అన్నీ సిద్దం చేసుకున్న సుజుకి ఇక సంచలనాలే

Written By:

ఇండియన్ మార్కెట్లోకి సుజుకి మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియాకు‌ మంచి గుర్తింపు తెచ్చిన మోడల్ జిక్సర్. సుజుకి విజయానికి జిక్సర్‌ను పర్యాయ పదంగా ఉపయోగించుకోవచ్చు. అయితే పర్ఫామెన్స్‌ ఉత్పత్తుల్లో సంచలనాలు సృష్టించడానికి సుజుకి సిద్దం చేసిన జిఎస్ఎక్స్ 250ఆర్ ఉత్పత్తి ప్రొడక్షన్ దశకు చేరుకుంది.

సుజుకి నుండి వస్తోన్న పర్ఫామెన్స్‌ ఉత్పత్తిని అత్యంత రహస్యంగా అభివృద్ది చేస్తూ వచ్చింది. అయినప్పటికీ జిఎస్ఎక్స్ 250ఆర్ తాలూకు ప్రొడక్షన్ రెడి చిత్రాలు ఇంటర్నెట్ ఉపరితలం మీద తెగ చక్కర్లు కొట్టాయి.

సుజుకి ఇంతకు మునుపే దేశీయంగా అందుబాటులోకి తీసుకురానున్న విభిన్న మోటార్ సైకిళ్ల ప్లాన్ చిత్రాలను విడుదల చేసింది. అందులో ఒకటి ఈ జిఎస్ఎక్స్ 250ఆర్.

యంగ్ ఆడియెన్స్‌ను దృష్టిలో ఉంచుకుని సుజుకి రూపొందించిన మోటార్ సైకిల్ ఉత్తమ పనితీరును కనబరిచే ఇతర ఉత్పత్తులకు గట్టి పోటీని సృష్టించి అమ్మకాల్లో తనదైన వాటాను సొంతం చేసుకోనుంది.

ప్రస్తుతం రహస్యంగా లభించిన చిత్రాలను పరిశీలిస్తే ఇంతకు ముందెన్నడూ వీటిని సుజుకి తమ షోరూమ్‌లలో ప్రవేశపెట్టలేదు.

సుమారుగా 25 లీటర్ల ఇంధన సామర్థ్యంతో వస్తోన్న సుజుకి వారి జిఎస్ఎక్స్ 250ఆర్ అని ఫోటోలు ఖాయం చేస్తున్నాయి.

సుజుకి లోని 1000సీసీ బైకులకు తోబుట్టువుగా ఉండనుంది ఈ సరికొత్త జిఎస్ఎక్స్ 250ఆర్.

డిజైన్ పరంగా మునుపటి రూపాన్ని కలిగి ఉండే హెడ్‌లైట్, సరికొత్త బాడీ గ్రాఫిక్స్ ఇక అన్నింటికన్నా ఆకర్షణీయంగా పొడవాటి సీటు ఇందులో ఉంది.

నింజా 300 లో వినియోగించినటువంటి ట్యూబులర్ ఫ్రేమ్‌ను సుజుకి ఈ జిఎస్ఎక్స్ 250ఆర్ లో అందించింది.

సస్పెన్షన్ పరంగా సుజుకి ఈ జిఎస్ఎక్స్ 250ఆర్ లో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్‌ను అందించారు.

బ్రేకింగ్ పరంగా ముందు మరియు వెనుక వైపున డిస్క్ బ్రేకులను అందించారు. వీటి చుట్టు కొలత 300ఎమ్ఎమ్ కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఎక్ట్సీరియర్ పరంగా సూపర్‌స్పోర్ట్ మోటార్ సైకిల్ తీరును పోలి ఉండే పెద్ద విండ్ స్క్రీన్ అందించారు, మరియు పెద్ద ఇంధన ట్యాంకు కూడా ఇందులో కలదు.

ప్రస్తుతం సుజుకి ఈ జిఎస్ఎక్స్ లో ఇనజుమా 250 ఇంజన్‌ను వినియోగించనుంది అనే ఆధారంలేని వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ ఇంజన్ సుమారుగా 40బిహెచ్‌పి వరకు పవర్ ఉత్పత్తి చేయును.

సుజుకి తమ స్పోర్ట్ మోటార్ సైకిల్ జిఎస్ఎక్స్ 250ఆర్ ను 2017 నాటికి విపణిలోకి విడుదల చేయనుంది.

సుజుకి దీనిని దేశీయంగా అందుబాటులోకి తెస్తే దీని ధర సుమారుగా రూ. 2.5 నుండి 3.5 లక్షల మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయి. మరింత తాజా ఆటోమొబైల్ సమాచారం కోసం డ్రైవ్‌స్పార్క్‌ తెలుగుతో కలిసి ఉండండి.

  

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Monday, October 3, 2016, 17:33 [IST]
English summary
Read In Telugu: Suzuki GSX-250R Production Version Revealed - In Pics
Please Wait while comments are loading...

Latest Photos