2017 కెఎల్ఎక్స్ 140జి డర్డ్ మోటార్ సైకిల్ ను దేశీయంగా విడుదల చేసిన కవాసకి

Written By:

కవాసకి ఇండియా విభాగం విపణిలోకి తమ 2017 కెఎల్ఎక్స్ 140జి డర్ట్ మోటార్ సైకిల్ ను విడుదల చేసింది. దీని విడుదలతో కవాసకి నుండి ఇది నాలుగవ ఆఫ్ రోడింగ్ మోటార్ సైకిల్. ఇది ప్రస్తుతం ఉన్న కెఎల్ఎక్స్110 మరియు కెఎల్ఎక్స్100 మధ్య స్థానాన్ని భర్తీ చేయనుంది.

కంప్లీట్లి బిల్ట్ యూనిట్‌గా దేశీయంగా విడుదలైన కవాసకి కెఎల్ఎక్స్ 140జి మోటార్ సైకిల్ ప్రారంభ ధర రూ. 3.91 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉంది.

కవాసకి ఈ కెఎల్ఎక్స్ 140జి బైకులో 144సీసీ సామర్థ్యం గల ఫోర్-స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఇంజన్ అందించింది. ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

కవాసకి ఈ ఆఫ్ రోడింగ్ మోటార్ సైకిల్ ను స్టీల్ పెరీమీటర్ ఫ్రేమ్ మీద నిర్మించింది. ఇందులో సస్పెన్షన్ పరంగా చూస్తే ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున అడ్జెస్టబుల్ మోనో షాక్ సస్పెన్షన్ కలదు.

ముందు వైపు చక్రానికి 220ఎమ్ఎమ్ చుట్టు కొలత గల డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున 190ఎమ్ఎమ్ చుట్టుకొలత గల డిస్క్ బ్రేకు కలదు. ఆఫ్ రోడింగ్ అవసరాలకు ఇందులో ప్రత్యేకంగా లాంగ్ ట్రావెల్ (సాధారణ బైకుల్లో ఉండే సస్పెన్షన్ కన్నా పొడవుగా ఉంటాయి) ఉన్న సస్పెన్షన్ సిస్టమ్ అందివ్వడం జరిగింది.

ఆఫ్ రోడింగ్ కోసం ప్రత్యేకమైన టైర్లు, తక్కువలో తక్కువగా ఉన్న బాడీ వర్క్, మట్టి మరియు ఘాట్ రోడ్ల మీద ప్రయాణానికి ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండే విధంగా జాగ్రత్తపడ్డారు.

కెఎల్ఎక్స్ 140జి మోటార్ సైకిల్ ముందు భాగంలో 21-అంగుళాలు మరియు వెనుక భాగంలో 18-అంగుళాల స్పోక్ వీల్స్ కలవు, 860ఎమ్ఎమ్ తక్కువ ఎత్తులో సీటు గల దీనిని మొత్తం బరువు కేవలం 99 కిలోలుగా ఉంది. తద్వారా అత్యుత్తమ హ్యాండ్లింగ్ సాధ్యమవుతుంది.

ప్రస్తుతం ఆఫ్ రోడింగ్ మీద ఎక్కువ ఆసక్తిచూపే వారికి ఈ కెఎల్ఎక్స్140జి మోటార్ సైకిల్ అత్యుత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. అయితే దీనిని కొనడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే క్రింద గ్యాలరీ ద్వారా కెఎల్ఎక్స్ 140జి మోటార్ సైకిల్ ను వీక్షించండి, నచ్చితే కొనేయండి.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Kawasaki Launches The 2017 KLX 140G Dirt Motorcycle In India
Please Wait while comments are loading...

Latest Photos