2015 జెనీవా మోటార్ షో: ఫెరారీ సెర్గియో ఆవిష్కరణ

By Ravi

ఇటాలియన్ కార్ కంపెనీ ఫెరారీ ప్రస్తుతం జెనీవాలో జరుగుతున్న అంతర్జాతీయ ఆటో షోలో ఓ సరికొత్త కారును ప్రదర్శించి, కార్ ప్రియులను ఆకట్టుకుంది. 'ఫెరారీ సెర్గియో' (Ferrari Sergio) పేరిట కంపెనీ ఆవిష్కరించిన ఈ సూపర్ కారు ఆటో మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.

గడచిన 2013వ సంవత్సరంలో జరిగిన జెనీవా ఆటో షోలో ఫెరారీ ప్రదర్శనకు ఉంచిన సెర్గియో కాన్సెప్ట్ వెర్షన్‌కు ఇది ప్రొడక్షన్ వెర్షన్. గడచిన 2012లో కాలం చేసిన ప్రముఖ ఫెరారీ డిజైనర్ సెర్గియో పినిన్‌ఫరీనా జ్ఞాపకార్థం ఈ కాన్సెప్ట్ కారును 2013లో డిజైన్ చేశారు.

ఫెరారీ సెర్గియో సూపర్‌కారుకి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం రండి..!

2015 జెనీవా మోటార్ షో: ఫెరారీ సెర్గియో ఆవిష్కరణ

ప్రముఖ ఫెరారీ డిజైనర్ సెర్గియో పినిన్‌ఫరీనా జ్ఞాపకార్థం తయారు చేసిన కారు కాబట్టే, ఈ మోడల్‌తు ఫెరారీ సెర్గియో అనే పేరును పెట్టారు.

2015 జెనీవా మోటార్ షో: ఫెరారీ సెర్గియో ఆవిష్కరణ

2015 జెనీవా మోటార్ షోలో ఫెరారీ ఆవిష్కరించినది ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మోడల్. ఈ కాన్సెప్ట్‌ను స్ట్రీట్ లీగల్ కారుగా మార్చడానికి ఫెరారీ చాలా కృషి చేసింది.

2015 జెనీవా మోటార్ షో: ఫెరారీ సెర్గియో ఆవిష్కరణ

ఎక్స్‌క్లూజివిటీని మెయింటైన్ చేయటం కోసం ఫెరారీ సెర్గియో మోడల్ ఉత్పత్తి చాలా పరిమితం చేసినట్లు తెలుస్తోంది. కేవలం ఆరు యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేయనున్నారని, ఇప్పటికే దాదాపు అన్ని యూనిట్లు అమ్ముడైపోయాయని సమాచారం.

2015 జెనీవా మోటార్ షో: ఫెరారీ సెర్గియో ఆవిష్కరణ

ఈ ఆరు ఫెరారీ సెర్గియో కార్లను కూడా కస్టమర్ల అభిరుచి మేరకు కస్టమైజ్ చేసి, ప్రత్యేకంగా తయారు చేసి ఇస్తారు. ఇవి ఆరు కూడా ఆరు విశిష్టమైన రంగులలో లభిస్తాయి.

2015 జెనీవా మోటార్ షో: ఫెరారీ సెర్గియో ఆవిష్కరణ

ఫెరారీ సెర్గియో మోడల్‌ను పాపులర్ ఫెరారీ 458 స్పైడర్ మోడల్ ఆధారంగా చేసుకొని తయారు చేశారు.

2015 జెనీవా మోటార్ షో: ఫెరారీ సెర్గియో ఆవిష్కరణ

ఫెరారీ సెర్గియో కారులో ఉపయోగించిన 4.8 లీటర్, వి8 ఇంజన్ గరిష్టంగా 562 హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

2015 జెనీవా మోటార్ షో: ఫెరారీ సెర్గియో ఆవిష్కరణ

ఫెరారీ సెర్గియో గరిష్ట వేగం గంటకు 200 మైళ్లు. ఇది కేవలం 3.2 సెకండ్ల వ్యవధిలోనే 0-62 మైళ్ల వేగాన్ని అందుకుటుంది.

2015 జెనీవా మోటార్ షో: ఫెరారీ సెర్గియో ఆవిష్కరణ

ఫెరారీ 458 స్పైడర్ కన్నా ఫెరారీ సెర్గియో చాలా తేలికగా ఉంటుంది. ఇది రూఫ్ లేకుండా లభిస్తుంది కాబట్టే, తేలికగా ఉంటుంది.

Most Read Articles

English summary
The 2015 Geneva Motor Show is flooded with cars and people. Amongst the concepts and the supercars that were unveiled over the past few days, one very special car needs to be highlighted-the Ferrari Sergio.
Story first published: Friday, March 6, 2015, 14:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X