కొత్తవారు తగ్గిన పాతవారు మాత్రం పెరిగారు: మారుతి సుజికి

Maruti Suzuki
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ఉన్న మారుతి సుజికిపై వినియోగదారులు చూపిస్తున్న విశ్వాసానికి కంపెనీ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. మారుతి సుజుకి పాత వినియోగదారులు తమ పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలను సంస్థ ఆస్వాదిస్తోంది. ఓవైపు కొత్తగా వచ్చే వినియోగదారుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. పాత వినియోగదారులు మళ్లీ మళ్లీ తమ చెంతకు రావడం ఆనందంగా ఉందని, ఇది తమ విశ్వసనీయతకు నిదర్శనమని కంపెనీ పేర్కొంది.

తొలిసారిగా తమ వద్దకు వచ్చే వినియోగదారుల సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ వచ్చిందని, గడచిన నాలుగేళ్లుగా చూస్తే తొలిసారిగా వచ్చే వినియోగదారుల సంఖ్య మొత్తం నికర అమ్మకాలలో 52 నుంచి 45 శాతానికి పడిపోయిందని, కానీ ఇదే సమయంలో అదనపు కారు కోసం రెండవసారి తమ వద్దకు వచ్చే పాత వినియోగదారుల సంఖ్య పెరిగిందని కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు. ఏప్రిల్-డిసెంబర్ 2010లో కంపెనీ 6,96,293 యూనిట్లను విక్రయించింది. అంటే భారత కార్ మార్కెట్ మొత్తం నికర విక్రయాల్లో 50 శాతం విక్రయాలు మారుతి సుజుకివే అన్నమాట.

ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత కార్ మార్కెట్ మొదటిసారిగా వాహనాలు కొనుగోలు చేసే వినియోగదారుల నుంచి ప్రోత్సాహకర వృద్ధిని కనబరిచింది. కాగా.. ఇందులో ఎక్కువ శాతం వినియోగదారులు చిన్నకారు మార్కెట్‌పైనే ఆసక్తిని కనబరిచారు. ముఖ్యంగా ఆల్టో, శాంత్రో వంటి చిన్నకార్లు ఎక్కువగా అమ్ముడయినట్లు భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) తెలిపింది. 2009తో పోలిస్తే 2010లో ప్యాసింజర్ కార్ పరిశ్రమ 31.03 శాతం వృద్ధిని కనబరిచి 18,70,483 యూనిట్లను విక్రయించినట్లు ఎస్ఐఏఎమ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Most Read Articles

Story first published: Tuesday, February 1, 2011, 15:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X