సరికొత్త స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసిన కవాసకి: ధర మరియు ఇతర వివరాలు
కవాసకి ఇండియా మోటార్స్ దేశీయ స్పోర్ట్స్ బైకుల తీరంలోకి తమ సరికొత్త స్పెషల్ ఎడిషన్ బైకును పరిచయ చేసింది. జపాన్ ఆధారిత పర్ఫామెన్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ కవాసకి తమ నింజా 300 న కెఆర్‌టి ఎడిషన్‌లో విడుదల చేసింది.

కవాసకి మోటార్స్ ఇండియా విడుదల చేసిన నింజా 300 స్పెషల్ ఎడిషన్‌లోని కెఆర్‌టి ఏమిటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కెఆర్‌టి అనగా కవాసకి రేసింగ్ టీమ్ (KRT) అని అర్థం.

కవాసకి మోటార్స్ నింజా 300 కెఆర్‌టి ఎడిషన్ బైకును దేశ వ్యాప్తంగా ఉన్న కవాసకి షోరూమ్‌లలో అమ్మకాలకు అందుబాటులో ఉంచింది.

ఇప్పటికే కవాసకి డీలర్లు నింజా 300 కెఆర్‌టి ఎడిషన్‌కు సంభందించిన బుకింగ్‌లను కూడా ప్రారంభించారు.

గతంలో నవంబర్ 2015 లో ఈ నింజా 300 ను ఒక సారి స్పెషల్ ఎడిషన్‌లో అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చిన కెఆర్‌టి ఎడిషన్ ధర రూ. 3.61 లక్షలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్)గా ఉన్నాయి.

కెఆర్‌టి ఎడిషన్ నింజా 300 బైకు గ్రీన్ మరియు బ్లాక్ కలర్ పెయింట్ జాబ్‌లో విడుదలైంది. కవాసకి అంతర్జాతీయ సూపర్ బైక్ రేస్ మెషీన్ నుండి ఈ సరికొత్త పెయింట్ స్కీమ్‌ను ఇందులో అన్వయించినట్లు కవాసకి తెలిపింది.

సాధారణ నింజాతో పోల్చుకుంటే బైకులోని క్రింది భాగాన్ని మరియు ఫ్యూయల్ క్యాప్ మీద కెఆర్‌టి ఎడిషన్ బ్యాడ్జిలను అందించారు.

సాంకేతికంగా ఈ నింజా 300 కెఆర్‌టిలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోలేదు. ఇందులో అదే 296సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ రెండు సమాంతర సిలిండర్లు గల ఇంజన్‌ను అందించారు.

ఇందులోని శక్తివంతమైన రెండు సిలిండర్ల ఇంజన్ సుమారుగా 38.4బిహెచ్‌పి పవర్ మరియు 27ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

కవాసకి ఈ సరికొత్త నింజా 300 కెఆర్‌టి ఎడిషన్ బైకులోని శక్తివంతమైన ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసారు.

అంతర్జాతీయ మార్కెట్లో నింజా 300 కెఆర్‌టి ఎడిషన్ యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ను అందించింది. అయితే దేశీయంగా అందుబాటులో ఉన్న మోడల్‌లో మాత్రం ABS అందివ్వలేదు.

ఇప్పటి వరకు ABS ఫీచర్ ఉన్న బైకులు దేశీయంగా అందుబాటులోకి రాలేదు. అయితే కవాసకి ఇండియా ABS ను 2017 లో తమ ఉత్పత్తుల్లో పరిచయం చేయనుంది.

- అన్నీ సిద్దం చేసుకున్న సుజుకి ఇక సంచలనాలే
- కరిజ్మాను మళ్లీ మనముందుకు తీసుకురానున్న హీరో మోటోకార్ప్
- అద్భుతమైన ధరతో విడుదలైన భారత దేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్


Click it and Unblock the Notifications








