నాలుగు మోడళ్లను ఫైనాన్స్ స్కీమ్స్ మరియు డిస్కౌంట్ ధరల ద్వారా ఎంచుకోవచ్చు. ఏడేళ్ల వరకు ఫైనాన్స్ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచారు.

డుకాటి 1926 లో స్థాపించబడింది. సరిగ్గా ఈ ఏడాదితో 90 వసంతాలు పూర్తయ్యాయి. ఇటాలియన్ ఇకానిక్ మోటార్ సైకిళ్ల సంస్థ డుకాటికి ఇదొక అరుదైన మైలురాయి అని డుకాటి ఓ ప్రకటనలో తెలిపింది.

డుకాటి డిస్కౌంట్ల ప్రకటన సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రవి అవలూర్ మాట్లాడుతూ, గతం రెండేళ్ల కాలంలో గొప్ప వృద్దిని సాధించినట్లు తెలిపాడు. మరియు డుకాటి శ్రేణిలోని అన్ని ఉత్పత్తులు కూడా మంచి ఆదరణ పొందుతున్నట్లు ఆయన తెలిపారు.

- విడుదలకు ముందే డీలర్ల వద్దకు: 2017 సిరీస్ బజాజ్ పల్సర్ 150
- జిపిఎస్ న్యావిగేషన్ ఎలా పనిచేస్తుంది, కారులో జిపిఎస్ తప్పనిసరా...?
- ఇగ్నిస్ కోసం మరో త్యాగం: రిట్జ్ ఉత్పత్తిని ఆపేసిన మారుతి


Click it and Unblock the Notifications








