ఇండియన్ మార్కెట్ కోసం కవాసకి వెర్సేస్ 250

కవాసకి ఇండోనేషియా మార్కెట్లోకి తమ వెర్సేస్ 250 అడ్వెంచర్ బైకును విడుదల చేసింది. 2017 మధ్య భాగానికి దేశీయ మార్కెట్లోకి విడుదలకు సిద్దమవుతోంది.

By Anil

కవాసకి తాజాగ జరిగిన 2016 ఎకిమా మోటార్ సైకిల్ షో వేదిక మీద తమ ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ టూరర్ బైకును ప్రదర్శించింది. జపాన్‌కు చెందిన ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ కవాసకి ఈ వెర్సేస్ 250 అడ్వెంచర్ బైకును ఇండోనేషియా మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు దీనిని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయాలనే సమాలోచనలు చేస్తోంది.

కవాసకి వెర్సేస్ 250

కవాసకి వెర్సేస్ 250 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి, వెర్సేస్ 250 అడ్వెంచర్ మరియు వెర్సేస్ 250 టూరర్.

అడ్వెంచర్ వేరియంట్ ధర ఐడిఆర్ 61.9 మిలియన్లు (దాదాపుగా 3.12 లక్షలు) మరియు టూరర్ వేరియంట్ ధర ఐడిఆర్ 72.7 మిలియన్లు (దాదాపుగా 3.66 లక్షలుగా) ఉన్నాయి. (ఇండోనేషియా కెరన్సీ ఐడిఆర్ అంటారు).

కవాసకి వెర్సేస్ 250

కవాసకి ఈ వెర్సేస్ 250 శ్రేణిలో 249సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ ట్విన్ సిలిండర్ ఇంజన్‌ను అందించింది. ఈ ఇంజన్ నింజా 250ఆర్ మరియు కవాసకి జడ్250లలో కూడా ఉంది.

కవాసకి వెర్సేస్ 250

ఇందులో 33.5బిహెచ్‌పి పవర్ మరియు 21.7ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయబడింది.

కవాసకి వెర్సేస్ 250

దీనికి మునుపటి తోబుట్టువయిన కవాసకి వెర్సేస్ 650 కు చెందిన డిజైన్ లక్షణాలతో రూపొందించబడింది. ఇది (వెర్సేస్ 650) ఇండియన్ మార్కెట్లో అమ్మకాల్లో ఉంది.

కవాసకి వెర్సేస్ 250

వెర్సేస్ 250 లోని రెండు వేరియంట్లలో కూడా నింజా 250ఆర్ మరియు జడ్250 లతో పోల్చుకుంటే లాంగ్ ట్రావెల్ గల ఫ్రంట్ ఫోర్క్ కలదు. వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ కలదు.

కవాసకి వెర్సేస్ 250

ముందు వైపున 19-అంగుళాలు మరియు వెనుక వైపున 17-అంగుళాల టైర్లు కలవు. రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి. రెండు వేరియంట్లలో కూడా స్లిప్ క్లచ్ అసిస్ట్ కలదు.

కవాసకి వెర్సేస్ 250

వెర్సేస్ 250 లో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ట్విన్ ఆక్సిలరీ లైట్లు (బెటర్ విజిబులిటి కోసం), బుష్ గార్డ్‌లు ఉన్నాయి. అడ్వెంచర్ వేరియంట్లో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఆప్షనల్‌గా ఉంది.

కవాసకి వెర్సేస్ 250

కవాసకి వెర్సేస్ 250 లో క్యాండీ లైమ్ గ్రీన్/మెటాలిక్ గ్రాఫైట్ గ్రే, మెటాలిక్ గ్రాఫైట్ గ్రే/ఫ్లాట్ ఎబొని మరియు క్యాండీ బంర్ట్ ఆరేంజ్/మెటాలిక్ గ్రాఫైట్ గ్రే వంటి కలర్ ఆప్షన్‌లలో లభించును.

కవాసకి వెర్సేస్ 250

కవాసకి లైనప్‌లో వెర్సేస్ 250 మోడల్ ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్ సైకిల్. కవాసకి దీనిని 2017 మధ్య బాగానికి విడుదల చేసే అవకాశం ఉంది.

కవాసకి వెర్సేస్ 250

కవాసకి ఈ వెర్సేస్ 250 అడ్వెంచర్ మరియు టూరర్ వేరియంట్లలో దేశీయ విపణిలోకి విడుదలయితే వీటికి పోటీగా బిఎమ్‌డబ్ల్యూ మరియు కెటిఎమ్ తమ ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ ఉత్పత్తులను విడుదలకు సమాయత్తం అవుతాయి. ఈ రెండు సంస్థలు ఇప్పటికే తమ ఉత్పత్తులను పరీక్షిస్తున్నాయి.

కవాసకి వెర్సేస్ 250

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లోని అడ్వెంచర్ బైకుల సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ వారి హిమాలయన్ మాత్రమే ఉంది. సమయం సరిగ్గా అనుకూలిస్తే వచ్చే ఏడాది కవాసకి వెర్సేస్ 250 లతో పాటు మరిన్ని ఉత్పత్తుల పరిచయం కానున్నాయి.

కవాసకి వెర్సేస్ 250

  • రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ విడుదల: పూర్తి వివరాలు
  • రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫోటోలు (గ్యాలరీ)

Most Read Articles

English summary
awasaki 250cc Versys Launched — Maybe This Is One Adventure Bike India Needs
Story first published: Friday, December 2, 2016, 11:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X