క్రికెటర్ల కార్ల ముచ్చట్లు

By

Mahendra Singh Dhoni
మన దేశంలో క్రికెట్ ఓ క్రీడ మాత్రమే కాదు. అదొక మతం, క్రికెటర్లు కేవలం క్రీడాకారులు మాత్రమే కాదు ఎంతో మందికి వారు ఆరాధ్యదైవాలు. గెలిస్తే ఆకాశానికి ఎత్తేయడం, ఓడితే విధ్వంసం సృష్టించడం మన మితిమీరిన అభిమానాన్ని చాటుతంది. వారికి సంభందించిన విషయాలను తెలుసుకోవాలని ఎప్పుడూ ఉబలాట పడే వారి అభిమానుల కోసం వారు వాడే వాహనాల గురించిన వివరాలు అందించేందుకై మా ఈ చిరు ప్రయత్నం. ఇంకెదుకు ఆలస్యం ఓ లుక్ వేయండి.

ముందుగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వాహనం గురించి తెలుసుకుందాం. క్రికెట్ లెజెండ్ బ్రాడ్ మెన్ 29 టెస్ట్ సెంచరీలను చేరుకున్నందుకు ఫియెట్ కంపెనీ వారు సచిన్ కు ఫెరారీ 360 మొదీనా కారును బహూకరించిన విషయం, అప్పుడు చెలరేగిన వివాదం అందరికీ గుర్తు ఉంటుంది. ఈ కారంటే సచిన్ కు చాలా ఇష్టం అట. వీలు దొరికినప్పుడల్లా ఈ కారులో రయ్ మంటూ వెళ్తాడట. కానీ సమయం దొరకడమే గగనం. ఈ కారుతో పాటు సచిన్ కు సిల్వర్ కలర్ బెంజ్ కారు, బ్లాక్ కలర్ ఒపెల్ ఆస్ట్రా కార్లు వున్నాయి.

తర్వాత టీం-ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విషయానికి వద్దాం.. అసలు ధోనీ ధోరణి చూసిన వారెవరికైనా ఆయనకు వాహనాలంటే అమితమైన ఇష్టం అని ఇట్టే అర్థమయిపోతుంది. తాజాగా మహి కోటి రూపాయలు విలువచేసే హమ్మర్ కారును తన తన సొంతం చేసుకున్నాడు. హమ్మర్ కాకుండా మిత్సుబిషి పజేరో కారు కూడా ధోనీ సొంతం. కానీ అసలు విషయం ఏంటంటే ధోనీకి కార్ల కంటే బైకులంటే మహా ఇష్టం. హార్లే డేవిడ్ సన్ తో పాటు యమహా 650 స్పోర్ట్స్ బైకు, కవాసాకీ నింజా బైకులు మహి గ్యారేజీలో వున్నాయి.

ఇక లవర్ బాయ్ గా పేరొందిన యువరాజ్ సింగ్ కు అమ్మాయిల తర్వాత కార్లంటే ప్యాషన్ అట. బియండబ్య్లు కంపెనీకి చెందిన బియండబ్య్లు యం-5, బియండబ్య్లు యం-3 కార్లతో పాటు మెర్స్ కారు యువీ సొంతం. కానీ అన్నిటిలోకి బియండబ్య్లు యం-3 కారంటే యువీకి చాలా ఇష్టమట. అంతే కాకుండా పోర్ష్ 991 కూడా యువీ సొంతం. టి-20 వరల్డ్ కప్ లో 6 సిక్సర్లు బాదినందుకు బిసిసిఐ వైస్ ప్రెసిడెంట్ లలితి మోడీ ఈ కారును యువీకి బహూరించారు.

బజ్జీగా పిలవబడే హర్బజన్ సింగ్ కు తన కొత్త కారు హమ్మర్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే ఇంకా రిజిస్ట్రేషన్ పూర్తి కాకుండానే ఈ కారును నడిపి జరిమానా కట్టేంత ఇష్టం. ఈ కారుతో పాటు ఫోర్డు ఎండియేవర్ బజ్జీ సొంతం.

ఢిల్లీ డేర్ డెవిల్స్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ గంభీర్ టయోటా కరోలా, మారుతీ SX4, సాంత్రో కార్లకు ఓనర్. కానీ బియండబ్య్లు కారు కొనడం తన కల అని చెబుతున్నాడు.

Most Read Articles

Story first published: Tuesday, October 20, 2009, 13:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X