జి310 జిఎస్ మరియు కెటిఎమ్ 390 లకు పోటీగా హోండా డామినేటర్

దేశీయ విపణిలో ఉన్న ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లోకి తమ డామినేటర్ మోటార్ సైకిలను రీ లాంచ్ చేయడానికి హోండా టూ వీలర్స్ సిద్దం అవుతున్నట్లు కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Written By:

ఇది హోండా కు చెందిన అడ్వెంచర్ మోటార్ సైకిల్‌ అని రూపం, ఆకృతి చూడగానే ఇట్టే చెప్పగలం.... ఆన్ రోడ్ మరియు ఆఫ్ రోడింగ్ సామర్థ్యం ఉన్న ఈ డామినేటర్ బైకును బిఎమ్‌డబ్ల్యూ జి310జిఎస్ మరియు కెటిఎమ్ 390 అడ్వెంచర్‌లకు పోటీగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇది దేశీయంగా విడుదలయితే ఇప్పటికే భారీ వేడి మీద ఉన్న ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో పోటీ తారా స్థాయికి చేరే అవకాశం ఉంది.

అడ్వెంచర్ మోటార్ సైకిళ్లు ప్రస్తుతానికి కొద్ది సంఖ్యలోనే ఉన్నప్పటికీ 2017 ఏడాది చివరి నాటికి ఈ సెగ్మెంట్లో పోటీ మరింత తీవ్రం కానుంది. అందుకు బిఎమ్‌డబ్ల్యూ దిగ్గజం అభివృద్ది చేస్తున్న జి310జిఎస్ ఒకటి.

గతంలో ఉన్న మోడళ్లకు ఇండియాలో మంచి స్పందన లభిస్తుండటంతో డామినేటర్ రీలాంచ్‌పై హోండా ఆసక్తి కనబరుస్తోంది.

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ గత ఏడాది జరిగిన 2016 ఎకిమా మోటార్ సైకిల్ షో వేదిక మీద జి310 జిఎస్ ను ప్రదర్శించింది. ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ జి 310 ఆర్ ఆధారంగా రూపొందించింది. దీనికి తోడుగా, కవాసకి వెర్సేస్ ఎక్స్300 మరియు సుజుకి కూడా తమ డిఎల్250 కాన్సెప్ట్‌ను అదే వేదిక మీద ప్రదర్శించింది.

అయితే మోటార్ బైక్స్ అనే వేదిక ప్రకటించిన కథనం మేరకు, హోండా ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంచిన డామినేటర్ అడ్వెంచర్ మోటార్ సైకిల్‌ను మళ్లీ విడుదల చేయడానికి కంకణ కట్టుకున్నట్లు తెలిపింది.

1988 నుండి 2000 మధ్య కాలంలో ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైకుగా పేరుగాంచింది. అప్పట్లో విక్రయాల పరంగా మంచి ఫలితాలను సాధించేది.

హోండా మోటార్ సైకిల్స్ సంస్థ డామినేటర్ ఆధారిత నూతన అడ్వెంచర్ మోటార్ సైకిల్‌కు సంభందించిన పేటెంట్ పొందిన చిత్రాన్ని విడుదల చేసింది, ఇందులో కొన్ని కొత్త ఫీచర్లు వచ్చిన ఆనవాళ్లు ఉన్నాయి.

డామినేటర్ అడ్వెంచర్ బైకులో హ్యాండిల్ బార్‌కు ఎడమ వైపున కొన్ని కంట్రోల్ బటన్స్ కలవు. రైడింగ్ సమయంలో విభిన్న మోడ్‌లను ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కూడా తెలిసింది.

ఫోటోని గమనించగానే, ఆఫ్ రోడ్ మరియు ఆన్ రోడ్ అవసరాలకు ఉపయోపడే మోటార్ సైకిల్ అని చెప్పవచ్చు. ఇందులో పొడవాటి సీటు, ఎక్కువ పరిమాణంలో ఉన్న మడ్ గార్డ్, రీలాక్స్ రైడింగ్ పొజిషన్ మరియు పొడగించబడిన లగేజ్ కిట్లను గుర్తించ్చు.

ఇప్పుడు మనం చర్చించుకుంటున్న అసలైన డామినేటర్ తొలిసారిగా 1988 లో విడుదలయ్యింది. అప్పట్లో ఇందులో 643సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఉండేది. ఇది గరిష్టంగా 44బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

తాజాగా హోండా బాస్ కోహి సుగితా 250సీసీ సామర్థ్యం ఉన్న క్రాస్‌రన్నర్ విడుదలకు మార్గం సుగమం చేసుకుంటోందని హింట్ ఇచ్చారు. కాబట్టి డామినర్ 250సీసీ సామర్థ్యం గల ఇంజన్‌తో ఎంట్రీలెవల్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో పోటీకి సిద్దం అవుతోంది.

ఇది మార్కెట్లోకి విడుదలయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్, కెటిఎమ్ 390 అడ్వెంచర్ మరియు త్వరలో విడుదల కానున్న బిఎమ్‌డబ్ల్యూ జి 310 జిఎస్ లకు గట్టి పోటీనివ్వనుంది.

 

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Read more on: #హోండా #honda
Story first published: Friday, February 3, 2017, 15:29 [IST]
English summary
Honda Is Bringing Back The Dominator — A Rival For BMW G 310 GS And KTM 390 Adventure
Please Wait while comments are loading...

Latest Photos