బుకింగ్స్‌లో సునామీ రేపుతున్న బజాజ్ డామినర్ 400

Written By:

బజాజ్ ఆటో దేశీయ ద్విచక్ర వాహన పరిశ్రమలోకి విడుదల చేసిన డామినర్ 400 క్రూయిజర్ బైకు అమ్మకాల పరంగా ఊహించని ఫలితాలను సాధిస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన డామినర్ 400 విదేశీ క్రూయిజర్ మోటార్ సైకిళ్లకు గట్టి పోటీనిస్తోంది.

అత్యంత శక్తివంతమైన ఇంజన్‌తో బజాజ్ ఆటో విడుదల చేసిన డామినర్ 400 పై ఇప్పటికే 2,500 లకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి. గత ఏడాది బజాజ్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో డిసెంబర్ 15, 2016 నుండి బుకింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

బజాజ్ అందుబాటులోకి తెచ్చిన డామినర్ 400 యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ రహిత వేరియంట్ ధర రూ. 1.36 లక్షలు మరియు డామినర్ 400 ఏబిఎస్ వేరియంట్ ధర రూ. 1.50 లక్షలు రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

ప్రస్తుతం టూరింగ్ సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్‌దే పై చేయి, అయితే డామినర్ 400 ఎంట్రీతో ఇప్పుడు టూరింగ్ సెగ్మెంట్లో ఉన్న మోటార్ సైకిళ్ల అమ్మకాలు కాస్త నెమ్మదించే అవకాశం ఉంది.

బజాజ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ, ప్రారంభంలో డామినర్ 400 ను విడుదల చేసిన అనంతరం నెలకు 13,000 యూనిట్ల విక్రయాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపాడు.

బజాజ్ ఆటో తమ ఫ్లాగ్‌‌షిప్ మోడల్ డామినర్ 400 లో 373.3సీసీ సామర్థ్యం గల డిటిఎస్-ఐ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అందించింది. ఇందులో 34బిహెచ్‌పి పవర్ మరియు 35ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ఇది కేవలం 8.23 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇందులో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ కలదు.

బజాజ్ డామినర్ 400 మూడు విభిన్న రంగుల్లో లభించును. అవి, మిడ్ నైట్ బ్లూ, మూన్ వైట్ మరియు ట్విలైట్ ప్లమ్. ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ గల ఇందులో స్లిప్పర్ క్లచ్ మరియు డ్యూయల్ ఛానల్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ కలదు.

పాకిస్తాన్ కు దిమ్మతిరిగింది....!!
మహాసముద్రం నుండి జలాంతర్గామి సాయంతో ప్రయోగించిన బాబర్-3 అణుక్షిపణి అంతా బూటకమే అని నిపుణులు తేల్చితెబుతున్నారు.

 

Read more on: #బజాజ్ #bajaj
Story first published: Thursday, January 12, 2017, 9:00 [IST]
English summary
Bajaj Dominar 400 Crosses 2,500 Bookings Since Its Launch
Please Wait while comments are loading...

Latest Photos