2018 ఇండియన్ స్కౌంట్ బాబర్ రివ్యూ: క్రూయిజర్ బైకులో గుడ్ ఏంటి? బ్యాడ్ ఏంటి?

విపణిలోకి ప్రవేశపెట్టిన ఇండియన్ స్కౌట్ బాబర్ బైకును పరీక్షించి, టెస్ట్ డ్రైవ్ చేసి మా అనుభవాలను పాఠకులతో పంచుకునేందుకు ఇండియన్ మోటార్‌‌సైకిల్స్ తమ బైకును కొన్ని రోజులు డ్రైవ్‌స్పార్క్ బృందానికి అందించ

By Anil Kumar

ఇండియన్ మార్కెట్లో అమ్ముడవుతున్న బాబర్ మోటార్ సైకిళ్లలో 2018 ఇండియన్ స్కౌట్ బాబర్ ఒకటి. ఎక్కువ కెపాసిటి ఉన్న ఖరీదైన బైకులకు చివర్లో బాబర్ అనే పదం ఉంటుంది. అసలు బాబర్ అంటే ఏమిటి? బాబర్ స్టైల్ మోటార్ సైకిళ్లకు బాబర్ సంకేతం, 1930ల కాలంలో ఈ బైకులు ప్రాణం పోసుకున్నాయి. నిజానికి వీటిని బాబ్-జాబ్ అంటారు.

ఇండియన్ స్కౌంట్ బాబర్ రివ్యూ

బాబర్ కస్టమైజ్ చేసి నిర్మించిన బైకు, బరువును తగ్గించడానికి ఎక్ట్సీరియర్ మీద అనవసరపు బాడీ వర్క్స్ తొలగిస్తారు. ప్రధానంగా జరిగే మార్పుల్లో మోడిఫైడ్ ఫ్రేమ్, తక్కువ ఎత్తులో ఉన్న సీటు, పొట్టిగా ఉన్న వీల్ బేస్, పొడవు తగ్గించిన ఫెండర్స్ మరియు పిలియన్ సీటును కూడా తొలగించేస్తారు.

ఇండియన్ స్కౌంట్ బాబర్ రివ్యూ

ఇండియన్ మోటార్‌సైకిల్స్ తమ సరికొత్త స్కౌట్ బాబర్ బైకును ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పాత కాలం నాటి బాబర్ స్టైల్ డిజైన్ మరియు ఆధునిక కాలానికి తగ్గట్లు పర్ఫామెన్స్ అంశాలను జోడించి నిర్మించారు.

విపణిలోకి ప్రవేశపెట్టిన ఇండియన్ స్కౌట్ బాబర్ బైకును పరీక్షించి, టెస్ట్ డ్రైవ్ చేసి మా అనుభవాలను పాఠకులతో పంచుకునేందుకు ఇండియన్ మోటార్‌‌సైకిల్స్ తమ బైకును కొన్ని రోజులు డ్రైవ్‌స్పార్క్ బృందానికి అందించింది. ఇవాళ్టి రివ్యూ స్టోరీ ద్వారా అసలైన ఇండియన్ స్కౌట్ బాబర్ గురించి తెలుకుందాం రండి...

Recommended Video

UM Renegade Thor Electric Cruiser Bike India Launch Details, Price, Specifications - DriveSpark
ఇండియన్ స్కౌంట్ బాబర్ రివ్యూ

డిజైన్ మరియు స్టైల్

ఇండియన్ స్కౌట్ ఆధారంగా ఇండియన్ స్కౌట్ బాబర్ బైకును అభివృద్ది చేశారు. ఇండియన్ మోటార్‌సైకిల్స్ లైనప్‌లోని బెస్ట్ బైకుల్లో ఇదీ ఒకటి. స్కౌట్ బాబర్ సైకిల్ పార్ట్స్, ఇంజన్ మరియు ఇతర ఎలిమెంట్లను స్కౌట్ నుండి పంచుకుంది.

ఇండియన్ స్కౌంట్ బాబర్ రివ్యూ

ముందు మరియు వెనుక వైపున్న ఫెండర్స్ తొలగించడంతో ఇండియన్ ఒక చక్కటి బాబర్ బైకును మార్కెట్ అందించింది. మరియు సీటు ఎత్తును కూడా బాగా తగ్గించింది. మిగతా అంశాల పరంగా అక్కడక్కడ మార్పులు జరిగినప్పటికీ, చూడటానికి దాదాపు ఇండియన్ స్కౌట్ మోటార్‌సైకిల్‌నే పోలి ఉంటుంది.

ఇండియన్ స్కౌంట్ బాబర్ రివ్యూ

రియర్ సస్పెన్షన్ ఎత్తును కొద్ది మేర తగ్గించారు. దీంతో పాటు తక్కువ ఎత్తులో ఉన్న లెథర్ శాడిల్ బ్యాగును కూడా అందివ్వడం జరిగింది. ముందు వైపుకు ఉన్న ఫుట్ పెడల్స్ పొజిషన్ మరియు స్ట్రీట్ ట్రాకర్ హ్యాండిల్ బార్ వంటివి వాలుగా కూర్చుని రైడింగ్ చేసే సౌలభ్యాన్ని కల్పించాయి. వీటన్నింటి అంశాల జోడింపు బైకును చాలా పెద్దగా చూపిస్తుంది.

ఇండియన్ స్కౌంట్ బాబర్ రివ్యూ

అంతే కాకుండా, ఎక్ట్సీరియర్ మీద పలు కాస్మొటిక్ మెరుగులు మరియు పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా, పెద్ద అక్షరాల్లోని బ్రాండ్ మరియు మోటార్ సైకిల్ పేరు గల సరికొత్త ఫ్యూయల్ ట్యాంక్ బ్యాడ్జి మరియు క్రోమ్ మెటీరియల్ ఉన్న ప్రదేశాల్లో మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అందివ్వడం జరిగింది.

ఇండియన్ స్కౌంట్ బాబర్ రివ్యూ

బాబర్ డిజైన్‌కు సరిపోయే విధంగా ఇండియన్ స్కౌట్‌లో వినియోగించిన అవే టైర్లు మరియు చక్రాలను ఇందులో అందించారు. టైర్లు బైకు మొత్తానికి అగ్రెసివ్ రూపాన్నిచ్చాయి. అంతే కాకుండా, హ్యాలోజియన్ బల్బు గల గుండ్రటి హెడ్‌ల్యాంప్ ఉంది, ఏదేమైనప్పటికీ, టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ మరియు టెయిల్ ల్యాంప్స్ ఎల్ఇడి లైట్లలో వచ్చాయి. మరియు బ్యాక్ లైటును రియర్ ఇంటికేటర్‌లో కలిపేశారు.

ఇండియన్ స్కౌంట్ బాబర్ రివ్యూ

అనలాగ్-డిజిటల్ స్పీడో మీటరును కూడా స్కౌట్ నుండి సేకరించారు. చిన్న పరిమాణంలో ఉన్న డిస్ల్పే టైమ్, ఇంజన్ టెంపరేచర్ మరియు ఇంజన్ స్పీడ్ వంటి వివరాలను వెల్లడిస్తుంది. ఇందులో ఫ్యూయల్ గేజ్ మిస్సయ్యింది అయితే లో ఫ్యూయల్ ఇండికేటర్ ఫీచర్ ఉంది.

ఇండియన్ స్కౌంట్ బాబర్ రివ్యూ

ప్రతి ఒక్కరినీ ఆకర్షించే అంశం ఇండియన్ స్కౌట్ బాబర్ బైకు మీద ఉన్న త్రీడీ లోగోలు మరియు బ్యాడ్జిలు. ఈ బైకు మీద సుమారుగా 30 కంటే ఎక్కువ ప్రదేశాల్లో ఇండియన్ మోటార్‌సైకిల్స్ లోగోలు మరియు స్కౌట్ బ్యాడ్జింగ్ ఉన్నాయి.

ఇండియన్ స్కౌంట్ బాబర్ రివ్యూ

పవర్ మరియు హ్యాండ్లింగ్

ఇండియన్ స్కౌట్ బాబర్ బైకులో ఉన్న ఇంజన్ సౌండ్ చాలా బాగుంటుంది. ఇందులో 69-క్యూబిక్ ఇంచ్, లిక్విడ్ కూల్డ్ 1,133సీసీ కెపాసిటి గల వి-ట్విన్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇండియ్ స్కౌట్ మోటార్‌సైకిల్‌లో కూడా ఇదే ఇంజన్ ఉంది. ఇంజన్ హెడ్ మాత్రం సిల్వర్ కలర్‌లో ఉంటుంది. మిగతా అన్ని ఇంజన్ భాగాలు కూడా బ్లాక్ ఫినిషింగ్‌లో ఉన్నాయి. స్మూత్ పవర్ డెలివరీ కోసం కౌంటర్ బ్యాలెన్సర్ మరియు ఎనిమిది-వాల్వుల డిఒహెచ్‌సి వాల్వ్‌ట్రైన్ సిస్టమ్ ఉంది.

ఇండియన్ స్కౌంట్ బాబర్ రివ్యూ

వి-ట్విన్ ఇంజన్ గరిష్టంగా 98.6బిహెచ్‌పి పవర్ మరియు 1700ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 100ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్మూత్ గేర్ షిఫ్టింగ్ గల 6-స్పీడ్ గేర్‌బాక్స్ గుండా పవర్ మరియు టార్క్ బెల్ట్ డ్రైవ్ ద్వారా రియర్ వీల్‌కు సరఫరా అవుతుంది.

ఇండియన్ స్కౌంట్ బాబర్ రివ్యూ

ఇంజన్ అత్యంత శక్తివంతమైనది కావడంతో అద్వితీయమైన పవర్‌ని ఇస్తుంది, దాదాపు ప్రతి మిడ్-రేంజ్ బైకుల్లో కూడా పవర్ అవుట్‌పుట్ ఇలాగే ఉంటుంది. ఓవర్‌టేకింగ్ చాలా సునాయసంగా జరిగిపోతుంది. ఎలాంటి రోడ్ల మీదనైనా డౌన్ షిఫ్టింగ్ కోరకపోవడం దీని ప్రత్యేకత. మరియు విపరీతమైన రద్దీలో కూడా సులభంగా నెట్టుకుపోయే అత్యుత్తమ టార్క్ 1,700ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద లభిస్తుంది. ట్యాంక్‌లో ఇంధనం ఉండాలేగానీ ఎంత దూరాన్నైనా ఎలాంటి అలసట లేకుండా దూసుకెళ్తూనే ఉంటుంది.

ఇండియన్ స్కౌంట్ బాబర్ రివ్యూ

గంటకు 110కిలోమీటర్ల వద్ద చక్కటి క్రూయిజింగ్ ఫీల్ పొందవచ్చు. ఈ వేగాన్ని పెంచితే, వైబ్రేషన్స్ నెమ్మదిగా హ్యాండిల్‌బార్ చేరుకుని, ఇంజన్ వేగం పెరిగేకొద్దీ వైబ్రేషన్స్ తారా స్థాయికి చేరిపోతాయి. అయితే, గంటకు 190కిలోమీర్ల వేగం వద్ద స్పీడ్ తగ్గించాలని ఇంజన్ రైడర్‌కు పరోక్షంగా సూచిస్తుంది.

ఇండియన్ స్కౌంట్ బాబర్ రివ్యూ

ఇండియన్ స్కౌట్ బాబర్‌లో ఉపయోగించిన విడి భాగాలు కూడా అత్యంత నాణ్యతను కలిగి ఉన్నాయి. ఎత్తుగా ఉన్న రైడర్లు, ప్రత్యేకించి బ్యాక్ రెస్ట్ అనుకుని ఎక్కువ దూరం ప్రయాణించలేని వారికి స్కౌట్ బాబర్ బాగా సూట్ అవుతుంది. త్రిభుజాకారంలో సీటుకు క్రింది వైపున సపోర్ట్ ఉంది. దీంతో చాలా సేప్ ప్రయాణం చేసిన తరువాత ఒకసారి క్రిందకు దిగి రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది.

ఇండియన్ స్కౌంట్ బాబర్ రివ్యూ

స్కౌట్ బాబర్ బైకులో అత్యుత్తమంగా ట్యూనింగ్ చేయబడిన క్యాడ్రిడ్జ్ ఫ్రంట్ ఫోర్క్ సస్పెన్షన్ సిస్టమ్ రైడర్‌కు అగ్రెసివ్ ఫీల్ కలిగిస్తుంది. సుమారుగా 245 కిలోలు ఉండటంతో దీని బరువు హెవీగానే ఉంటుంది. అయితే, ఒక్కసారి బైకును నిటారుగా నిలబెట్టి, బైకు మీద కూర్చుంటే బరువు అనే ఫీల్ కలగదు. వేగం పుంజుకునే కొద్దీ చాలా తేలికగా ఉన్నట్లు అనిపిస్తుంది.

ఇండియన్ స్కౌంట్ బాబర్ రివ్యూ

విశాలమైన టైర్లు మరియు సస్పెన్షన్ సిస్టమ్ రైడ్ క్వాలిటీని మరియు ఇండియన్ స్కౌట్ బాబర్ యొక్క మోటార్‌సైకిల్ యొక్క స్టెబిలిటీని మెరుగుపరిచాయి. ధైర్యమున్న రైడర్లు మలుపుల్లో కర్వింగ్ కూడా చేయవచ్చు, అయితే ఫుట్ పెడల్స్ నేలను తాకకుండా జాగ్రతపడటం తప్పనిసరి.

ఇండియన్ స్కౌంట్ బాబర్ రివ్యూ

బ్రేకు విధులను ముందు మరియు వెనుక టైర్ల వద్ద ఉన్న సింగల్ డిస్క్ బ్రేకులు హ్యాండిల్ చేస్తాయి. మా రైడింగ్ అనుభవం మేరకు, బ్రేక్ లీవర్ చాలా యాక్టివ్‌గా ఉంది, దీంతో బ్రేకింగ్ పవర్ చక్రాలకు వెంటనే అంది, బ్రేకులు చాలా ఖచ్చితంగా పడతాయి. అత్యవసరల సందర్భాల్లో సడెన్ బ్రేకులు వేసినపుడు సేఫ్టీ కోసం డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందివ్వడం జరిగింది.

ఇండియన్ స్కౌంట్ బాబర్ రివ్యూ

డ్రైవ్‍స్పార్క్ తెలుగు అభిప్రాయం!

స్కౌట్ బాబర్ బైకుతో, అసలైన బాబర్ ట్రెడిషన్‌లో ఇండియన్ మోటార్‌సైకిల్స్ స్థానం సంపాదించుకుంది. చూడటానికి చాలా గొప్పగా అనిపించే స్కౌట్ బాబర్, అంతే గొప్ప రైడింగ్ మరియు థ్రిల్లింగ్ పర్ఫామెన్స్ దీని సొంతం. ఇండియన్ స్కౌట్ బాబర్ ధర రూ. 11,99,000 లు ఎక్స్-షోరూమ్(ముంబాయ్)గా ఉంది. ఒక రకంగా దీని ధర కాస్త ఎక్కువగానే ఉంది.

ఇండియన్ స్కౌంట్ బాబర్ రివ్యూ

ఇండియన్ స్కౌట్ బాబర్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ విపణిలో ఉన్న హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ మరియు ట్రయంప్ బొన్‌విల్లే బాబర్ బైకులకు గట్టి పోటీనిస్తుంది. మిడ్-వెయిట్ బడా బాబర్ బైకుతో అగ్రెసివ్ రైడింగ్ పొజిషన్ మరియు సోలో రైడింగ్ కోరుకునే కస్టమర్లు ఇండియన్ మోటార్‌సైకిల్స్ అందుబాటులో ఉంచిన స్కౌట్ బాబర్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu: 2018 Indian Motorcycles Scout Bobber Road Test Review - A Big, Bad, Mean-Looking Cruiser
Story first published: Saturday, April 14, 2018, 19:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X