రాతితో నిర్మించిన 1982 నాటి హోండా సిఎక్స్500 బైకు

హోండా మోటార్ సైకిల్ ఇలాంటి బైకును ఇంతకుముందెప్పుడూ తయారు చేసిన దాఖలాలు లేవు. అయితే మరి దీనిని ఇలా ఎవరు రూపొందించారు అని ఆయోమయంలో ఉన్నారా...? అయితే చూద్దాం రండి.

Written By:

1982 నాటి హోండా సిఎక్స్500 బైకును భారీ కస్టమైజేషన్స్ గురిచేసి స్టోన్ బాడీ ప్యానెల్లతో అత్యంత క్రేజీగా తయారు చేశాడో జర్మన్ ఓనర్. కస్టమైజేషన్ ఎవరు చేస్తే ఏమిటి మునుప్పెన్నడూ చూడని రీతిలో దీనిని విభిన్నమైన బాడీ ప్యానల్స్‌తో రూపొందించాడు.

చూడగానే ఇంతలా ఆకట్టుకుంటున్న ఈ బైకు ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉందేమో అని పొరబడేరు. ఇదొక సాధారణ మిడ్ సైజ్ హోండా బైకు. ఈ తరహాలో మిడ్ సైజ్ బైకులు మార్కెట్లోకి వస్తే హాట్ కేకుల్లా అమ్ముడుపోవడం ఖాయం.

1982 కాలానికి చెందిన హోండా సిఎక్స్500 బైకును జర్మనీలోని మెండిగ్ లో నివసించే క్రిస్ జెర్నియా ఇలా కస్టమైజ్ చేశాడు. క్రిస్ మాట్లాడుతూ, అనేక మంది బైకు ప్రియులు తమ బైకులు విభిన్నంగా ఉండేందుకు పెయింటింగ్ పరంగా అనేక కస్టమైజేషన్ నిర్వహిస్తుంటారు.

అయితే నాకు తట్టిన ఆలోచన ద్వారా సాధారణ ప్యానల్స్ స్థానంలో స్టోన్ (రాతి) ప్యానల్‌ను అందించాలనుకున్నాను. కస్టమైజేషన్ అనంతరం ఈ రూపాన్ని సంతరించుకుందని క్రిస్ తెలిపాడు.

స్టోన్ ప్యానల్ అంటే రాయిని పోలి ఉండే ప్లాస్టిక్ డీకాల్స్ అని అనుకుంటున్నారా...? అయితే ఇక్కడ మీరు పొరబడినట్లే. ఎందుకంటే స్టోన్ ప్యానల్ అనుభూతిని ప్రత్యక్షంగా పొందడానికి ఈఫిల్ పర్వతాల్లో సేకరించిన వొల్కానిక్ రాతి నుండి కొన్ని బండరాళ్లను సేకరించి వాటిని కావాల్సి రూపంలోకి మలిచి ఇందులో వినియోగించినట్లు ఆయన క్రిస్ చెప్పుకొచ్చాడు.

ఈ క్రేజీ కస్టమైజేషన్ చేసిన వ్యక్తి సుమరుగా 450 కిలోల వోల్కానిక్ రాయిని సేకరించాడు. పాత కాలం నాటి కస్టమైజేషన్ అని తెలపడానికి ఈ రాయి మాత్రమే సరైనదని మరియు మనకు నచ్చిన రీతిలో మలుచుకోవడానికి కూడా ఈ స్టోన్ అత్యుత్తమం అని తెలిపాడు.

అసలైన సిఎక్స్500 బైకులోని ఇంధన ట్యాంకును పోలి ఉండే విధంగా రాయి రూపంలో ఫ్యూయల్ ట్యాంక్ అందివ్వడం నిజంగా గొప్పే. ట్యాంకు పై భాగంలో పొడగించబడిన ఫ్యూయల్ ఫిల్లర్ క్యాపును గుర్తించగలరు.

కస్టమైజేషన్ కర్తకు నచ్చిన విధంగా దీని సీటును మలుచుకున్నాడు. దీనికి నాలుగు వైపులా రంధ్రాలు చేసి నాలుగు మిల్లీమీటర్ల స్టీల్ ట్యూబులను తొడిగి బైకు మీద బిగించారు.

ఇంజన్ పరంగా చూస్తే ఈ బైకులో 497సీసీ సామర్థ్యం గల నీటితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. అయితే త్వరలో ఈ ఇంజన్‌ను పూర్తిగా మార్చేస్తానని క్రిస్ జెర్నియా పేర్కొన్నాడు.

సస్పెన్షన్ పరంగా సిఎక్స్500 కు ముందు వైపున హోండా విటి600 షాడో ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున హ్యార్లీ డైనా లోని రియర్ షాక్ అబ్జార్వర్లతో మార్పులు చేశాడు.

కస్టమైజేష్ పూర్తయిన తరువాత గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం ప్రయత్నిస్తానని తెలిపాడు. ఇందు కోసం ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగులు తీసే రాతి బైకు అనే అంశం మీద గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించనున్నాడు. తరువాత తన కొత్త కస్టమైజేషన్ ప్రాజెక్ట్ హ్యార్లీ స్పోర్ట్‌స్టర్‌ను రాయితో నిర్మించడానికి సిద్దపడుతున్నట్లు తెలిపాడు.
Via bikeexif 

టయోటా ఫార్చ్యూనర్‌కు పోటీని తీసుకొస్తున్న మహీంద్రా
మహీంద్రా ఆధ్వర్యంలో దేశీయంగా వ్యాపారాన్ని విస్తరించుకుంటున్న శాంగ్‌యాంగ్ ఇండియన్ మార్కెట్లో ప్రీమియమ్ ఎస్‌యువి సెగ్మెంట్లో అత్యుత్తమ విక్రయాలు సాధిస్తున్న ఫార్చ్యూనర్‌కు పోటీని సిద్దం చేస్తోంది.

వితారా బ్రిజాకు పోటీగా హ్యుందాయ్ క్యుఎక్స్ఐ
హ్యుందాయ్ మోటార్స్ తమ అప్‌‌కమింగ్ కాంపాక్ట్ ఎస్‌యువి మీద పనిచేస్తోంది. దీనికి క్యుఎక్స్ఐ అనే కోడ్ పేరును కూడా ఖరారు చేసినట్లు తెలిసింది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Read more on: #హోండా #honda
Story first published: Thursday, January 5, 2017, 10:42 [IST]
English summary
Custom Honda CX500 Is A Motorcycle That Fred Flintstone Would Love To Ride
Please Wait while comments are loading...

Latest Photos

LIKE US ON FACEBOOK