టోక్యో మోటార్ షో: కవాసకి జే కాన్సెప్ట్ ఈవి ఆవిష్కరణ

By Ravi

భవిష్యత్ ప్రపంచం గురించి ఇప్పటికే 20వ శతాబ్ధంలో ఉన్న ప్రజలు, తమ భావితరాల కోసం సరికొత్త ఐడియాలను, సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నారు. 21వ శతాబ్ధంలోని ఓ సరికొత్త ప్రపంచాన్ని చూసే ఆస్కారం ఉంది. ఇదే కోవలో.. కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు భవిష్యత్ రవాణా కోసం సరికొత్త కాన్సెప్ట్ వాహనాలను తయారు చేస్తున్నాయి.

తాజాగా.. జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన దిగ్గజం కవాసకి, 'జే' (J) అనే పేరుతో ఓ కొత్త కాన్సెప్ట్ వాహనాన్ని తయారు చేసింది. జపాన్‌ రాజధానికి టోక్యో నగరంలో జరుగుతున్న 43వ అంతర్జాతీయ మోటార్ షోలో కవాసకి జే ఎలక్ట్రిక్ వెహికల్ కాన్సెప్ట్‌ను కంపెనీ ప్రదర్శనకు ఉంచింది. మూడు చక్రాల కలిగిన ఈ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ వాహనం గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం రండి.

కవాసకి జే కాన్సెప్ట్ ఈవి

మోటార్‌సైకిల్ మరియు ట్రైసైకిళ్ల కలయికే ఈ కవాసకి జే కాన్సెప్ట్. ఇదొక మూడు చక్రాలు కలిగిన ఎలక్ట్రిక్ వాహనం.

కవాసకి జే కాన్సెప్ట్ ఈవి

కవాసకి జే కాన్సెప్ట్‌లో ముందు వైపు రెండు చక్రాలు, వెనుక వైపు ఓ చక్రం ఉంటుంది. ఇది టూవీలర్‌లా కూడా పనిచేస్తుంది. ఇందులో రెండు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అవి - కంఫర్ట్ మోడ్, స్పోర్ట్ మోడ్.

కవాసకి జే కాన్సెప్ట్ ఈవి

కంఫర్ట్ మోడ్‌లో ఫ్రంట్ వీల్స్ దూరంగా జరిగి, రైడర్‌కు కంఫర్టబల్ పొజిషన్‌తో కూడిన రైడ్‌ను ఆఫర్ చేస్తుంది.

కవాసకి జే కాన్సెప్ట్ ఈవి

స్పోర్ట్ మోడ్ వాస్తవానికి వేగం కోసం డిజైన్ చేయబడినది. ఈ మోడ్ ఆన్ చేసినప్పుడు ముందు రెండు చక్రాలుగా ఒక్కటిగా కలిసిపోయి ఇది మోటార్‌సైకిల్‍‌లా మారిపోతుంది.

కవాసకి జే కాన్సెప్ట్ ఈవి

ముందు చక్రాల్లోని ప్రతి చక్రం లోపల అమర్చిన రెండు లివర్ల సాయంతో ఈ వాహనాన్ని స్టీర్ చేయటం జరుగుతుంది.

కవాసకి జే కాన్సెప్ట్ ఈవి

కవాసకి జే కాన్సెప్ట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో కాకుండా, బెస్పోక్ 'గిగాసెల్' నికెల్ మెటల్ హైడ్రైన్ బ్యాటరీలతో నడుస్తుంది.

Most Read Articles

English summary
People from early 20th century had the strangest ideas about how the future would turn out. They presumed by the 21st century civilization would live in the skies, drive flying Cars and travelling by jet packs and what not. We now know none of their dreams have come true.
Story first published: Thursday, November 21, 2013, 14:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more