రాయల్ ఎన్పీల్డ్ అధికారిక వెబ్‌సైట్ నుండి ఎలక్ట్రా పేరు తొలగింపు

By Anil

రాయల్ ఎన్ఫీల్డ్ తమ ద్విచక్ర వాహనాలను నూతన ఒరవడితో అందించే ప్రణాళికలో ఉంది. అందు కోసం తమ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఉత్పత్తులను మరింత సరళం చేయడానికి కొన్ని పాత తరం ఉత్పత్తులను తమ లైనప్ నుండి తొలగిస్తోంది. అందులో భాగంగా ఎలక్ట్రా బైకును రాయల్ ఎన్పీల్డ్ తమ అధికారిక వెబ్‌సైట్ నుండి తొలగించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రా

అధునిక సొబగులు, డిజైన్ మరియు ఫీచర్లతో కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రణాళికలో ఉండటం వలన పాత కాలం నాటి క్లాసిక్ డిజైన్ కలిగిన ఉత్పత్తులను తొలగించడం చేస్తోంది.

రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రా

అయితే ఎలక్ట్రా బైకును ఎంచుకోవాలి అనుకునే వారు రాయల్ ఎన్ఫీల్డ్ స్టాండర్డ్ స్ట్రీట్ కెటగిరీని ఎంచుకోవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రా

ఎలక్ట్రా బ్యాడ్జి పేరుతో బుల్లెట్ 350 బైకును ఎలక్ట్రిక్ స్టార్ట్ ఫీచర్‌తో అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనిని కూడా ఎంచుకోవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రా

బుల్టెట్ 350 బైకులు డ్రమ్ మరియు డిస్క్ బ్రేక్ ఆప్షన్‌లతో పాటు ఎలక్ట్రిక్ స్టార్ట్‌తో మరియు లేకుండా కూడా అందుబాటులో ఉన్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రా

బుల్లెట్ 350 ఇప్పుడు ఐదు విభిన్నమైన రంగుల్లో లభించును. అవి, బ్లాక్, బ్లాక్ విత్ క్రోమ్, మెరూన్, మరియు బ్లూ వంటి రంగులు.

రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రా

ఎలక్ట్రిక్ స్టార్ట్ లేని మరియు డ్రమ్ బ్రేకు ఆప్షన్ ఉన్న బుల్లెట్ 350 బైకు మాత్రమే బ్లాక్ రంగులో అందుబాటులో ఉంది. మరే ఇతర వాటిలో ఈ రంగు లభించదు.

రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రా

  • జిఎస్ఎక్స్150ఆర్ తో మా ప్రతాపమేంటో చూపుతాం...!!
  • భారత రహదారుల గురించి షాకింగ్ నిజాలు...!!
  • 1960 లో విడుదలైన 'మంకీ 150' బైకును హోండా మళ్లీ విడుదల చేస్తానంటోంది

Most Read Articles

English summary
Royal Enfield Removes The Electra Name From Its Official Website
Story first published: Saturday, September 24, 2016, 10:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X