విడుదలకు సిద్దమైన థర్డ్ వెర్షన్ ఆర్15: ఫోటోలు మరియు సాంకేతిక వివరాలు

మూవిస్టర్ యమహా మోటోజిపి రైడర్లు వాలెంటినో రోస్సీ మరియు మ్యావ్రిక్ వినేల్స్ సమక్షంలో ప్రజ ప్రదర్శనకు యమహా తమ ఆర్15 వి3.0 బైకును ఆవిష్కరించింది.

By Anil

భారతీయుల బైకింగ్ చరిత్రలో విప్లవాత్మక బైకు ఆర్15. యమహా మోటార్ ఇండియా మొదటి సారిగా ఈ తొలి ఆర్15 స్పోర్ట్స్ బైకును 2008లో దేశీయంగా విడుదల చేసింది. అయితే అనతి కాలంలోనే భారతీయులకు బడ్జెట్ ఫ్రెండ్లీ బైకుగా నిలిచింది.

యమహా ఆర్15 వి3.0

మంచి అమ్మకాలతో ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైకుగా నిలిచిన ఆర్15 2011 లో స్వల్ప అప్‌గ్రేడ్స్‌కు గురయ్యి, వెర్షన్ 2.0 గా మార్కెట్లోకి విడుదలైంది. అదే విజయాన్ని కొనసాగిస్తూ వస్తున్న ఆర్15 ను ఇప్పుడు వెర్షన్ 3.0 లో ఈ 2017 ఏడాదిలో విడుదల చేయడానికి యమహా సిద్దమవుతోంది.

యమహా ఆర్15 వి3.0

యమహా మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న ఆర్15 కన్నా త్వరలో విడుదల కానున్న వెర్షన్ 3.0 బైకు మరింత స్పోర్టివ్ లక్షణాలతో, శక్తివంతమైనదని తెలిపింది.

యమహా ఆర్15 వి3.0

ఆర్15 మూడవ తరం వేరియంట్ నూతన ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, సరికొత్త్ ఎగ్జాస్ట్ మరియు ఆర్1 ప్రేరిత టెయిల్ లైట్లను కలిగి ఉంది.

యమహా ఆర్15 వి3.0

2017 యమహా ఆర్15 వి3.0 బైకులో 155సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ స్లిప్పర్ క్లచ్ అనుసంధానంతో వచ్చింది.

యమహా ఆర్15 వి3.0

థర్డ్ జనరేషన్ ఆర్15 కు మరింతి స్పోర్టివ్ లుక్ వచ్చేందుకు ముందు వైపున సరికొత్త అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ అందివ్వడం జరిగింది. ప్రస్తుతం అమ్మకాల్లో ఉన్న ఆర్ 15 లో ఉన్న డెల్టా బాక్స్ ఫ్రేమ్ ఆధారంగా నిర్మించబడింది.

యమహా ఆర్15 వి3.0

త్వరలో విడుదల కానున్న వెర్షన్ 3.0 ఆర్15 నుండి 19-21బిహెచ్‌పి మధ్య పవర్ మరియు 17-19ఎన్ఎమ్ మధ్య టార్క్ ఊహించవచ్చు. ప్రపంచంలోనే మొదటి సారిగా నాణ్యత, విశ్వసనీయతతో పాటు ఉత్పమ పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేయగల ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైకును విడుదల చేసిన ఘనత యమహాకే దక్కుతుంది.

యమహా ఆర్15 వి3.0

ప్రత్యేకించి ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైకుల సెగ్మెంట్లో భారీ విక్రయాల దిశగా దూసుకుపోతూ మూడవ తరం సిరీస్‌ ఆర్15 ను యమహా నూతనంగా పిస్టన్, సిలండర్ హెడ్ మరియు కొన్ని మెకానికల్ కాంపోనెంట్స్ మీద పేటెంట్ హక్కులను పొందింది. సరికొత్త డిజైన్‌లో రూపొందించిన ప్రధాన ఇంజన్ విడిభాగాల ద్వారా పవర్, టార్క్ మరియు పనితీరుతో పాటు మైలేజ్ కూడా మెరుగుపడే అవకాశం ఉంది.

యమహా ఆర్15 వి3.0

ట్రాన్స్‌మిషన్ పరంగా ప్రస్తుతం ఉన్న ఆర్15 లోని 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను ఈ నూతన ఆర్15లో అందిస్తోంది.

యమహా ఆర్15 వి3.0

ముందు వైపున డ్యూయల్ పిస్టన్ నిస్సిన్ కాలిపర్ మరియు వెనుక వైపున సింగల్ పిస్టన్ గల డిస్క్ బ్రేకులను అందిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆర్ 15 వి2.0 లో వీటిని గుర్తించవచ్చు.

యమహా ఆర్15 వి3.0

నూతన ఆర్15 లో ఇరువైపులా 17-అంగుళాల అల్లాయ్ చక్రాలున్నాయి. వీటిలో ముందు చక్రానికి 100 సెక్షన్ టైరు మరియు వెనుక వైపున 130 సెక్షన్ గల టైరు కలదు.

యమహా ఆర్15 వి3.0

భద్రత పరంగా దేశీయంగా విడుదలయ్యే మూడవ తరం ఆర్15 లో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను స్టాండర్డ్ మరియు ఆప్షనల్‌గా పరిచయం చేయనుంది. 2017 ఆర్15 ప్రత్యేకించి మోటోపిజి కలర్‌లో విడుదల కానుంది. అవి నీలం మరియు తెలుపు కాంబినేషన్లతో పాటు గ్రే/వైట్/రెడ్ రంగుల కలయికతో రానుంది.

యమహా ఆర్15 వి3.0

దేశీయ ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైకుల సెగ్మెంట్లో కెటిఎమ్ ఆర్‌సి200, హోండా సిబిఆర్ 150ఆర్ మరియు బజాజ్ ఆర్ఎస్200 వంటి వాటికి గట్టిపోటీనివ్వనుంది.

యమహా ఆర్15 వి3.0

కెటిఎమ్ ఈ మధ్యనే ఇండియన్ మార్కెట్లోకి తమ ఆర్‌సి200 మరియు ఆర్‌సి390 మోటార్ సైకిళ్లను విడుదల చేసింది, వీటి గురించి పూర్తి వివరాల కోసం..... ఆర్‌సి200 మరియు ఆర్‌సి390 ఫోటోలు గ్యాలరీ ద్వారా మీకోసం.....

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
2017 Yamaha R15 V3.0 Unveiled By Rossi And Vinales; Images & Details
Story first published: Monday, January 23, 2017, 12:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X