షెవర్లే బీట్ ఫేస్‌లిఫ్ట్ టీజర్; ఆటో ఎక్స్‌పోలో విడుదల

By Ravi

అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ ఇండియా అందిస్తున్న బుజ్జి కారు షెవర్లే బీట్‌లో కంపెనీ ఓ కొత్త వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు మేము ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. తాజాగా కంపెనీ ఈ కొత్త మోడల్‌కు సంబంధించిన ఓ టీజర్ ఫొటోను విడుదల చేసింది. ఫిబ్రవరి 5, 2014వ తేది నుంచి ప్రారంభం కానున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కొత్త షెవర్లే బీట్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేయనున్నారు.ట

కొత్త 2014 షెవర్లే బీట్ ఫేస్‌లిఫ్ట్‌‌లో ఫ్రంట్ డిజైన్‌లో మార్పులు చేర్పులు ఉండనున్నాయి. కొత్త గ్రిల్, రీడిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, కొత్త బంపర్ వంటి మార్పులు ఉండనున్నాయి. ఇంటీరియర్స్‌లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా, కొత్త సెంటర్ కన్సోల్, బెటర్ స్టోరేజ్ స్పేస్ వంటి మార్పులు ఉండనున్నాయి. వెనుక వరుసలోని మధ్య సీటులో కూడా అడ్జస్టబల్ హెడ్‌రెస్ట్ ఫీచర్ ఈ కొత్త బీట్‌లో ఉండే అవకాశం ఉంది.

Chevrolet Beat Facelift

జనరల్ మోటార్స్ దాదాపు నాలుగేళ్ల క్రితం షెవర్లే బీట్ హ్యాచ్‌బ్యాక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. కొత్త బీట్‌లో కూడా ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇంజన్లనే కొత్త 2014 బీట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఉపయోగించనున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎల్‌పిజి వేరియంట్ కూడా యధావిధిగా కొనసాగనుంది.

ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో 2014లో షెవర్లే కొత్త బీట్‌ను ఆవిష్కరించడంతో పాటుగా తమ ప్రీమియం ఎస్‌యూవీ షెవర్లే ట్రైల్‌బ్లేజర్‌ను కూడా ఆవిష్కరించనుంది. ఈ రెండు మోడళ్లతో పాటుగా ఆప్షనల్ ఫీచర్లతో కూడిన సెయిల్ యువా హ్యాచ్‌బ్యాక్, సెయిల్ సెడాన్, ఎంజాయ్ ఎమ్‌పివి, కార్వెట్టె స్టింగ్‌రే సి7 స్పోర్ట్స్ కార్ మరియు కమారో సూపర్ కార్లను కూడా ప్రదర్శనకు ఉంచనుంది.

Most Read Articles

English summary
GM India has teased the new Chevrolet Beat which the company will bring to the 2014 Auto Expo. The teaser image only shows the car's silhouette, accompanied by the phrase "Style is coming to take the country by storm"
Story first published: Thursday, January 30, 2014, 15:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X