రహస్యంగా డీలర్ల వద్దకు చేరిన 2017 బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్

Written By:

ఇండియా లైనప్‌లో ఉన్న అతి ముఖ్యమైన నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ బైకు బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్, ఇప్పుడు దీని రీలాంచ్ కు బజాజ్ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంది. అయితే విడుదల కంటే ముందుగా ఇది డీలర్లను చేరింది.

బజాజ్ ఆటో ఇప్పటికే పలుమార్లు దీని విడుదలను సూచించే టీజర్ చిత్రాలను విడుదల చేసింది. బజాజ్ అధికారిక ఫేస్‌బుక్ పేజి మీద దీని విడుదల వివరాలకు చెందిన అప్‌డేట్స్ కూడా చేస్తూ వచ్చింది. ఇప్పుడు డీలర్ల వద్ద వీటిని గుర్తించినట్లు థ్రస్ట్ జోన్ ప్రకటించింది.

మునుపటి పల్సర్ 200ఎన్ఎస్ తో పోల్చితే కలర్స్, బాడీ మరియు డీకాల్స్ పూర్తి విభిన్నంగా ఉన్నాయి. అయితే సాంకేతికంగా బజాజ్ ఇందులో సరికొత్త ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను పరిచయం చేయలేదు.

అంతే కాకుండా ప్రస్తుతం ప్రధాన ఫీచర్‌గా చెప్పుకునే యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఇందులో అందివ్వలేదు, కనీసం ఆప్షనల్‌‌గా కూడా అందివ్వడం లేదు. అయితే బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌ను బజాజ్ ఇందులో పరిచయం చేస్తోంది.

సాంకేతికంగా బజాజ్ ఆటో ఈ 2017 పల్సర్ 200ఎన్ఎస్ బైకులో 194.4సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్, ట్రిపుల్ స్పార్క్ ఇంజన్‌ను అందించింది.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 23.5బిహెచ్‌పి పవర్ మరియు 18.3ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఇంజన్‌కు అనుసంధానం చేసిన 6-స్పీడ్ మ్యాన్యుల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా పవర్ మరియు టార్క్ వెనుక చక్రానికి అందుతుంది.

మునుపటి తరం పల్సర్ 200ఎన్ఎస్ తో పోల్చుకుంటే ఇందులోని ప్రధాన అప్‌గ్రేడ్స్ చర్చించుకోవాలి. అందులో ప్రధానంగా కస్టమర్లను ఆకర్షించే విధంగా డ్యూయల్ టోన్ న్యూ పెయింట్ స్కీమ్, కొత్త లొకేట్ చేయబడిన పల్సర్ లోగో మరియు ఇంజన్ మీద నూతన ఆకారంలో ఉన్న గిన్నె కలదు.

గతంలో ఉన్న పల్సర్ 200ఎన్ఎస్ ధర కన్నా కాస్త ఎక్కువ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది. మరో నాలుగైదు వారాల్లోపు విడుదల అయ్యే అవకాశం ఉంది. మరిన్ని తాజా ఆటోమొబైల్ కథనాల కోసం చూస్తూ ఉండండి తెలుగు డ్రైవ్‌స్పార్క్.

ప్రపంచ ఉగ్రవాద దేశాలైన చైనా, పాకిస్తాన్ ల మీద గురిపెట్టిన అగ్ని-IV
ఒడిస్సా తీరంలో భారత్ న్యూక్లియర్ సామర్థ్యమున్న అగ్ని-IV ఖండాతర క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. అయితే ఇది భారత్ శత్రు దేశాలకు పెద్ద ప్రమాదమని చైనా మీడియా ఒకటి అభిప్రాయాన్ని వెల్లడించింది.

మారుతి సుజుకి ప్రస్తుతం భారత మార్కెట్లో 18 మోడల్(ళ్ల)ను ఆఫర్ చేస్తోంది. మారుతి సుజుకి కారు ధరలు, మోడళ్లు మరియు వేరియంట్ల గురించి తెలియజేయటంలో డ్రైవ్‌స్పార్క్ మీకు సహకరిస్తుంది, మారుతి సుజుకి అందిస్తున్న ఉత్పత్తుల యొక్క ఎక్స్-షోరూమ్, ఆన్-రోడ్ ధరలు, కలర్ ఆప్షన్స్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, లేటెస్ట్ న్యూస్ మరియు భారత్‌లో మారుతి సుజుకి యొక్క అన్ని కార్ల ఫొటోలను వీక్షించండి.... పూర్తి వివరాలకు......

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Read more on: #బజాజ్ #bajaj
Story first published: Tuesday, January 24, 2017, 9:00 [IST]
English summary
2017 Bajaj Pulsar 200NS Spied At Dealership Stockyard
Please Wait while comments are loading...

Latest Photos