పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా ఉత్పత్తి పెంపు

Toyota Etios Liva
గత నెలలో టొయోటా విడుదల చేసిన చిన్న కారు 'ఎతియోస్ లివా' హ్యాచ్‌బ్యాక్ మోడల్ గిరాకీ పెరిగింది. అలాగే, కంపెనీ అందిస్తున్న ఎతియోస్ సెడాన్ వేరియంట్‌కు కూడా డిమాండు ఊపందుకోవడంతో ఉత్పత్తి సామర్థ్యం పెంపుపై టొయోటా దృష్టి సారించిందిం. ఈ మేరకు భారత్‌లో అధిక మొత్తంలో పెట్టుబడులను పెట్టాలని కంపెనీ నిర్ణయించింది. లివా మోడల్‌కు ఇప్పటికే 4,000 యూనిట్లు ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది.

ఈ నేపథ్యంలో భారత ప్లాంట్లలో ఉత్పత్తి ప్రక్రియను వేగవంతం చేసేందుకు దాదాపు 1,650 కోట్ల రూపాయలను పెట్టుబడులుగా వెచ్చించనున్నట్లు జపాన్ ఆటో దిగ్గజం టొయోటా పేర్కొంది. భారత్‌లోని కిర్లోస్కర్ గ్రూపుతో చేతులు కలిపి టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్)గా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ జేవీ నుంచి కిర్లోస్కర్ గ్రూప్ భారత్‌లో ఉత్పత్తి విస్తరణ కోసం 2013 నాటికి రూ. 898 కోట్లను పెట్టుబడులను వెచ్చిస్తుండగా.. టొయోటా రూ. 750 కోట్ల పెట్టుబడులతో 2014 నాటికి అల్యూమినీయం కాస్టింగ్ అండ్ మెషీనింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనుంది.

టొయోటా ఉత్పత్తులను సాధ్యమైనంత వరకూ స్థానికంగా తయారు చేసేందుకు ఈ పెట్టుబడులను వెచ్చిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. టొయోటా మోడళ్లకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా ఉత్పత్తిని చేపట్టి వెయింటింగ్ పీరియడ్‌ను తగ్గించాలనే ఉద్దేశంతో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుకోవాలని సన్నాహాలు చేస్తుంది.

Most Read Articles

English summary
Toyota Kirloskar Motor (TKM) has decided to further increase production. company today announced investment of about Rs 1,650 crore for expansion.
Story first published: Tuesday, June 26, 2012, 16:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X