టాటా 'నానో' సురక్షితమేనా??

ప్రపంచంలోనే అతి సరసమైన కారుగా అందరి దృష్టిని ఆకర్షించిన టాటా మోటార్స్ 'నానో' కారు సురక్షితమేనా?? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం ఈ మధ్య జరిగిన ప్రమాదాలే. ఒకే నెలలో మూడు చోట్ల ఈ కారు ప్రమాదానికి గురి కావడంతో సర్వత్రా కారు భద్రతమై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకు ముందు అహ్మదాబాద్, లక్నో లలో ఈ కారు ప్రమాదానికి గురి కాగా తాజాగా జరిగిన ఫ్రమాదానికి మన రాజధాని న్యూ ఢిల్లీ వేదికయింది. దీంతో ఈ కారు కొన్న ఆనందంలో వున్న వారు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు.

జరిగిన మూడు ప్రమాదాల్లోనూ కారు స్టీరింగ్ దగ్గర నిప్పు రేగటంతో కారు అగ్నిలో చిక్కుకొంది. దీంతో ఈ కారులో వుంచిన బ్యాటరీలో ఏదో లోపం వుందని, అందువల్లే ఈ ప్రమాదాలు జరిగాయని నిపునులు అనుమానిస్తున్నారు. ఈ కారులో బ్యాటరీ వుంచిన చోటు కూడా సరైంది కాదనే వార్త వినిపిస్తోంది. డ్రైవింగ్ సీటు క్రింద బ్యాటరీ వుంచడం వల్లే ఈ ప్రమాదాలకు కారణమనే మరో వార్త కూడా వినిపిస్తోంది.

దీనిపై వివరణ ఇచ్చిన టాటా మోటార్స్ ఇందులో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్యాటరీలో తలెత్తిన చిన్న లోపం కారణంగానే ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయని వివరణ ఇచ్చింది. కారు ఇంజన్ లో కానీ డిజైన్ లో కానీ మార్పులు చెయ్యాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. కానీ ఆదిలోనే హంస పాదు అన్నట్టుగా జరిగిన ఈ ప్రమాదాలు మాత్రం 'నానో' వినియోగదారున్ని కలవరపెడుతున్నాయి.

కార్లను పోల్చు

టాటా నానో
టాటా నానో వేరియంట్‌ను ఎంచుకోండి
-- పోల్చడానికి కారును ఎంచుకోండి --
Story first published: Tuesday, October 27, 2009, 11:59 [IST]
Please Wait while comments are loading...

Latest Photos