డుకాటి కంపెనీని కొనుగోలు చేస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్

Written By:

ఓ ఇండియన్ కంపెనీ ఇటలీకి చెందిన సంస్థను కొనుగోలు చేయడమేంటి అనుకుంటున్నారా...? ఇది అక్షరాలా నిజం. దేశీయ దిగ్గజ క్లాసిక్ బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్‌కు వోక్స్‌వ్యాగన్ గ్రూపుకు చెందిన ఇకానిక్ సూపర్ బైకుల తయారీ సంస్థ డుకాటిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయనుంది.

టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, ఇటాలియన్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ డుకాటిని కొనుగోలు చేయడానికి రాయల్ ఎన్ఫీల్డ్ ఆసక్తికనబరిచినట్లు పేర్కొంది.

ప్రస్తుతం డుకాటి సంస్థ జర్మనీకి చెందిన వోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లో భాగంగా ఉంది. డుకాటిని కొనుగోలు చేయాలంటే వోక్స్‌వ్యాగన్‌తో సంప్రదించవలసి ఉంటుంది.

డీజల్ ఉద్గార కుంభకోణం వోక్స్‌వ్యాగన్ గ్రూపు మీద తీవ్ర ప్రభావం చూపింది. దీని నుండి ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకునేందుకు వోక్స్‌వ్యాగన్ తమ డుకాటి టూ వీలర్ల తయారీ సంస్థను విక్రయించేందుకు సిద్దమైంది.

ఖరీదైన మరియు శక్తివంతమైన మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ డుకాటి మొత్తం విలువ రూ. 10,500 కోట్ల రుపాయలుగా ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ విషయానికి వస్తే, ఐషర్ మోటార్స్ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ పేరుతో క్లాసిక్ తరహా మోటార్ సైకిళ్లను విక్రయిస్తోంది. దేశీయంగా విక్రయాల్లో రెండంకెల వృద్దిని సాధిస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్.

ఇండియన్ మార్కెట్లోనే కాకుండా ప్రపంచ మార్కెట్లో కూడా దీని ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇప్పుడు మరిన్ని విదేశీ మార్కెట్లలో కార్యకలాపాలు విస్తరించే పనిలో రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది.

డుకాటి సంస్థను చేజిక్కించుకోవడం, దాని విలువ మరియు ఇండియన్ మార్కెట్లో దుకాటి సంస్థ యొక్క భవిష్యత్ మార్కెట్ వృద్ది వంటి అంశాల పరంగా రాయల్ ఎన్ఫీల్డ్ అధ్యయనం చేస్తోంది. అయితే దీని గురించి స్పందించడానికి రాయల్ ఎన్ఫీల్డ్ నిరాకరించింది.

ఐషర్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ మరియు సిఇఓ సిద్దార్థ్ లాల్ దిగ్గజ మీడియాతో మాట్లాడుతూ, సంస్థ దానికి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, అప్పుడే మీతో ఏమని పంచుకోను అని చెప్పుకొచ్చాడు. దీర్ఘ దృష్టి ఉన్న మరియు సెలక్టివ్ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ అని తెలిపాడు.

ఇప్పుటికే ఐషర్ సంస్థ స్వీడన్‌కు చెందిన వోల్వో మరియు యుటిలిటి వెహికల్ తయారీ సంస్థ పోలారిస్‌లతో భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకుంది. డుకాటి సంస్థను కొనుగోలు చేసేందుకు ఈ రెండు సంస్థల నిర్ణయాలను పరిగణలోకి తీసుకోనుంది.

ఆడి కు చెందిన వోక్స్‌వ్యాగన్ గ్రూపు 2012 లో 6,000 కోట్ల రుపాయలకు కొనుగోలు చేసింది. ఆ తరువాత కాలంలో 800సీసీ నుండి 1,200సీసీ సామర్థ్యం రేంజ్ ఉన్న మోటార్ సైకిళ్లను అభివృద్ది చేసింది.

డుకాటి వద్ద అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కలదు, రాయల్ ఎన్ఫీల్డ్ డుకాటిని సొంతం చేసుకుంటే భవిష్యత్తులో మరిన్ని అభివృద్ది చెందిన మార్కెట్లలో తన అడుగులు వేసే అవకాశం ఉంది. మరియు డుకాటిలోని టెక్నాలజీని రాయల్ ఎన్ఫీల్డ్ ఉత్పత్తుల్లో ప్రవేశపెడితే విక్రయాలు జోరందుకునే అవకాశం కూడా భాేరీగా ఉంది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Tuesday, May 9, 2017, 12:04 [IST]
English summary
Read In Telugu Royal Enfield Could Buy Ducati From Volkswagen
Please Wait while comments are loading...

Latest Photos