సిబి ట్విస్టర్ 250 ఆవిష్కరించిన హోండా: ఇంజన్ మరియు పూర్తి వివరాల కోసం...

Written By:

హోండా టూ వీలర్ల తయారీ సంస్థ బ్రెజిల్‌లో సిబి ట్విస్టర్ 250 మోటార్ సైకిల్‌ను అధికారికంగా విడుదల చేసింది. దీని విడుదల కంటే ముందుగా యమహా ఇండియా క్వార్టర్ లీటర్ ఇంజన్ గల ఎఫ్‌జడ్25 బైకును మార్కెట్లోకి విడుదల చేసింది. పరోక్షంగా దీనికి పోటీని సృష్టించే ఉద్దేశ్యంతో హోండా తమ సిబి ట్విస్టర్ 250 ను ఆవిష్కరించినట్లు తెలుస్తోంది.

దేశీయ టూ వీలర్ల మార్కెట్లోకి హోండా ఈ సిబి ట్విస్టర్ 250 ని విడుదల చేస్తుందా ? లేదా ? అంటే, ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు లేదనే చెప్పాలి. అయితే 250సీసీ సామర్థ్యం ఉన్న యమహా ఎఫ్‌జడ్25కు పోటీగా ఏరోజయినా విపణిలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు యమహా ఎఫ్‌జడ్25 కు ఎలాంటి పోటీ లేదు. ఇక ట్విస్టర్ 250 వస్తే, 250సీసీ సామర్థ్యం గల ఇంజన్‌లను కలిగి ఉన్న రెండు మోడళ్ల మధ్య విపరీతమైన పోటీ నెలకొననుంది.

హోండా వారి 250సీసీ సామర్థ్యం ఉన్న ట్విస్టర్ విషయానికి వస్తే, ఇందులో ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్, ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్, రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు మరియు డ్యూయల్ ఛానల్ యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కలదు.

సాంకేతికంగా హోండా సిబి ట్విస్టర్ 250 లో 249.5సీసీ సామర్థ్యం ఉన్న గాలితో చల్లబడే, ఓహెచ్‌సి సింగల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్టడ్ ఇంజన్ కలదు. దీనికి 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం చేయబడింది.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ 7,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 22.4బిహెచ్‌పి పవర్ మరియు 6,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 22.4ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

బ్రెజిల్ దేశంలో కొనుగోలు దారులు ఈ 250సీసీ సిబి ట్విస్టర్ మోటార్ సైకిల్‌ను పెట్రోల్‌తో పాటు ఇథనోల్ ఇంధన వేరియంట్లో కూడా ఎంచుకోవచ్చు. ఇథనోల్ వేరియంట్ సిబి ట్విస్టర్ గరిష్టంగా 22.6బిహెచ్‌పి పవర్ మరియు 22.8ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

సరికొత్త సిబి ట్విస్టర్ 250లో ముందు వైపున 130ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున 108ఎమ్ఎమ్ మోనో షాక్ అబ్జార్వర్ సస్పెన్షన్ విధులను నిర్వర్తించును. అదే ముందు వైపున 276ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ వెనుక వైపున 220ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్‌లున్నాయి.

శరీరం మొత్తాన్ని డైమండ్ ఫ్రేమ్ ఆధారంగా నిర్మించడం జరిగింది, తద్వారా స్థిరత్వం పెరిగి వైబ్రేషన్స్ పూర్తి స్థాయిలో అదుపులో ఉంటాయి. సిబి ట్విస్టర్ లోని పెట్రోల్ మరియు ఇథనోల్ రెండు రెండు వేరియంట్లలో కూడా 16.5-లీటర్ల కెపాసిటీ గల ఇంధన ట్యాంకు కలదు.

ఈ మోటార్ సైకిల్ ముందువైపున 110/70 సెక్షన్ మరియు వెనుక వైపున 140/70 సెక్షన్ కొలతల్లో ఉన్న టైర్లు గల 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ కలవు. దీనికి పోటీగా పరిగణిస్తున్న యమహా ఎఫ్‌జడ్25 లోని టైర్లు కూడా ఇవే కొలతలను కలిగి ఉన్నాయి.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Read more on: #హోండా #honda
English summary
Honda CB Twister 250 Unveiled; An Ideal Yamaha FZ25 Rival
Please Wait while comments are loading...

Latest Photos