పల్సర్ ఏఎస్200 ను నిలిపివేసిన బజాజ్

Written By:

భారత దేశపు మూడవ అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో తమ అడ్వెంచర్ స్పోర్ట్ మోటార్ సైకిల్ ఏఎస్200 ను తమ లైనప్‌ నుండి తొలగించినట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే తమ లైనప్‌లో ఉన్న బైకులను బిఎస్-IV ఇంజన్‌తో అప్‌డేట్ చేసింది. మరి దీనిని తొలగించడానికి కారణం ఏమిటా అని పరిశీలిస్తే ఫిబ్రవరి 6, 2017 న విడుదల అయిన 200ఎన్ఎస్ కోసం ఇది దారిని సుగమం చేసినట్లు తెలిసింది.

పల్సర్ 200ఎన్ఎస్ రీలాంచ్ కోసమే ఏఎస్200 మోడల్ ను విపణిలో నుండి తొలగించిన విషయాన్ని బజాజ్ స్పష్టం చేసింది. అడ్వెంచర్ స్పోర్ట్ టూరర్ మోటార్ సైకిల్ ఏఎస్200 ను మొదటి సారిగా ఏప్రిల్ 2015 లో విపణిలోకి విడుదలయ్యింది.

ఏఎస్200 మోటార్ సైకిల్ యొక్క ట్యాగ్ లైన్‌కు తగ్గట్లుగా పనితీరు కనబరచడం మరియు ఉండాల్సిన ఫీచర్లు లేకపోవడం వంటి కారణాల ద్వారా ఆశించిన స్థాయిలో విక్రయాలు జరపలేకపోయింది.

ఇప్పుడు మార్కెట్ నుండి తొలగించబడిన ఏఎస్200 మరియు ఈ మధ్యనే విడుదలయిన్న 200ఎన్ఎస్ మోటార్ సైకిళ్లు దాదాపు దగ్గరిపోలికలతో ఉన్నాయి. డిజైన్ పరంగా అనేక కొత్త మార్పులు సంభవించినప్పటికీ మునుపటి మోడల్ ఆధారంగానే వస్తోంది.

2017 బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ మోటార్ సైకిల్ బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే 199.5సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 23.5బిహెచ్‌పి పవర్ మరియు 18.3ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

2017 బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ ప్రారంభ ధర రూ. 96,453 లు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉంది. ఈ సరికొత్త 200ఎన్ఎస్ బైకులో ఉన్న డ్యూయల్ టోన్ ఫ్యూయల్ ట్యాంకును గమనించగలరు.

2017 బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ మూడు నూతన రంగుల్లో లభించును. అవి, గ్రాఫైట్ బ్లాక్, మిరేజ్ వైట్ మరియు వైల్డ్ రెడ్. అయితే ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ మరియు యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో మిస్ అయ్యాయి.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Read more on: #బజాజ్ #bajaj
English summary
Bajaj Pulsar AS200 Discontinued — Reason Revealed
Please Wait while comments are loading...

Latest Photos