బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ నుండి ఎగిరే బైకు

బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ విభాగం అద్బుతమైన ఆవిష్కరణకు తెరతీసింది. హావర్ బైకు ప్రేరిత ఎగిరే బైకును ఆవిష్కరించింది. దీనికి ఆర్ 1200 జిఎస్ అడ్వెంచర్ బైకు అనే పేరును కూడా ఖరారు చేసింది.

Written By:

ప్రపంచ వాహన పరిశ్రమలో నూతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే వాటిలో బిఎమ్‌డబ్ల్యూ ఆరితేరిన సంస్థ. ప్రపంచానికి వాహనా సేవలను పరిచయం చేసిన వాహన తయారీ సంస్థలో అతి పురాతణ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ. ఇప్పుడు అత్యంత విలాసవంతమైన కార్లతో పాటు మోటార్ సైకిళ్లను కూడా తయారు చేస్తోంది. వీటికి కొనసాగింపుగా ఆధునిక సాంకేతికత మరియు పరిజ్ఞానానికి అంతం ఉండదని నిరూపిస్తూ, ఎగిరే మోటార్ సైకిళ్లను అభివృద్ది చేస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు...

603-పార్ట్ లెగో కిట్ ఆధారంతో బిఎమ్‌డబ్ల్యూ ఆర్1200 జిఎస్ అడ్వెంచర్ ఎగిరే బైకును మోటోరాడ్ అభివృద్ది చేస్తోంది.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1200 జిఎస్ మెయిన్ వెర్షన్ ఆధారంతో లెగో ప్రతిరూపాన్ని పూర్తి స్థాయి ఎగిరే మోటార్ సైకిల్‌‌గా ఆవిష్కరించనున్నారు. ప్రత్యేకించి బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ ఉత్పత్తుల కోసం అభివృద్ది చేసిన నఈ లెగ్‌ కిట్‌ ధర 59.99 డాలర్లు (రూ. 4,026 లు)గా ఉన్నట్లు తెలిసింది.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1200 జిఎస్ కాన్సెప్ట్ హావర్ బైకుని పూర్తిగా బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ వారి డిజైన్ భాషలో, బాక్సర్ ఇంజన్ మరియు జిఎస్ ఫ్రంట్ ప్రొఫైల్ మరియు లెగో టెక్నికల్ డిజైన్ భాషతో పరిచయం చేయడం జరిగింది.

ఈ ప్రయోగానికి హావర్ రైడ్ డిజైన్ కాన్సెప్ట్ అనే పేరుతో నామకరణం చేసారు. బిఎమ్‌డబ్ల్యూ లోని వివిధ విభాగాల నుండి ఎంపిక చేసిన జూనియర్ ట్రైనీ బృందం సంస్థ యొక్క మ్యూనిచ్ కేంద్రంలో ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ది చేస్తున్నారు.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1200 జిఎస్ హావర్ బైకులో రెండు సిలిండర్ల ఇంజన్ యథావిధంగా ఉంది. అయితే చక్రాలటతో పాటు ముందు మరియు వెనుక వైపున రెండు చొప్పున ప్రొపెల్లర్స్ ఉన్నాయి.

లెగో కాన్సెప్ట్‌లో భాగంగానే హ్యాండిల్ బార్, విండ్ షీల్డ్ లను అభివృద్ది చేయడం జరుగుతోంది. ఈ అడ్వెంచర్ మోటార్ సైకిల్ లో నల్లటి రంగులో ఉన్న బ్లాక్ స్పోక్ అల్లాయ్ వీల్స్, అధ్వితీయమైన టైర్లతో పాటు మరిన్ని డిజైన్ అంశాలను జోడిస్తున్నారు.

బిఎమ్‌డబ్ల్యూ తమ లెగో కాన్సెప్ట్ ప్రేరిత హావర్ బైక్ ఆధారిత మోటార్ సైకిల్ పూర్తి స్థాయిలో పరిచయం చేయడానికి ఇంకా సమయం ఉంది ఆ లోపు హోండా అతి త్వరలో దేశీయంగా విడుదల చేయనున్న ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ మీద ఓ లుక్కేసుకోండి. ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
BMW Motorrad Builds A Brilliant LEGO-Inspired Hover Bike
Please Wait while comments are loading...

Latest Photos