ఫోర్స్ వన్ ఎల్ఎక్స్ వేరియంట్ డెలివరీలు ప్రారంభం..

Written By:

ప్రముఖ వాణిజ్య వానాల తయారీ సంస్థ ఫోర్స్ మోటార్స్ గడచిన ఆగస్ట్ 2011లో విడుదల చేసిన తమ మొట్టమొదటి ఎస్‌యూవీ 'ఫోర్స్ వన్' (Force One)లో కంపెనీ ప్రకటించిన టాప్-ఎండ్ వేరియంట్ ఎల్ఎక్స్ (LX) డెలివరీలను జూన్ 2, 2014వ తేదీ నుంచి ప్రారంభించినట్లు తెలిపింది. ఫోర్స్ వన్ ఎల్ఎక్స్ వేరియంట్ ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్‌తో లభిస్తుంది.

దేశీయ విపణిలో ఫోర్స్ వన్ ఎల్ఎక్స్ వేరియంట్ ధర రూ.13.98 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఫోర్స్ మోటార్స్ గడచిన సంవత్సరం జులై నెలలో ఓ లోకాస్ట్ వేరియంట్‌ను ఎగ్జిక్యూటివ్ (ఈఎక్స్)ను మరియు ఓ సుపీరియర్ (ఎస్ఎక్స్)ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసినదే. అదే సమయంలో ఫోర్స్ మోటార్స్ లగ్జరీ (ఎల్ఎక్స్) వేరియంట్‌ను కూడా ప్రకటించింది.

అయితే, ఎల్ఎక్స్ వేరియంట్‌ను వాణిజ్య పరంగా విడుదల చేయటానికి మాత్రం కంపెనీకి దాదాపు ఏడాది సమయం పట్టింది. ఫోర్స్ వన్ ఎల్ఎక్స్ ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్లో బోర్గ్ వార్నర్ ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నారు. ఎలక్ట్రానిక్ షిఫ్ట్ సాయంతో దీనిని టూవీల్ డ్రైవ్‌గాను లేదా ఫోర్-వీల్ డ్రైవ్‌గాను మార్చుకోవచ్చు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
Force One LX

ఇంజన్ విషయానికి వస్తే.. ఇందులో మెర్సిడెస్ బెంజ్ నుంచి గ్రహించిన 2.2 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 139 బిహెచ్‌పిల శక్తిని, 321 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఈ కొత్త టాప్-ఎండ్ వేరియంట్‌లో డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్, సైడ్ మిర్రర్లపై ఇండికేటర్స్, లెథర్ సీట్స్, బ్లూటూత్ ఆడియో సిస్టమ్, ఆల్ టెర్రైన్ టైర్లు మరియు క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్లు లేవు, ఎలక్ట్రానిక్ బ్రేక్‌‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) మొదలైన ఫీచర్లు లభ్యం కానున్నాయి.

English summary
Force Motors announced that the deliveries for the Force One's LX variant has started from Monday and will be accompanied by a price tag of Rs. 13.98 lakh (ex-showroom, Delhi).
Story first published: Tuesday, June 3, 2014, 11:28 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark