డుకాటి ఇండియా రికార్డ్ సేల్స్: ఎన్ని అమ్ముడుపోయాయో తెలుసా ?

Written By:

ఏడాదికి లక్షల యూనిట్ల విక్రయాలు సాధిస్తున్న హీరోతో పోల్చుకుంటే డుకాటి అమ్మకాల సంఖ్య ఎంత?నిమ్మకాయ బద్దంత. అసలు 1,000 యూనిట్ల మోటార్ సైకిళ్ల అమ్మకాలు కూడా ఓ రికార్డేనా...? అని అనుకుంటున్నారా...? ఇది అక్షరాల రికార్డే. ఎందుకంటే రూ. 7 లక్షల ప్రారంభ ధర నుండి రూ . 1.12 కోట్ల గరిష్ట ధరతో లభించే బైకులు ఈ స్థాయిలో అమ్మకాలు నమోదుచేసుకున్నాయి.

మార్కెట్లోకి ఎప్పటికప్పుడు నూతన ఉత్పత్తులను విడుదల చేయడం మరియు డీలర్ల సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం ద్వారా ఈ విధమైన అమ్మకాలు సాధ్యమయ్యాయని తెలుస్తోంది.

ప్రస్తుతం బెంగళూరు, పూనే, ఢిల్లీ, ముంబాయ్ మరియు అహ్మదాబాద్ మొత్తం ఐదు నగరాలలో రెండు ఏడు విక్రయ కేంద్రాలున్నాయి.

ఇటాలియన్‌కు చెందిన ఖరీదైన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ డుకాటి 2016 ఏడాదిలో దేశవ్యాప్తంగా మొత్తం 580 మోటార్ సైకిళ్లను విక్రయిచింది. మరియు డుకాటి దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి 1000 యూనిట్ల అమ్మకాలు జరిపింది.

మొత్తం అమ్మకాల్లో 17 శాతం డైవెల్ డార్క్ మరియు కార్బన్ మోటార్ సైకిళ్లు ఉన్నాయి. మరియు 2015 తో పోల్చుకుంటే 2016లో స్క్రాంబ్లర్ 38 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

మొత్తం అమ్మకాల్లో డుకాటి యొక్క పాపులర్ మోటార్ సైకిల్ మోన్‌స్టర్ 19 శాతం విక్రయాలు జరిపింది. డుకాటి యొక్క సూపర్ బైక్ 959 పనిగాలా జూలై 2016 నుండి డెలివరీలను ప్రారంభించినప్పటికీ 12 శాతం విక్రయాలను నమోదు చేసుకుంది.

డుకాటి ఇండియా భారీ వృద్దిని సాధించడంలో నూతనంగా విడుదలైన ఎక్స్‌డైవెల్, మల్టీస్ట్రాడా 1200ఎండ్యూరో, హైపర్‌స్ట్రాడా 939 మరియు హైపర్‌మోటార్డ్939 లు కీలకమని తెలిసింది.

దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయ విపణిలో కూడా భారీ వృద్దిని సాధిస్తోంది. 2016 ప్రపంచ వ్యాప్తంగా డుకాటి సంస్థ మొత్తం 55,451 యూనిట్ల బైకులను డెలివరీ ఇచ్చింది. అంతకు ముందు 2015 లో 54,809 యూనిట్లను డెలివరీ ఇచ్చింది. విక్రయాల్లో మొత్తం 1.2 శాతం వృద్దిని సాధించింది.

డుకాటి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రవి అవలూర్ మాట్లాడుతూ, 2016 ఫలితాలు ఎంతగానో సంతృప్తినిచ్చాయి. 2017 లో కూడా ఇదే తరహా ఫలితాలు సాధ్యమవుతాయని విశ్వాసం వ్యక్తం చేసారు.

దేశవ్యాప్తంగా విక్రయ కేంద్రాలను విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలిపాడు. దేశీయంగా అందుబాటులో ఉన్న డుకాటి మోటార్ సైకిళ్ల ఫోటోలను వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.... డుకాటి మల్టీస్ట్రాడా ఎండ్యురో ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి....

 

Story first published: Friday, February 10, 2017, 17:13 [IST]
English summary
Ducati India Achieves 1000 Motorcycle Sales Milestone
Please Wait while comments are loading...

Latest Photos