రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 రెడ్డిచ్ విడుదల: ధర మరియు ఇతర వివరాలు..

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 రెడ్డిచ్ బైకులను విపణికి పరిచయం చేసింది. రెండు రోజుల క్రితం నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టిన ఈ మోడల్ నేడు విపణిలోకి చేరింది. ధర మరియు ఇతర వివరాలు కోసం...

Written By:

భారత దేశపు అగ్రగామి ఇకానిక్ క్లాసిక్ బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియన్ మార్కెట్లోని క్లాసిక్ 350 శ్రేణిలోకి రెడ్డిచ్ అనే వేరియంట్లను విడుదల చేసింది. క్లాసిక్ 350 రెడ్డిచ్ ప్రారంభ ధర రూ. 1.46 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

2017 నాటికి విక్రయాలకు సిద్దం చేయడానికి ముందుగా రాయల్ ఎన్ఫీల్డ్ ఈ క్లాసిక్ 350 రెడ్డిచ్ బైకులను దేశ వ్యాప్తంగా ఉన్న తమ షోరూమ్‌లకు చేరవేసింది. మరియు దీనికి సంభందించిన బుకింగ్స్‌ను జనవరి 7, 2017 నుండి ప్రారంభించనుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ లోని క్లాసిక్ శ్రేణిలో మోచటార్ సైకిళ్లు స్క్వాడ్రన్ బ్లూ, డెసెర్ట్ స్టార్మ్, బ్యాటిల్ గ్రీన్, క్రోమ్, 500 మరియు 350 అనే వేరియంట్లలో అందుబాటులో ఉండేవి అయితే ఈ జాబితాలో రెడ్డిచ్ అదననంగా వచ్చి చేరింది.

రాయల్ ఎన్ఫీల్డ్ దీని గురించి విడుదల చేసిన ఓ ప్రకటన ప్రకారం, 1950 లో ఇంగ్లాడులో రాయల్ ఎన్ఫీల్డ్ విడుదల చేసిన మొదటి ఉత్పత్తి రెడ్డిచ్ పెయింట్ స్కీమ్ ఆధారంగా ఈ క్లాసిక్ 350 రెడ్డిచ్ మోడల్ ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది.

ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 రెడ్డిచ్ మోటార్ సైకిల్ రెడ్, గ్రీన్ మరియు బ్లూ వంటి రంగుల్లో అందుబాటులో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ల జన్మస్థలానికి రెడ్డిచ్ అనే పేరు పర్యాపదంగా నిలిచిపోయింది.

రాయల్ ఎన్ఫీల్డ్ ప్రెసిడెంట్ రుద్రతేజ్ సింగ్ మాట్లాడుతూ, 1950 నుండి 2017 వరకు అందుబాటులో ఉన్న రెడ్డిచ్ బైకుల్లో ఈ నూతన రంగులతో పాటు రెడ్డిచ్ పేరుతో గల మోనోగ్రామ్ అందిస్తూ వచ్చామని తెలిపాడు.

1939 లో రాయల్ ఎన్ఫీల్డ్ మొదటి సారిగా విడుదల చేసిన రాయల్ బేబీ 125సీసీ 2-స్ట్రోక్ బైకులో కూడా ఈ మోనోగ్రామ్ అందించారు. రెండు లేదా మూడు ఆంగ్ల అక్షరాల సమ్మేలనంతో ఉన్న చిహ్నాన్ని మోనోగ్రామ్ అంటారు.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ రేంజ్ మోటార్ సైకిళ్లను 2008లో రీ డిజైన్ చేసి పరిచయం చేశారు. రెండవ ప్రపంచ యుద్ద కాలానికి ముందే ఈ క్లాసిక్ బైకులను రాయల్ ఎన్ఫీల్డ్ అభివృద్ది చేసింది. తరువాత 1967 కాలంలో రెడ్డిచ్ నగరంలోని ప్రొడక్షన్ ప్లాంటులో వీటి ఉత్పత్తిని నిలిపివేశారు.

ప్రస్తుతం పరిచయం అయిన క్లాసిక్ 350 రెడ్డిచ్ మోడల్ లో రంగులు మినహాయించి మరేవిధమైన మార్పులు చేసుకోలేదు. సాంకేతికంగా ఇందులో అదే 346సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 19.8బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. రాయల్ ఎన్ఫీల్డ్ దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం చేసింది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Royal Enfield Classic 350 Redditch Launched In India; Priced At Rs 1.46 Lakh
Please Wait while comments are loading...

Latest Photos

LIKE US ON FACEBOOK