బెనెల్లీ టిఎన్‌టి 135 పాకెట్ రాకెట్ ఇండియన్ మార్కెట్లోకి

Written By:

ఈ మధ్యన ప్రకటనల చిత్రీకరణ కోసం టిఎన్‌టి 135 అనే మిని బైకును బెనెల్లీ ఇండియాకు తీసుకువచ్చింది. అంతకు మునుపు జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద బెనెల్లీ తమ టిఎన్‌టి135 మంకీ బైకును ప్రదర్శించింది. ఆ తరువాత జరిగిన గోవాలో ఇండియా బైక్ వీక్ వేడుకల్లో ఇది తళుకుమంది. విడుదలను సూచిస్తూ బెనెల్లీ దీనిని భారతీయులకు సుపరిచం చేసే ప్రయత్నం చేస్తోంది.

మరో మూడు నెలల్లో దేశీయంగా విడుదలకు సిద్దమైన పాకెట్ ఫ్రెండ్లీ రాకెట్ బైకు టిఎన్‌టి135 గురించి పూర్తి వివరాలు నేటి కథనంలో తెలుసుకుందాం రండి. ఒక వేళ నచ్చిందంటే కొనుగోలుకు ప్లాన్ చేసుకుందురు గాని...

ఇటాలియన్‌కు చెందిన ప్రముఖ శక్తివంతమైన మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ బెనెల్లీ ఇండియా విభాగం, తమ దేశీయ లైనప్‌లోకి అతి చిన్న నేక్డ్ వర్షన్ మోటార్ సైకిల్ టిఎన్‌టి 135 ను చేర్చేందుకు ప్రయత్నిస్తోంది.

ఆధారం లేని కొన్ని వార్తల ప్రకారం బెనెల్లీ ఈ టిఎన్‌టి135 మోటార్ సైకిల్‌ను మార్చి 2017 న విపణిలోకి విడుదల చేయనున్నట్లు తెలిసింది. అయితే పూర్తి స్థాయి రహదారి పరీక్షలు చేసుకోని ఇది విడుదలయ్యేందుకు రెండు మూడు మాసాల సమయం పట్టనుంది.

సాంకేతిక వివరాలను పరీశిలిస్తే, ఇందులో 135సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే, ఫ్యూయల్ ఇంజెక్టడ్ సింగల్ సిలిండర్ SOHC (సింగల్ ఓవర్ హెడ్ క్యామ్‌షాఫ్ట్) ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ 9,000ఆర్‌పిఎమ్(ఇంజన్ వేగం) వద్ద 12.6బిహెచ్‌పి పవర్ మరియు 7,000ఆర్‌పిఎమ్(ఇంజన్ వేగం) వద్ద 10.8ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును, దీనికి అనుసంధానం చేయబడిన 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ వెనుక చక్రానికి సరఫరా అవుతుంది.

రఫ్ అండ్ స్టఫ్ అవసరాలకు బాగా సరిపోయే ఇందులో ముందు వైపున 120ఎమ్ఎమ్ ట్రావెల్ ఉన్న 41ఎమ్ఎమ్ అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ అదే విధంగా వెనుక వైపున 50ఎమ్ఎమ్ ట్రావెల్ గల ప్రిలోడెడ్ మోనో షాక్ అబ్జార్వర్ కలదు.

టిఎన్‌టి 135 ని ఇష్టపడే ఔత్సాహికుల భద్రత కోసం ముందు వైపున రెండు పిస్టన్ల కాలిపర్ గల 230ఎమ్ఎమ్ చుట్టుకొలత గల డిస్క్ బ్రేక్ అదే విధంగా వెనుక వైపున రెండు పిస్టన్ల కాలిపర్ అప్ ప్రంట్ 190ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ కలదు.

ఈ బైకు మొత్తం మీద మిమ్మల్ని అమితంగా ఆశ్చర్యానికి గురిచేసేది టైర్లు. ఎందు కంటే స్కూటర్ తరహాలో ఇది 12-అంగుళాల పరిమాణం గల అల్లాయ్ చక్రాలను మీద కూర్చొంది. ఇందులో ముందు వైపు 120/70-జడ్ఆర్12 మరియు వెనుక వైపున 130/70-జడ్ఆర్12 టైర్లు కలవు.

కొలతల పరంగా బెనెల్లీ టిఎన్‌టి 135 పొడవు 1,750ఎమ్ఎమ్, వెడల్పు 755ఎమ్ఎమ్, ఎత్తు 1,025ఎమ్ఎమ్ మరియు వీల్ బేస్ 1,215ఎమ్ఎమ్ గా ఉంది.

టిఎన్‌టి 135 సీటు ఎత్తు 760ఎమ్ఎమ్‌గా ఉంది. 7.2-లీటర్ల సామర్థ్యం ఉన్న ఇంధన ట్యాంకు గల దీని గ్రౌండ్ క్లియరెన్స్ 160ఎమ్ఎమ్‌గా ఉంది. ప్రత్యేకించి ఇండియన్ రహదారులను దృష్టిలో ఉంచుకుని దీనిని అభివృద్ది చేసినట్లు ఉంటుంది.

డిజైన్ విషయానికి వస్తే, ఇండియన్ మార్కెట్లో విలక్షణమైన ఆకృతిని కలిగి ఉన్న వాటిలో ఇదీ ఒకటి. చిన్న పరిమాణంలో చక్రాలు, పదునుగా సీటు క్రింది భాగంలో ప్రక్కకు ఉన్న డ్యూయల్ ఎగ్జాస్ట్ సిస్టమ్, మరియు మల్టీ ఎల్ఇడి హెడ్ ల్యాంప్ కలిగి ఉంది.

సరికొత్త బెనెల్లీ టిఎన్‌టి 135 ప్రారంభ ధర సుమారుగా రూ. 1.3 లక్షల నుండి 1.5 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉండే అవకాశం ఉంది.

సగం శరీరంతో ఉన్న బైకులంటే ఇష్టం లేదా, యమహా యొక్క ఆర్6 స్పోర్ట్స్ బైకు ఫోటోలను చూస్తారా...? అయితే క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి....

 

English summary
Benelli TNT 135 Set To Enter India: Here's All You Need To Know About The Italian Pocket Rocket
Please Wait while comments are loading...

Latest Photos