పోర్షే మకన్ ఎస్‌యూవీ: ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, వేరియంట్లు

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ పోర్షే తమ అధునాతన కాంపాక్ట్ ఎస్‌యూవీ 'మకన్' (Macan)ను లాస్ ఏంజిల్స్ ఆటో షోలో విడుదల చేసింది. గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ సరికొత్త పోర్షే మకన్ ఎస్‌యూవీ ఇండియాకు కూడా రానుంది. పోర్షే నుంచి అత్యంత సరసమైన ధరకే లభ్యం కానున్న ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రపంచ వ్యాప్తంగా మంచి అమ్మకాలను తెచ్చిపెట్టగలదని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇది పోర్షే కయూన్‌కు కాంపాక్ట్ వెర్షన్‌గా అనిపిస్తుంది. పోర్షే ఆవిష్కరించిన మకన్ ఎస్, మకన్ టర్బో వేరియంట్లు వి6 పెట్రోల్ ఇంజన్లతో లభిస్తాయి. ఇందులో ఓ శక్తివంతమైన 254 హెచ్‌పి, 3.0 లీటర్ టర్బో వి6 డీజిల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంది. అమెరికన్ మార్కెట్ కోసమే కాకుండా భారత్ వంటి మార్కెట్ల కోసం ఈ ఇంజన్ అందుబాటులో ఉండనుంది.

మరి ఈ లేటెస్ట్ పోర్షే మకన్ ఎస్‌యూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందామా..?

పోర్షే మకన్ ఎస్‌యూవీ

ఆడి క్యూ5 ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని పోర్షే మకన్ ఎస్‌యూవీని అభివృద్ధి చేశారు. అయితే, ఆడి క్యూ5తో పోల్చుకుంటే ఇది కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది.

పోర్షే మకన్ ఎస్‌యూవీ

పోర్షే మకన్ ఎస్ వేరియంట్లో 340 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే ట్విన్ టర్బో, 3.0 లీటర్ వి6 ఇంజన్‌ను ఉపయోగించారు. పోర్షే మకన్ టర్బో వేరియంట్లో 400 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే ట్విన్ టర్బో, 3.6 లీటర్ వి6 ఇంజన్‌ను ఉపయోగించారు.

పోర్షే మకన్ ఎస్‌యూవీ

ఈ రెండు ఇంజన్లు కూడా 7-స్పీడ్ పిడికె డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌తో నుసంధానం చేయబడి ఉంటాయి. ఈ రెండు వేరియంట్లు కూడా ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభిస్తాయి. ఇందులో ఇతర ఎలక్ట్రానిక్ సాంకేతికతలతో పాటుగా పోర్షే ట్రాక్షన్ మేనేజ్‌మెంట్ ఫీచర్ కూడా ఉంది.

పోర్షే మకన్ ఎస్‌యూవీ

మకన్ ఎస్ వేరియంట్ 5.2 సెకండ్ల వ్యవధిలో 0-60 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది. ఇదే వేగాన్ని టర్బో వేరియంట్ కేవలం 4.6 సెకండ్ల వ్యవధిలోనే చేరుకుంటుంది. ఆప్షనల్ స్పోర్ట్ క్రోనో ప్యాకేజ్ జోడించుకున్నట్లయితే, ఈ సమయం వరుసగా 5.0 సెకండ్లు, 4.4 సెకండ్లకు తగ్గుతుంది.

పోర్షే మకన్ ఎస్‌యూవీ

పోర్షే మకన్ ఎస్ వేరియంట్ గరిష్ట వేగం గంటకు 265.5 కిలోమీటర్లు. పోర్షే మకన్ టర్బో వేరియంట్ గరిష్ట వేగం గంటకు 264 కిలోమీటర్లు.

పోర్షే మకన్ ఎస్‌యూవీ

అన్ని మకన్ ఎస్‌యూవీలు స్పోర్ట్ బటన్‌తో లభిస్తాయి. ఈ బటన్ వలన స్టీరింగ్ మరింత రెస్పాన్సివ్‌గా, సస్పెన్షన్ మరింత స్టిఫ్‌గా, ఇంజన్ పెర్ఫామెన్స్ మరింత మెరుగ్గా ఉండి స్పోర్టీ డ్రైవ్‌ను ఆఫర్ చేస్తుంది.

పోర్షే మకన్ ఎస్‌యూవీ

ఆఫ్ రోడింగ్ కోసం ఒక్క బటన్‌ను ప్రెస్ చేయగానే, ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన ప్రతి ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆఫ్ రోడింగ్ డ్రైవ్‌కు అనుగుణంగా మారిపోతుంది. అంతేకాకుండా, ఎస్‌యూవీ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 1.58 ఇంచ్‌ల నుంచి 9.06 ఇంచ్‌లకు పెరుగుతుంది. అయితే, ఇది కేవలం గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని దిగువన ఉన్నప్పుడే పనిచేస్తుంది.

పోర్షే మకన్ ఎస్‌యూవీ

పోర్షే మకన్ ఇంటీరియర్స్ ఇతర పోర్షే వాహనాల ఇంటీరియర్స్‌ను పోలి ఉంటాయి. ఉదాహరణకు, సెంట్రల్ కంట్రోల్ ప్యానెల్ 918 స్పైడర్ మోడల్‌లోని సెంటర్ కన్సోల్‌ను తలపిస్తుంది. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, బోస్ లేదా బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, హార్డ్ డ్రైవ్ ఆధారిత నావిగేషన్ సిస్టమ్, 7 ఇంచ్ టచ్ స్క్రీన్ మొదలైన అనేక ఎలక్ట్రానిక్ ఫీచర్లను ఇందులో చూడొచ్చు.

పోర్షే మకన్ ఎస్‌యూవీ

పోర్షే మకన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 2014లో భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. దేశీయ విపణిలో దీని ధర రూ.50 లక్షలకు దిగువన ఉండొచ్చని అంచనా. లేటెస్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Most Read Articles

English summary
Porsche Macan compact SUV has finally broken cover at the Los Angeles Auto Show. The Macan is Porsche's new entry level offering and is expected to bring in plenty of sales from markets around the world. 
Story first published: Thursday, November 21, 2013, 10:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X