మరో అరుదైన మైలురాయిని అధిగమించిన హోండా ఆక్టివా

Written By:

భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్ మరియు స్కూటర్ల జాబితాలో మొదటి స్థానంలో ఉండే హోండా ఆక్టివా స్కూటర్ మరో మైలు రాయిని ఛేదించింది. ప్రొడక్షన్ ప్లాంటులో 150 లక్షవ ఆక్టివా స్కూటర్‌ను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది హోండా స్కూటర్స్ అండ్ మోటార్ సైకిల్స్ ఇండియా లిమిటెడ్.

హోండా స్కూటర్ అండ్ మోటార్ సైకిల్స్ ఇండియా లిమిటెడ్ విడుదల చేసిన ఓ ప్రకటనలో 2001 నుండి ఇప్పటి వరకు కోటిన్నర యూనిట్లను ఉత్పత్తి చేసిన్లు పేర్కొంది.

ఒక్క 2016-2017 మధ్యలో 27.59 లక్షలు యూనిట్లను విక్రయించి, దేశవ్యాప్తంగా బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్ మరియు స్కూటర్‌గా నిలిచింది.

హోండా ద్విచక్రవాహనాల తయారీ ఇండియా విభాగానికి నూతనంగా నియమితులైన మినొరు కటో 150 లక్షవ ఆక్టివా స్కూటర్‌ను హోండా ప్రొడక్షన్ ప్లాంటు నుండి విపణిలోకి విడుదల చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

హోండా టూ వీలర్స్ సంస్థకు గుజరాత్‌లో ఉన్న వితల్‌పూర్ ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 12 లక్షలుగా ఉంది.

2009-10 ఏడాది నుండి 2016-2017 ఏడాది మధ్యలో మునుపున్న స్కూటర్ల మార్కెట్ వాటా 16 శాతం 32 శాతానికి పెరిగిందని మినొరు కటో వెల్లడించారు. కేవలం ఏడు సంవత్సరాల్లో ఈ వృద్ది నమోదయ్యిందని పేర్కొన్నారు.

ప్రారంభంలో టూ వీలర్ల సెగ్మెంట్లో స్కూటర్ల మీద మార్కెట్లో చాలా తక్కువ విలువ ఉండేది. అయితే 2001లో హోండా ఆక్టివా స్కూటర్ అందుబాటులోకి తెచ్చాకు, ఈ ధోరణి మారిపోయి ఇప్పుడు బైకులకు ధీటుగా ఇండియన్ స్కూటర్ల మార్కెట్ విస్తరిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.

విడుదలైన తొలి ఏడాది 2001లో 55,000 యూనిట్ల ఆక్టివా స్కూటర్లు అమ్ముడయ్యాయి, తరువాత వరుసగా మూడేళ్లు ఆటోమేటిక్ స్కూటర్ల విభాగంలో ఆక్టివా రాజ్యమేలింది. 2012-2013 ఏడాదిలో 10 లక్షల విక్రయాల బెంచ్ మార్క్ దాటింది.

2016-2017 ఏడాదిలో స్కూటర్లు మరియు బైకులను కలుపుకొని భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం 2.09 లక్షల విక్రయాలు సాధిస్తున్న హీరో స్ల్పెండర్ కన్నా గరిష్ట విక్రయాలతో ఆక్టివా అగ్రస్థానంలో ఉంది.

హోండా తమ ఆక్టివా బ్రాండ్ పేరు క్రింద మూడు మోడళ్లను విక్రయిస్తోంది. అవి, ఆక్టివా ఐ, ఆక్టివా 4జీ, ఆక్టివా 125. వీటి ధరలు, ఇంజన్, మరియు మన తెలుగు నగరాల్లో ఆన్ రోడ్ ధరలు తెలుసుకుందాం రండి...

హోండా ఆక్టివా ఐ

హోండా టూ వీలర్స్ ఈ ఆక్టివా ఐ వేరియంట్లో 109సీసీ సామర్థ్యం గల ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 8బిహెచ్‌పి పవర్ మరియు 8.94ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల దీని గరిష్ట వేగం గంటకు 83కిలోమీటర్లుగా ఉంది.

ఐదు విభిన్నరంగుల్లో ఎంచుకోగల దీని మైలేజ్ లీటర్‌కు 66కిలోమీటర్లుగా ఉంది.

  • హైదరాబాద్‌లో ఆక్టివా ఐ ఆన్ రోడ్ ధర రూ. 57,372 లు
  • విజయవాడలో ఆక్టివా ఐ ఆన్ రోడ్ ధర రూ. 57,798 లు

హోండా ఆక్టివా 4జీ

సాంకేతికంగా హోండా ఆక్టివా 4జీ వేరియంట్లో 109.2సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 8బిహెచ్‌పి పవర్ మరియు 8.83ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

ఏడు విభిన్న రంగుల్లో ఎంచుకోగల హోండా ఆక్టివా 4జీ ధరలు

  • హైదరాబాద్‌లో ఆన్ రోడ్ ధర రూ. 61,043 లు
  • విజయవాడలో ఆన్ రోడ్ ధర రూ. 61,470 లు

హోండా ఆక్టివా 125

హోండా టూ వీలర్స్ లోని 125 మోడళ్లలో 124సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 8.50బిహెచ్‌పి పవర్ మరియు 10.54ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. దీనిని స్టాండర్డ్, స్టాండర్డ్ అల్లాయ్ మరియు డిఎల్ఎక్స్ వేరియంట్లలో ఎంచుకోవచ్చు.

గంటకు 85కిలోమీటర్ల గరిష్ట వేగం గల దీని మైలేజ్ లీటర్‌కు 85కిలోమీటర్లుగా ఉంది. హోండా ఆక్టివా 125 ఐదు విభిన్న రంగుల్లో లభించును.

  • హైదరాబాదులో హోండా ఆక్టివా 125 ఆన్ రోడ్ ధర రూ. 68,065 లు
  • విజయవాడలో హోండా ఆక్టివా 125 ఆన్ రోడ్ ధర రూ. 68,489 లు

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Read In Telugu To Know About Honda Activa Achieves Another Milestone — Over 15 Million Units Sold
Please Wait while comments are loading...

Latest Photos