డ్రైవ్‌స్పార్క్ ద్వారా ఆటో ఎక్స్‌పో 2014 లైవ్ కవరేజ్

Written By:

ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే భారత ఆటోమొబైల్ ఫెస్టివల్ 'ఆటో ఎక్స్‌పో' ఫిబ్రవరి 5, 2014వ తేది నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసినదే. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా కవర్ చేసేందుకు మా డ్రైవ్‌స్పార్క్ బృందం ఇప్పటికే ఢిల్లీకి చేరుకుంది. ఈ ఏడాది జరగుతున్న ఆటో ఎక్స్‌పో 12వ ఎడిషన్‌ది, ఇప్పటికే 11 ఎడిషన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తయ్యాయి.

ఈ 12వ ఎడిషన్ ఆటో ఎక్స్‌పోలో 70 కొత్త కార్లు విడుదల కానున్నాయి. ఇంకా 26 కొత్త కార్లకు వరల్డ్ ప్రీమియర్ నిర్వహించనున్నారు. ఈసారి ఆటో ఎక్స్‌పో రెండు వేదికలలో (గ్రేటర్ నోయిడా, న్యూఢిల్లీ) జరగనుంది. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో మెయిన్ 2014 ఆటో ఎక్స్‌పో నిర్వహిస్తారు (అన్ని కార్ల విడుదలలు ఇక్కడే జరుగుతాయి).

ఇకపోతే విడిభాగాలకు సంబంధించిన ఆటో ఎక్స్‌పోను ఇదివరకు నిర్వహించినట్లుగా న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్వహిస్తారు. కార్లకు సంబంధించిన ఆటో ఎక్స్‌పో గ్రేటర్ నోయిడాలో ఫిబ్రవరి 5 నుంచి 11వ తేది వరకు జరుగుతుంది (ఫిబ్రవరి 5, 6 తేదీలు కేవలం ప్రెస్‌ను మాత్రమే అనుమతిస్తారు, సాధారణ ప్రజలను ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు అనుమతిస్తారు).

ప్రగతి మైదాన్‌లోని కాంపోనెంట్ షోను ఫిబ్రవరి 6 నుంచి 9వ తేది వరకు నిర్వహిస్తారు. 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకి సంబంధించి మినిట్ టూ మినిట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
Auto Expo 2014
English summary
The 12th Auto Expo 2014, kickstarts on 5th February and DriveSpark will cover the entire automotive extravaganza. This year's edition of the Auto Expo promises to be the grandest one with 70 confirmed new launches of which 26 will be world premieres.
Story first published: Monday, February 3, 2014, 20:04 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark