ఒకినవ రిట్జ్ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయంగా విడుదల: ధర రూ. 43,702లు

Written By:

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఒకినవ ఆటోటెక్ ఇండియన్ మార్కెట్లోకి తమ ఇ-స్కూటర్‌ను విడుదల చేసింద. రిట్జ్ పేరుతో విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ.43,702 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

ఒకినవ సంస్థ తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దేశీయంగా రాజస్థాన్‌లో ఉన్న బివండి తయారీ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

ఈ స్కూటర్ ను రెండు పద్దతుల్లో ఛార్జ్ చేయవచ్చు. సాధారమ పద్దతిలో ఆరు నుండి ఎనిమది గంటలు పాటు మరియు పాస్ట్ పద్దతిలో ఒకటి నుండి రెండు గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. దీని పరిధి 200కిలోమీటర్లుగా ఉంది.

ఒకినవ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ఆధారంతో నిర్మించింది. తద్వారా ఇది ఉత్తమ పనితీరును కనబరచడంతో పాటు స్థిరత్వాన్ని కూడా ప్రదర్శిస్తుంది.

రిడ్జ్ స్కూటర్‌లో యాంటి థెప్ట్ అలారమ్, స్పీడో మీటర్, సెంట్రల్ లాకింగ్ స్మార్ట్ కంట్రోల్ లతో పాటు ఇఎకో మరియు పవర్ రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి.

ఒకినవ ప్రకారం ఇది 18 నుండి 60 ఏళ్ల మధ్య వయస్కులకు బాగా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇది మహిళలను కూడా ఆకర్షించే విధంగా రెడ్-గ్రీన్-గోల్డ్, రెడ్-వైట్- మరియు వైట్ వంటి రంగుల కాంబినేషన్లలో లభించును.

మెట్ట ప్రదేశాల్లో ఉత్తమ రైడింగ్ కోసం ట్యూబ్ లెస్ టైర్లు టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఇది మొత్తం 50 కిలోల వరకు బరవును మోయగలిగే కెపాసిటీతో పాటు అండర్ సీట్ స్టోరేజి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది.

ఒకినవ ఆటోటెక్ సంస్థ ఇండియాకు చెందినదే, సంస్థ మేనేజింగ్ డైరక్టర్ జితేందర్ శర్మ మాట్లాడుతూ, భారత దేశంలో దిగ్గజ ఎలక్ట్రిక్ టూ వీలర్ల తయారీ సంస్థ ఎదగడమే లక్ష్యంగా ఉన్నట్లు తెలిపాడు. రోజూ వారి అవసరాలకు ఇది చక్కగా ఉపయోగపడుతుందని తెలిపాడు.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Okinawa Ridge Electric Scooter Launched In India; Priced At Rs 43,702
Please Wait while comments are loading...

Latest Photos