నేపాల్ మార్కెట్లో మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు విడుదల

By Ravi

దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విభాగం మహీంద్రా రేవా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న 'మహీంద్రా ఈ2ఓ' (Mahindra e20) ఎలక్ట్రిక్ కారును పొరుగుదేశమైన నేపాల్ మార్కెట్లో విడుదల చేసింది. అక్కడి మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ.22.5 లక్షలుగా ఉంది.

నేపాల్‌లో విడుదలైన మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు ఆరు ఆకర్షనీయమైన రంగులలో లభ్యం కానుంది. రూపాయి విలువతో పోల్చుకుంటే, నేపాల్ రూపాయి విలువ తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇది అక్కడి మార్కెట్లో అంత అధిక వెల పలుకుతోంది.


మహీంద్రా ఈ2ఓ కేవలం 5 గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ అవుతుంది. పూర్తి ఛార్జ్‌పై 100 కిలోమీటర్ల రేంజ్ వరకూ ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ కారులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ లిథియం ఐయాన్ బ్యాటరీల సాయంతో నడుస్తుంది.

ఈ లిథియం ఐయాన్ బ్యాటరీలు సాంప్రదాయ యాసిడ్ బ్యాటరీలతో పోల్చుకుంటే 4 రెట్లు తేలికైనవి మరియు 3 రెట్లు సౌకర్యవంతమైనవే కాకుండా మంచి పెర్ఫామెన్స్‌ను, ధీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉంటాయని కంపెనీ వివరించింది.


ఇందులో ఉపయోగించిన బ్యాటరీల శక్తి సాధారణ సెల్‌ఫోన్లలో ఉపయోగించే 3-4 వేల బ్యాటరీలలో ఉండే శక్తితో సమానం. ఈ కారును ఐఫోన్, ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ వంటి స్మార్ట్ ఫోన్లతో కనెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా మహీంద్రా ఈ2ఓ కారును కంట్రోల్ చేయవచ్చు.

మహీంద్రా ఈ2ఓ కారును స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు, దీని వలన మొబైల్ ద్వారానే ఈ కారును కంట్రోల్ చేసే ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారులో బ్యాటరీ ఛార్జ్ పూర్తిగా ఖాలీ అయిపోతే, రివైవ్ అనే బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా సుమారు 8-10 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

ఈ కారులో 6.2 ఇంచ్ టచ్‌స్క్రీన్ మల్టీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఎమ్‌పి3, ఆడియో వీడియో ప్లేయర్ మాదిరిగా పనిచేయటమేకాకుండా, కారులోని కంప్యూటింగ్ సిస్టమ్‌కు దీనిని అనుసంధానం చేయటం జరుగుతుంది. ఇది నావిగేషన్ సిస్టమ్‌లా కూడా పనిచేస్తుంది.

Mahindra e20 Electric Car 2

ఈ అధునాత నావిగేషన్ సిస్టమ్ సాయంతో, కారులోని బ్యాటరీ సాయంతో ఎంత దూరం ప్రయాణించవచ్చు, ప్రయాణించే మార్గంలో ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడున్నాయ్, సింగిల్ ట్రిప్‌లో ఎంత దూరం ప్రయాణించవచ్చు, రౌండప్‌ ట్రిప్‌లో ఎంత దూరం ప్రయాణించవచ్చు తదితర విషయాలను తెలుసుకోవచ్చు.

మహీంద్రా ఈ2ఓ పూర్తిగా ఆటోమేటిక్ కారు (క్లచ్‌, గేర్లు ఉండవు). ఇది కేవలం 3.9 మీటర్ల టర్నింగ్ రేడియస్‌ను మాత్రమే కలిగి ఉండి, సిటీ రోడ్లకు చక్కగా సరిపోతుంది. ఈ కారులో ఎత్తుగా ఉండే రోడ్లపై సౌకర్యవంతమైన ప్రయాణం కోసం హిల్ హోల్డ్ ఫీచర్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి

Most Read Articles

English summary
Mahindra and Mahindra has launches Mahindra e20, a zero-emission electric car, in Nepal. The Mahindra e2o is available in six attractive colours and it's priced at 22.5 lakhs.
Story first published: Friday, August 16, 2013, 10:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X