ఆడి క్యూ3 ఎస్‌యూవీ ధరను పెంచిన ఆడి ఇండియా

Posted By:

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా తాజాగా మార్కెట్లో విడుదల కాంపాక్ట్ లగ్జరీ ఎస్‌యూవీ 'ఆడి క్యూ3' దేశీయ విపణిలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇకపై ఆడి క్యూ3 ధర మరింత ప్రియం కానుంది. వచ్చే నెల నుంచి ఈ కాంపాక్ట్ లగ్జరీ ఎస్‌యూవీ ధర 1 నుంచి 2 శాతం మేర పెరగనుంది.

ఆర్థిక అలజడులు, రూపాయి మారకపు విలువ క్షీణత కారణంగా ఆడి క్యూ3 ఎస్‌యూవీ ధరను 1 శాతం నుంచి 2 శాతం మేర పెంచనున్నామని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ తెలిపారు. ప్రస్తుతం దేశీయ విపణిలో ఆడి క్యూ3 ధరలు రూ.26.21 లక్షల (బేస్ గ్రేడ్) నుంచి రూ.31.49 లక్షల (హై గ్రేడ్) రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలూ ఎక్స్ షోరూమ్, మహారాష్ట్ర).

తాజా పెంపుతో ఆడి క్యూ3 ధర సుమారు రూ.50,000 వరకూ పెరగనుంది. అక్టోబర్ 1, 2012వ తేది నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి 8,000 కార్లు విక్రయించాలనే తమ లక్ష్యాన్ని చేరుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆడి క్యూ3 లగ్జరీ ఎస్‌యూవీ రెండు వేరియంట్లలో, 2.0 టిడిఐ ఇంజన్‌‌తో లభ్యమవుతుంది.

ఆడి క్యూ3 - పూర్తి వివరాలు:

ఆడి క్యూ3 బేస్ గ్రేడ్ ఫీచర్లు:

ఆడి క్యూ3 హై గ్రేడ్ ఫీచర్లు:

ఆడి క్యూ3 కాంపాక్ట్ ఎస్‌యూవీ హైలైట్స్:

* 2.0 లీటర్ టిడిఐ క్వెట్టారో ఇంజన్ - 130 కి.వా. (177 హెచ్‌పి) శక్తి

* ప్రారంభ ధర కేవలం రూ.26.21 లక్షలు (ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర) మాత్రమే.

* ఆడి క్యూ3 ఈ సెగ్మెంట్లో క్వెట్టారో డ్రైవ్‌ట్రైన్‌తో కూడిన మొదటి ఎస్‌యూవీ

English summary
German luxury car manufacturer Audi India has announced an increase in price of its compact luxury SUV - Audi Q3 2.0 TDI between 1 to 2 percent. The new price will be effective from October 1, 2012 on both the high grade and base grade of the 2.0 TDI engine.
Story first published: Thursday, September 27, 2012, 11:02 [IST]
Please Wait while comments are loading...

Latest Photos