హోండా నుంచి 3 కొత్త కార్లు - మొబిలో, 2014 జాజ్, వెజెల్

By Ravi

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ భారత మార్కెట్ కోసం మూడు సరికొత్త ఉత్పత్తులను సిద్ధం చేస్తోంది. ఇందులో ఓ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు ఓ ఎమ్‌పివి మోడళ్లు ఉండనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోను వేదికగా చేసుకొని హోండా ఈ కొత్త ఉత్పత్తులను భారత మార్కెట్లో విడుదల చేయనుంది.

ఈ కొత్త ఉత్పత్తులలో బ్రయో ఆధారంగా చేసుకొని తయారు చేసిన కొత్త మల్టీ పర్పస్ వెహికల్ 'మొబిలో', ప్రస్తుతం టోక్యోలో జరుగుతున్న 43వ అంతర్జాతీయ మోటార్ షోలో హోండా ఆవిష్కరించిన కాంపాక్ట్ ఎస్‌యూవీ 'వెజెల్' మరియు జపాన్ మార్కెట్లో ఇటీవలే విడుదల చేసిన సరికొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'ఫిట్/జాజ్' ఉండనున్నాయి.

Honda Mobilo

హోండా మొబిలో
హోండా ఈ ఏడాది మధ్య భాగంలో ఇండోనేషియాలో ఆవిష్కరించిన బ్రయో ఆధారిత ఎమ్‌పివి 'మొబిలో'ను ప్రత్యేకించి భారత్ వంటి మార్కెట్ల కోసం తయారు చేసింది. ఇది ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి ఎర్టిగా, టొయోటా ఇన్నోవా వంటి మోడళ్లకు గట్టి పోటిగా నిలువనుంది. ఇది పెట్రోల్ వెర్షన్‌తో పాటుగా డీజిల్ వెర్షన్‌లోను లభ్యం కానుంది.

హోండా వెజెల్
కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనో డస్టర్ వంటి మోడళ్లకు సవాల్ విసిరేందుకు హోండా ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారు చేసింది. దీని పేరు హోండా వెజెల్‌. ప్రస్తుతం జపాన్‌లో జరగుతున్న టోక్యో మోటార్ షోలో హోండా తమ వెజెల్‌ను ఆవిష్కరించింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ వెర్షన్లతో లభ్యం కానుంది. గ్లోబల్ మార్కెట్ల కోసం ఇందులో హైబ్రిడ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉండనుంది.

హోండా జాజ్
ఇప్పటికే జపాన్ మార్కెట్లో విడుదలై, హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న కొత్త 2014 హోండా జాజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది. జపాన్ మార్కెట్లో ఇది ఫిట్ పేరుతో అమ్ముడుపోతుంది. కొత్త హోండా జాజ్ కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

More from DriveSpark

Article Published On: Friday, November 22, 2013, 11:52 [IST]
English summary
At the 2014 India Auto Expo that will take place in February one manufacturer that will be the center of plenty of attraction will be Honda. 2014 will be time Honda will try and enter the game in the big way with the launch of three new vehicles - an MPV, a compact SUV and a hatchback.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+