పెరిగిన కవాసకి ఇండియా సేల్స్

By Anil

జపాన్‍‌కు చెందిన కవాసకి మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి స్వల్ప ఉత్పత్తులను మాత్రమే అందించింది. అయినప్పటికీ కవాసకి మోటార్స్ ఇండియా గడిచిన ఆగష్టు 2016 అమ్మకాల్లో ఏకంగా 800 శాతం వృద్దిని నమోదు చేసుకుంది. ఇందుకు ముఖ్య కారణం నింజా 650 మోడల్ బైకులు అమ్మకాలే అని తెలిసింది.

కవాసకి నింజా 650 అమ్మకాలు

గడిచిన ఆగష్టు 2016 కాలంలో 54 నింజా 650 బైకులు అమ్ముడుపోగా గత ఏడాది ఇదే మాసంలో కేవలం 6 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

కవాసకి నింజా 650 అమ్మకాలు

ఈ ఏడాదిలో నింజా 650 బైకుల అమ్మకాలు పెరగడానికి కారణం కవాసకి ఈ బైకుల మీద సుమారుగా 40,000 రుపాయల తగ్గింపును ప్రకటించింది.

కవాసకి నింజా 650 అమ్మకాలు

కేవలం 2015 సంవత్సరంలో ఉత్పత్తి అయిన నింజా 650 బైకుల మీద మాత్రమే ఈ తగ్గింపును ప్రకటించింది. 40,000 రుపాయల తగ్గింపు తరువాత వీటి ధరలు 5.37 లక్షల నుండి 4.97 లక్షలకు దిగివచ్చాయి.

కవాసకి నింజా 650 అమ్మకాలు

అమ్మకాల్లో వృద్దిని ఈ సాధించడానికి కవాసకి తీసుకున్న నిర్ణయం సుమారుగా 800 శాతం వృద్దిని సాధించడానికి దోహదపడింది. అయితే 2016 లో ఉత్పత్తి అయిన నింజా 650 బైకుల మీద కూడా ఇదే తరహా తగ్గింపును ప్రకటిస్తే అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

కవాసకి నింజా 650 అమ్మకాలు

సరిగ్గా రెండు వారాల క్రితం కవాసకి ఇలాగే వార్తల్లోకి వచ్చింది. అయితే ముంబాయ్‌లోన పామ్ బీచ్ రోడ్డులో ఉన్న కవాసకి డీలర్ వినియోగదారుల నుండి మొత్తం డబ్బు సేకరించి వారికి బైకులను డెలివరీ ఇవ్వడంలో విఫలం చెందింది. అయితే ఆ వెంటనే కవాసకి ఆ డీలర్ షిప్‌ను తొలగించింది.

కవాసకి నింజా 650 అమ్మకాలు

దేశీయంగా స్పోర్ట్స్ టూరర్ బైకుల మార్కెటింగ్ పుంజుకుంటోంది అని చెప్పడానికి కవాసకి సాధించిన అసాధారణ ఫలితాలను ఉదాహరణగా చెప్పవచ్చు.

కవాసకి నింజా 650 అమ్మకాలు

  • రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలన్ బాటిల్‌లో కెటిఎమ్ మధ్యం అంటే ఇదేనేమో...!!
  • ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ట్రక్కు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో
  • ఆశ్చర్యపోవటానికి సిద్దం కండి!

Most Read Articles

English summary
Read In Telugu: Sales Increase For Kawasaki Motors In India
Story first published: Thursday, September 22, 2016, 12:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X