విపణలోకి రోడ్‌స్టర్ మరియు రోడ్ గ్లిడ్ స్పెషల్ బైకులను ప్రవేశపెట్టిన హ్యార్లీ డేవిడ్‌సన్

Written By:

అమెరికాకు చెందిన ప్రసిద్ద మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హ్యార్లీ డేవిడ్‌సన్ 2017 రేంజ్‌కు చెందిన నూతన ఉత్పత్తులను దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అంతే కాకుండా రోడ్‌స్టర్ మరియు రోడ్ గ్లిడ్ స్పెషల్ బైకులను కూడా విపణిలోకి విడుదల చేసింది.

2017 శ్రేణికి చెందిన హ్యార్లీ డేవిడ్‌సన్ బైకుల్లోని అన్ని వేరియంట్లలో కాస్మొటిక్ మార్పులతో పాటు యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అందించింది.

హ్యార్లీ డేవిడ్‌సన్ రోడ్‌స్టర్ బైకులో 1,200సీసీ సామర్థ్యం గల వి-ట్విన్ ఎవల్యూషన్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు. దీనిని 1200కస్టమ్ మోడల్ బైకులో వినియోగించారు. ఈ బైకును హర్యాణాలోని బవాల్ తయారీ ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నారు.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఈ రోడ్‌స్టర్ బైకు ప్రారంభ ధర 9.70 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా నిర్ణయించింది. అధునాతన రోడ్‌స్టర్ హ్యార్లీ డేవిడ్‌సన్ లోని పాపులర్ స్పోర్ట్‌స్టర్ కుటుంబంలోకి ప్రవేశించింది.

హ్యార్లీ డేవిడ్‌సన్ రోడ్ గ్లిడ్ స్పెషల్ బైకులో 1,745సీసీ సామర్థ్యం గల మిల్వాకీ ఎయిట్ 107 సింగల్ క్యామ్ వి-ట్విన్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 150ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయును.

హ్యార్లీ డేవిడ్‌సన్ వారి రెండు ఉత్పత్తులు కూడా డిజైన్ పరంగా నూతన శకాన్ని ఆరంభించాయి. లాంగ్ డ్రైవ్ కోసం వీటిని బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. అయితే ధర మాత్రం భారీగా ఉంటుంది. రోడ్ గ్లిడ్ స్పెషల్ బైకు ప్రారభం ధర రూ. 32.18 లక్షల ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ లోని రోడ్ కింగ్, స్ట్రీట్ గ్లిడ్ స్పెషల్ మరియు రోడ్ గ్లిడ్ స్పెషల్ బైకుల్లో మిల్వాకీ ఎయిట్ ఇంజన్ కలదు.

నూతనంగా విడుదలైన బైకుల్లో వచ్చిన ఇంజన్‌లు గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తూ, అధిక యాక్సిలరేటర్‌ను కలిగి, శుద్దమైన శబ్దంతో స్మూత్ రైడింగ్ ను కలిగిస్తాయి. ఈ ఇకానిక్ బైకుల మీద ప్రయాణించే సమయంలో వీటి శబ్దం మరియు రైడింగ్ అనుభూతి చాలా కొత్తగా ఉంటుంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ విడుదల చేసిన రెండు ఉత్పత్తుల్లో కూడా ముందు మరియు వెనుక వైపున అభివృద్ది చేసిన అధునాత సస్పెన్షన్ వ్యవస్థను అందించారు. తద్వారా మోటార్ సైకిళ్ల నాణ్యత కాస్త మరింత పెరిగింది.

ఈ రెండు ఉత్పత్తులను విడుదల చేసిన సందర్భంగా హ్యార్లీ డేవిడ్‌సన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ పాహ్ మాట్లాడుతూ, దేశీయంగా ఉన్న వినియోగదారులకు ప్రపంచ స్థాయి నాణ్యతతో ప్రీమియమ్ బైకులను అందుబాటులో ఉంచి ప్రీమియమ్ బైకుల సెగ్మెంట్లో లీడర్‌గా ఎదగడానికి కృషి చేస్తున్నట్లు తెలిపాడు.

హ్యార్లీ డేవిడ్‌సన్ రోడ్‌స్టర్ మరియు రోడ్ గ్లిడ్ స్పెషల్ బైకులు....

హ్యార్లీ డేవిడ్‌సన్ రోడ్‌స్టర్ మరియు రోడ్ గ్లిడ్ స్పెషల్ బైకులు...

హ్యార్లీ డేవిడ్‌సన్ రోడ్‌స్టర్ మరియు రోడ్ గ్లిడ్ స్పెషల్ బైకులు....

హ్యార్లీ డేవిడ్‌సన్ రోడ్‌స్టర్ మరియు రోడ్ గ్లిడ్ స్పెషల్ బైకులు.....

హ్యార్లీ డేవిడ్‌సన్ రోడ్‌స్టర్ మరియు రోడ్ గ్లిడ్ స్పెషల్ బైకులు....

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Wednesday, November 9, 2016, 16:13 [IST]
English summary
Harley-Davidson Launches The Roadster And Road Glide Special In India
Please Wait while comments are loading...

Latest Photos