ఫస్ట్ రైడ్ రివ్యూ: టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310- కొనవచ్చా... కొనకూడదా...?

Written By:

దక్షిణ భారత దిగ్గజ టూ వీలర్ల సంస్థ టీవీఎస్ విపణిలోకి కంప్లీట్ రేసింగ్ మోటార్ సైకిల్‌ను లాంచ్ చేసింది. తొలుత 2016 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద అకులా పేరుతో ప్రదర్శించిన టీవీఎస్ ఇప్పుడు అపాచే ఆర్ఆర్ 310 పేరుతో లాంచ్ చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో జరిగిన పలు రేస్‌లలో తమ రేసింగ్ టీమ్‌లతో సుమారుగా 38 సంవత్సరాల నుండి పాల్గొంటూ వస్తోంది. రేసింగ్ పరంగా ఉన్న అనుభవం మరియు జర్మన్ దిగ్గజం బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ భాగస్వామ్యంతో తమ తొలి రేస్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

అపాచే ఆర్ఆర్ 310 ఇప్పుడు విపణిలో ఉన్న కెటిఎమ్ ఆర్‌సి 390, నింజా 300 మరియు బెనెల్లీ 302ఆర్ మోటార్ సైకిళ్లకు పెద్ద సవాళుగా మారింది. టీవీఎస్ రూపొందించిన ఈ ప్యూర్ రేస్ క్రాఫ్ట్ బైకును డ్రైవ్‌స్పార్క్ బృందం చెన్నైలోని మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్ మీద పరీక్షించింది. డిజైన్, ఇంజన్, ఫీచర్లు మరియు పర్ఫామెన్స్ పరంగా మా అనుభవం ఇవాళ్టి రివ్యూ కథనంలో మీకోసం....

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 టెస్ట్ రైడ్ రివ్యూ

టీవీఎస్‌కు చెందిన మొదటి ఫుల్లీ ఫెయిర్డ్ మోటార్ సైకిల్ ఆపాచే ఆర్ఆర్310. 2016 లో ఆవిష్కరించిన అకులా 310 నుండి సేకరించిన షార్క్ చేప తరహా డిజైన్ లాంగ్వేజ్ ఇందులో గమనించవచ్చు. టెస్ట్ రైడ్ కోసం రేస్ ట్రాక్‌ను చేరేంత వరకు ప్రతి చోటా విపరీతమైన ఆదరణ లభించింది.

Recommended Video - Watch Now!
Yamaha Considering Electric Two-Wheelers For India - DriveSpark
టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 టెస్ట్ రైడ్ రివ్యూ

అపాచే ఆర్ఆర్ 310 ఫ్రంట్ డిజైన్‌లో ఫస్ట్ ఇన్ క్లాస్ బై-ఎల్ఇడి ట్విన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఎయిర్ ఇంటేకర్ మీద చక్కగా ఇమిడిపోయాయి. ఇంజన్ పర్ఫామెన్స్ మరియు కూలింగ్ సిస్టమ్ మెరుగుపరిచేందుకు అధిక మొత్తంలో గాలి ఇంజన్‌ను చేరేలా ఎయిర్ ఇంటేకర్ డిజైన్ చేయబడింది. హెడ్ ల్యాంప్స్‌కు ఇరువైపులా ట్రై కలర్ డీకాల్ కలదు.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 టెస్ట్ రైడ్ రివ్యూ

అపాచే ఆర్ఆర్ 310 సైడ్ డిజైన్ విషయంలో కూడా టీవీఎస్ డిజైన్ టీమ్ అద్భుతం చేసింది. పేటెంట్ పొందిన డిఫ్లెక్టర్ కౌల్, ఇంజన్ నుండి వేడి గాలి వెనక్కి వెళ్లేందుకు ప్రత్యేక ఎయిర్ వెంట్స్ వంటివి రైడర్‌కు సౌకర్యాన్ని కలిగిస్తాయి.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 టెస్ట్ రైడ్ రివ్యూ

అపాచే ఆర్ఆర్310 లో రియర్ డిజైన్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ, విభిన్నంగా ఉంది. టీవీఎస్ ఇలా ప్రయత్నించడం ఇదే తొలిసారి. అదే సెగ్మెంట్లో పోటీగా ఉన్న మోడళ్లలో నిలువుగా, అడ్డంగా డిజైన్ చేయబడిన టెయిల్ సెక్షన్‌కు ఇది భిన్నంగా ఉంది. సైలెన్సర్ కాస్త పైవైపుకు ఉన్నట్లు అనిపించింది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 టెస్ట్ రైడ్ రివ్యూ

స్ట్రుమెంట్ క్లస్టర్ బైకును మరో లెవల్‌కు తీసుకెళ్లింది. బైక్ గురించి రైడర్‌కు కావాల్సిన మొత్తం సమాచారం ఇందులో పొందేలా టీవీఎస్ పనితనం ఇందులో కనబడుతుంది. టాకో మీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, రేంజ్, మైలేజ్ మరియు రెండు రేసింగ్ టైమర్లు ఉన్నాయి. వీటిలో ఒకటి 0-60కిమీల వేగాన్ని కొలిస్తే మరొకటి, బైకు మొత్తం వేగాన్ని కొలుస్తుంటుంది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 టెస్ట్ రైడ్ రివ్యూ

రేస్ ట్రాక్ మీద టీవీఎస్ ఆపాచే ఆర్ఆర్ 310 ఎలా పరుగులు పెట్టింది...? రేస్ మోటార్ సైకిల్‌గా తనను తాను నిరూపించుకుందే లేదో చూద్దాం రండి....

రేస్ ట్రాక్ మీద దీని అద్భుతమైన పనితీరు చూస్తే టీవీఎస్ చేసిన రేసెర్చ్ మరియు డెవలప్‌మెంట్ ఏ మాత్రం వృదా కాలేదని తెలుస్తోంది. ప్రతి మలుపులో అత్యంత వేగంగా స్పందించడం, పర్ఫామెన్స్, హ్యాండ్లింగ్, మరియు మలుపుల్లో రోడ్ గ్రిప్ వంటి లక్షణాలు ఇందులో ప్రత్యేకంగా ఉన్నాయి.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 టెస్ట్ రైడ్ రివ్యూ

యాక్సిలరేషన్ పెంచేకొద్దీ 313సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ రివర్స్ ఇంక్లైన్డ్ ఇంజన్ గరిష్టంగా 28ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసింది మరియు దీని పవర్ మనం వెళ్లే వేగానికి తగిన రీతిల్లో ఉత్పత్తవుతోంది. ప్రతికూల సందర్భాల్లో వేగాన్ని సడెన్‌గా తగ్గించడం, మళ్లీ వెంటనే పికప్ పుంజుకోవడం ఇందులో గుర్తించడం జరిగింది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 టెస్ట్ రైడ్ రివ్యూ

టీవీఎస్ రూపొందించిన రేస్ క్రాప్ట్ అపాచే ఆర్ఆర్ 310 గరిష్టంగా 34బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసింది. ఇది విపణిలో ఉన్న కెటిఎమ్ ఆర్‌‌సి390 ఉత్పత్తి చేసే పవర్‌కు సమానం కావడం గమనార్హం. దీని గరిష్ట వేగం గంటకు 160కిలోమీటర్లు మరియు మైలేజ్ అంచనాగా లీటర్‌కు 25 నుండి 30కిమీలుగా ఉంది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 టెస్ట్ రైడ్ రివ్యూ

అపాచే ఆర్ఆర్ 310 బైకు మీద రేసర్ పొజిషన్ చాలా న్యాచురల్‌గా ఉంటుంది. ఇతరులు చూడటానికి ఎలా ఉన్నా, బైకు మీద కూర్చున్నపుడు ఆ ఫీల్ ఖచ్చితంగా పొందుతారు. రియర్ సెట్ పెడల్స్ పొజిషన్ అత్యంత అనుకూలంగా అమర్చడంతో సిటీలో కూడా కంఫర్టపుల్ రైడింగ్ పొందుతారు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అధికంగా ఉండటంతో ఎలాంటి స్పీడ్ బ్రేకర్లనైనా అధిగమిస్తుంది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 టెస్ట్ రైడ్ రివ్యూ

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 మొత్తం బరువు 170కిలోలుగా ఉంది. ఇందులో ముందువైపున 41ఎమ్ఎమ్ చుట్టుకొలత గల కయాబా కంపెనీ అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుకవైపున ప్రిలోడో అడ్జెస్టబుల్ మోనోషాక్ అబ్జార్వర్ కలదు.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 టెస్ట్ రైడ్ రివ్యూ

టీవీఎస్ టీవీఎస్ రేస్ క్రాఫ్ట్ అపాచే ఆర్ఆర్ 310 బైకులో బ్రేకింగ్ డ్యూటీ కోసం ఫ్రంట్ వీల్‌కు 300ఎమ్ఎమ్ చుట్టుకొలత గల డిస్క్ బ్రేక్ మరియు రియర్ వీల్‌కు 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ కలదు. ఇందులో డ్యూయల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో రియర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫీచర్ ఉంది. ఇది హై స్పీడ్‌లో ఉన్నపుడు వెనుక చక్రం గాల్లోకి లేవకుండా అదుపు చేస్తుంది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 టెస్ట్ రైడ్ రివ్యూ

ఇందులో కొన్ని అప్రయోజనాలు కూడా ఉన్నాయి. హ్యాండిల్ సిస్టమ్‌లో టీవీఎస్ ఇంకాస్త పనిచేయాల్సి ఉంది. కార్నర్స్‌లో హ్యాండల్ స్టీరింగ్ చేయడం కాస్ట ఇబ్బందిగా మారుతుంది. హ్యాండిల్ బార్ మీద బలాన్ని ప్రయోగిస్తేనే మలుపులను అధిగమించవచ్చు. ఈ విషయంలో కెటిఎమ్ కాస్త బెటర్ అని చెప్పవచ్చు.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 టెస్ట్ రైడ్ రివ్యూ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇప్పటి వరకు అపాచే ఆర్ఆర్ 310 కోసం వేచి ఉన్న అభిమానులకు చివరగా చెప్పేదేమిటంటే... అపాచే ఆర్ఆర్ 310 రేసింగ్ మోటార్ సైకిల్ టీవీఎస్ చేసిన అద్బుతం. 300సీసీ కెపాసిటి గల సెగ్మెంట్లోకి కాస్త ఆలస్యంగానే వచ్చినప్పటికీ, డిజైన్ మరియు పర్ఫామెన్స్ పరంగా టీవీస్ స్టైల్లో వచ్చిన ఇది పర్ఫెక్ట్ రేసింగ్ బైకుగా నిలిచింది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 టెస్ట్ రైడ్ రివ్యూ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు ఫ్యాక్ట్ షీట్

టీవీఎస్-బిఎమ్‌డబ్ల్యూ భాగస్వామ్యపు ఫ్లాట్‌ఫామ్ అపాచే ఆర్ఆర్ 310 రేసింగ్ మోటార్ సైకిల్‌ను అభివృద్ది చేసింది. బిఎమ్‌డబ్ల్యూ అభివృద్ది చేసిన జి310ఆర్ మరియు ఆపాచే ఆర్ఆర్ 310 మద్య చాలా దగ్గరి పోలికలు ఉంటాయి.

ఛాసిస్, ఇంజన్, గేర్‌బాక్స్, బ్రేకింగ్, సస్పెన్షన్ మరియు ఎలక్ట్రికల్స్ రెండు బైకుల్లో దాదాపు ఒకే విధంగా ఉంటాయి. అయితే, ఇండియన్ రహదారి పరిస్థితులకు అనుగుణంగా టీవీఎస్ ఇంజన్ కంట్రోల్ యూనిట్(ECU) రైడర్లను సంతృప్తిపరుస్తుంది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 టెస్ట్ రైడ్ రివ్యూ

అపాచే ఆర్ఆర్310 ధర

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 బైకు ధర రూ. 2. 05 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది. ధర పరంగా టీవీఎస్ తీసుకున్న నిర్ణయం నిజంగా ధరకు తగ్గ విలువలను కలిగి ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: First Ride Review: TVS Apache RR 310 — Is It A Pure Race craft Worthy 300cc Motorcycle?
Story first published: Wednesday, December 20, 2017, 19:01 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark